
ఉదయ్, నర్గీస్ బ్రేకప్!
ధూమ్-2 నటుడు ఉదయ్ చోప్రాతో నర్గీస్ ఫఖ్రీకి బెడిసిందా.? నిన్నటి వరకు చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన వీరిద్దరూ ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని బాలీవుడ్ సమాచారం. ఉదయ్‌తో తనకు సంబంధం ఉన్నట్లు నర్గీస్ ఫఖ్రీ బహిరంగంగా అంగీకరిం చకపోయినా, ఉదయ్ చోప్రా మాత్రం ఆమెపై తన ప్రేమనంతటినీ ‘ట్విట్టర్’లో కురిపించేవాడు. తనకు కెరీర్ మాత్రమే ముఖ్యమంటూ ఉదయ్ చోప్రా ప్రతిపాదనను నర్గీస్ తిరస్కరించిందని, అందుకే వారి ప్రేమ బెడిసికొట్టిందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.