గాలి కిరీటి ‘వారాహి’ మూవీతో స్టార్‌ హీరోయిన్‌ రీఎంట్రీ | Genelia Deshmukh Re Entry Into South India With Varahi Movie | Sakshi
Sakshi News home page

Gali Kireeti Reddy: హీరోగా గాలి కిరీటి, కీలక పాత్రలో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌

Published Sat, Mar 5 2022 11:01 AM | Last Updated on Sat, Mar 5 2022 12:22 PM

Genelia Deshmukh Re Entry Into South India With Varahi Movie - Sakshi

క‌ర్ణాట‌క మాజీ మంత్రి, మైనింగ్‌ కింగ్‌ గాలి జ‌నార్ద‌న్ రెడ్డి తనయుడు గాలి కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యువ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ప్ర‌ముఖ నిర్మాత‌ సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘వారాహి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన స్క్రీప్ట్‌ వర్క్‌, నటీనటుల ఎంపికను పూర్తి చేసుకున్న ఈ మూవీ నిన్న(మార్చి 4) హైదరాబాద్‌ ఘనంగా ప్రారంభమైంది.  డైరెక్టర్‌ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై ముహుర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. అనంతరం హీరో గాలి కిరీటి లుక్‌ను సంబంధించిన వీడియోను చిత్రం బృందం విడుదల చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో పెళ్లి సందD హీరోయిన్‌ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ జెనిలియా కీలక పాత్ర పోషిస్తోంది. 

తెలుగులో చివరిగా జెనిలియా నా ఇష్టం సినిమాలో కనిపించింది. దాదాపు ఆమె సినిమాలకు దూరమై పదేళ్లు పూర్తయింది. ఈనేపథ్యంలో ఆమె తిరిగి రీఎంట్రీ ఇస్తుండటంతో ఆమె ఫ్యాన్స్‌ అంతా ఖుషి అవుతున్నారు. కాగా ‘సత్యం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మెప్పించిన జెనిలియా బాలీవుడ్‌ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌తో పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. బొమ్మరిల్లులో హాహా హాసిని అంటూ ఆందరిని ఆకట్టుకున్న జెనిలియా ఢీ, రెడీ, ఆరెంజ్ వంటి చిత్రాల్లో నటించిన స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తెలుగులో నితిన్‌, జూ.ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, రానా. మంచు విష్ణు, రామ్‌ పోతినేని వంటి స్టార్‌ హీరోల సరసన నటించిన జెనిలియా తమిళ, హిందీ చిత్రాల్లో సైతం హీరోయిన్‌ నటించింది. అక్కడ కూడా ఆమె మంచి నటిగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో 2013లో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమారులు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement