
హహ్హ.. హాసిని అంటూ అల్లరిపిల్లగా నవ్వుతూ కనిపించే జెనీలియా అంటే అందరికీ ఇష్టం.

సత్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ సాంబ, సై, నా అల్లుడు, హ్యాపీ, ఢీ, రెడీ, ఆరెంజ్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది.

బొమ్మరిల్లు సినిమాతో తన క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. 2012లో నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడింది.

అదే ఏడాది వచ్చిన నా ఇష్టం మూవీతో తెలుగులో చివరిసారి కనిపించింది.

దశాబ్దకాలమవుతున్నా మళ్లీ ఇక్కడ నటించనేలేదు. తెలుగులో తను రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మరి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

















