Genelia DSouza
-
క్యూట్ అందాలతో కవ్విస్తున్న జెనీలియా ఫొటోస్
-
అర్ధరాత్రి బ్రేకప్ అంటూ మెసేజ్.. పిచ్చిదాన్నయ్యా: జెనీలియా
జెనీలియా.. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ కనిపించే ఈ బ్యూటీ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. నటుడు రితేశ్ దేశ్ముఖ్తో లవ్‌లో ఉన్నప్పుడు ఓసారి తను అనుభవించిన బాధను పంచుకుంది. ఇంతకీ ఏమైందో జెనీలియా మాటల్లోనే విందాం.. రితేశ్, నేను ప్రేమించుకుంటున్న రోజుల్లో జరిగిన సంఘటన ఇది. తను చాలా లేట్‌గా నిద్రపోతాడు, నేనేమో ముందుగానే పడుకునేదాన్ని. ఒంటిగంటకు ఆ మెసేజ్ఓ రోజు అతడు ఇంతటితో ఆపేద్దాం అంటూ బ్రేకప్ మెసేజ్ పెట్టాడు. రాత్రి ఒంటిగంటకు ఆ మెసేజ్ పెట్టి పడుకున్నాడు. నేను అది తెల్లవారుజామున రెండున్నరకు చూశాను. నాకేం అర్థం కాలేదు. అసలెందుకిలా మెసేజ్ చేశాడని చాలా ఒత్తిడికి లోనయ్యాను. రాత్రంతా నిద్రపట్టలేదు. పొద్దున తొమ్మిదింటికి అతడు ఎప్పటిలా ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్? అని చాలా సాధారణంగా మాట్లాడాడు. ఏప్రిల్ ఫూల్..అప్పటికే టెన్షన్, బాధలో ఉన్న నేను.. ఇకపై మనం మాట్లాడుకోకూడదు, నేను నీతో మాట్లాడను అని చెప్పాను. అందుకతడు ఏమీ తెలియనట్లు ఏమైంది? ఎందుకలా కోప్పడుతున్నావ్? అని అడిగాడు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావ్? రాత్రి బ్రేకప్ అని మెసేజ్ చేశావ్‌గా అని నిలదీశాను. రితేశ్ నవ్వుతూ.. ఈరోజు ఏప్రిల్ ఫూల్స్ డే. అందుకే అలా చెప్పానన్నాడు. ఇలాంటి విషయాల్లో ఎవరైనా జోక్ చేస్తారా? అని చాలాసేపు క్లాస్ పీకాను.నా అదృష్టంరితేశ్కు మహిళలంటే చాలా గౌరవం. నన్ను ఎంతో బాగా చూసుకుంటాడు. నేను షూటింగ్‌కు వెళ్లినప్పుడు పిల్లలను చూసుకోవడానికి ఇంట్లోనే ఉండిపోతాడు. మనసస్ఫూర్తిగా ఇంట్లో పనులన్నీ చేస్తాడు. ఇలా అన్నీ చూసుకునే పార్ట్నర్ దొరకడం నిజంగా నా అదృష్టం అని జెనీలియా చెప్పుకొచ్చింది.చదవండి: ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్ -
Genelia Deshmukh: హ.హ్హ.. హాసిని.. అల్లరిపిల్లగా నచ్చేసింది (ఫోటోలు)
-
కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా భర్త.. వీడియో వైరల్
మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ ఎమోషనల్ అయ్యారు. తన దివంగత తండ్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి దివంగత కాంగ్రెస్ నేత విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో రితీష్ తాజాగా మాట్లాడారు. ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. నాన్న చనిపోయి 12 ఏళ్లు అయింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.. ఆ సమయంలో వెంటనే ఆయన అన్నయ్య, లాతూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిత్ దేశ్‌ముఖ్ ఓదార్చారు. 'సాహెబ్ (విలాస్‌రావ్ దేశ్‌ముఖ్) మనల్ని విడిచిపెట్టి పన్నెండేళ్లు గడిచాయి. ఆయన లేకపోవడం వల్ల ఎంతో బాధగా ఉంటుంది. అతను ఈ రాష్ట్ర ప్రజల్లో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ప్రకాశిస్తాడు. ఆయన గొప్పతనం ఎప్పటికీ మసకబారదు. అతను ప్రజల కోసం బలంగా నిలబడ్డాడు. తద్వారా ఇప్పుడు మేము, మా పిల్లలు కూడా నిలువెత్తు ఆవశ్యకతను అనుభవిస్తున్నాం. ఈరోజు ఆయన భౌతికంగా లేకపోయినా, మనపై ఆయన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. అది ఈ స్టేజీపైన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ వెలుగుల రూపంలో ప్రకాశవంతంగా కనిపింస్తుంది.' అని రితీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 2012లో హీరోయిన్ జెనీలియాను బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి చివరిగా వేద్ అనే చిత్రంలో జంటగా కనిపించారు.తెలుగులో సూపర్ హిట్ అయిన ‘మజిలీ’ సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. మే 26, 1945న లాతూర్‌లో జన్మించిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్రకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఆగస్టు 14, 2012న మరణించారు. थोरामोठ्यांचा आदर करणं ही महाराष्ट्राची संस्कृती आहे. प्रत्येक घराघरात हेच संस्कार केले जातात. परंतु, जेव्हा स्वार्थाचा विचार मनात येतो, तेव्हा सगळी नाती मागे पडतात आणि अशातच मग घर आणि पक्ष फोडावा लागला तरी कसलाच विचार लोक करत नाही.#Maharashtra #RiteishDeshmukh pic.twitter.com/i8xqWEzEYr — Nationalist Congress Party - Sharadchandra Pawar (@NCPspeaks) February 18, 2024 -
మా మదర్ షూటింగ్స్ కూడా బుక్స్ తీసుకొచ్చేది
-
తెలుగు హీరోస్ కాదు కానీ.. బాలీవుడ్ ఖాన్స్ ఇష్టం
-
తెలుగు హీరోస్ తో యాక్ట్ చేసా కానీ: జెనీలియా డిసౌజా
-
ముచ్చటగా మూడోసారి.. హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ అంటూ కామెంట్స్?
బొమ్మరిల్లు చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ జెనిలీయా. సిద్ధార్థ్‌కు జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో సత్యం చిత్రంతో పరిచయమైన జెనిలీయా.. ఆ తర్వాత సాంబ, హ్యాపీ, సై, మిస్టర్ మేధావి, రెడీ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఆ తర్వాత ఫిబ్రవరి 2012లో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైంది. అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ సందడి చేస్తోంది.తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. ముంబయిలో ఓ ఈవెంట్లో జెనీలియాపై ప్రెగ్నెన్సీ రూమర్స్ ఊపందుకున్నాయి. (ఇది చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) గత రాత్రి ముంబయిలోని ఈవెంట్లో ఫోటోలకు పోజులిచ్చింది ఈ బాలీవుడ్ జంట. అయితే ఆ ఫోటోల్లో బ్లూ డ్రెస్‌లో ఉన్న జెనీలియాకు బేబీ బంప్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియా పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉండగా.. మూడోసారి ప్రెగ్నెంట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరలవుతోంది. ఓ నెటిజన్ కామెంట్స్‌లో రాస్తూ..'జెనీలియా గర్భవతి అయి ఉండొచ్చు' అని రాయగా.. మరో నెటిజన్ 'అవును ఆమె మూడోబిడ్డను ఆశిస్తోంది' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రితేష్, జెనీలియా కలిసి రితీష్ మరాఠీలో దర్శకత్వం వహించిన వేద్‌లో నటించారు. మరోవైపు జెనీలియా ట్రయల్ పీరియడ్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అక్షయ్ కుమార్‌తో కలిసి హౌస్‌ఫుల్ 5తో రితేష్ నటించనున్నారు. (ఇది చదవండి: డిఫరెంట్ ట్రైలర్.. వినాయక చవితికి మూవీ రిలీజ్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అందుకే సినిమాలకు దూరమయ్యాను : జెనీలియా
హా హా హాసినీ అనగానే మనకు గుర్తొచ్చే హీరోయిన్ జెనీలియా. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా కొనసాగిన జెనీలియా పెళ్లి తర్వాత నటనకు దూరమయ్యింది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ఆమె ముంబైలోనే ఉంటూ అక్కడే సెటిల్ అయ్యింది. ఇటీవలె వేద్(మజిలీకి రీమేక్)సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా సాలిడ్ హిట్‌ను సొంతం చేసుకుంది. భర్త రితేష్ డైరెక్షన్లో నటించిన ఆమె ఇందులో సమంత పాత్రను పోషించగా, చైతూ రోల్లో రితేష్ నటించారు. చాలా గ్యాప్ తర్వాత గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన జెనీలియా నటనకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఈ క్రమంలో తన నటనా జీవితంపై జెనీలియా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు పోషించాలనుకున్నా. ఇల్లాలిగా, పిల్లలకు మంచి తల్లిగా పూర్తి సమయం కేటాయించాలనుకున్నా. అందుకే సినిమాలకు దూరమయ్యా. ఇక రీసెంట్గా వేద్ సినిమా విజయం నాలో కొత్త ఉత్సానిచ్చింది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆడియెన్స్ నన్ను నటిగా ఆదరించారు. మళ్లీ మంచి కథలు దొరికితే తప్పకుండా నటిస్తా అంటూ చెప్పుకొచ్చింది. -
అభిమాని కాళ్లు పట్టుకున్న స్టార్ హీరో.. ఫోటో వైరల్
సినిమా స్టార్స్‌కు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్‌తో ఒక్క ఫోటో అయినా దిగాలని చాలామంది కలలు కంటారు. అదే గనుక నిజమైతే వారి ఆనందానికి అవధులు ఉండవు. సరిగ్గా ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది. రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా జంటగా నటిస్తున్న చిత్రం వేద్. తెలుగులో మజిలీ చిత్రానికి రీమేక్ ఇది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఓ కాలేజీ క్యాంపస్‌కు వెళ్లారు చిత్ర యూనిట్. ఆ సమయంలో ఓ యువతి స్టేజ్‌పైకి వచ్చి రితేష్‌తో డ్యాన్స్ చేయాలని ఉందని చెప్పింది. అభిమాని కోరిక మేరకు వెంటనే రితేష్ ఆమెతో కలిసి డ్యాన్స్ చేశాడు. దీంతో ఆమె ఆనందం తట్టుకోలేక ఏడుస్తూ అతడి కాళ్లు పట్టుకుంది. వెంటనే రితేష్ ఆమెను పైకి లేపి ఆమె కాళ్లు తాకడంతో అతని బిహేవియర్‌కు ఫిదా అయిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం రితేష్‌ను చూస్తే అర్థమవుతుందంటూ అతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
విభిన్న కథాంశంగా 'మిస్టర్ మమ్మీ'.. ఆకట్టుకుంటున్న వీడియో సాంగ్
నటనతో పాటు నిజ జీవితంలోనూ ఒక్కటైన జంట రితేష్ దేశ్‌ముఖ్- జెనీలియా. మళ్లీ ఒక దశాబ్దం తర్వాత వీరిద్దరూ వెండితెరపై కనిపించనున్నారు. తాజాగా వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం'మిస్టర్ మమ్మీ' విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో గర్భం దాల్చిన పురుషుడి పాత్రలో రితేష్ దేశ్‌ముఖ్ కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. 'పాపాజీ పేట్ సే' అంటూ సాగే పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌లో రితేశ్ దేశ్‌ముఖ్ ఫర్మామెన్స్ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించింది చిత్రబందం. షాద్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని టీ -సిరీస్ నిర్మిస్తోంది. -
బ్రేక్‌కి బ్రేక్.. రీ ఎంట్రీ ఇస్తున్న అలనాటి తారలు
సిల్వర్ స్క్రీన్ ఎప్పుడు ఆనందపడుతుంది? తన అభిమాన తార సినిమా తెరకు వచ్చినప్పుడు. సిల్వర్ స్క్రీన్ ఎప్పుడు బాధపడుతుంది... తన అభిమాన తార సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పుడు. ఆ బ్రేక్‌కి బ్రేక్ ఇచ్చి ఆ తారలు మళ్లీ సినిమాలు చేస్తే.. రండి.. రండి.. రండి.. మీ రాక ఎంతో ఆనందమండి అని వెండితెర ఆహ్వానించకుండా ఉంటుందా. ఇక కొందరు తారలు బ్రేక్ తర్వాత చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. 28 ఏళ్ల తర్వాత... బ్యాక్ టు బ్యాక్ జాతీయ ఉత్తమ నటిగా (తమిళ చిత్రం ‘వీడు’– 1987, తెలుగు చిత్రం ‘దాసి’– 1988 చిత్రాల్లోని నటనకు) అవార్డులు సాధించిన అర్చన ప్రేక్షకులకు గుర్తుండే ఉంటారు. ‘నిరీక్షణ’, ‘లేడీస్ టైలర్’, ‘భారత్ బంద్’ వంటి తెలుగు చిత్రాల్లో అర్చన యాక్టింగ్ అదుర్స్ అని అప్పట్లో తెలుగు ప్రేక్షకులు కితాబులిచ్చారు. అర్చన కేవలం తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లోనూ సినిమాలు చేశారు. అయితే మిగతా భాషల్లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా తెలుగు తెరపై నల్లపూస అయిపోయారు అర్చన. 1994లో వచ్చిన ‘పచ్చతోరణం’ తర్వాత మరో తెలుగు మూవీలో ఆమె కనిపించలేదు. ఇప్పుడు అర్చన మళ్లీ తెలుగు డైలాగ్స్ చెబుతున్నారు. ఈ డైలాగ్స్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న ‘చోర్ బజార్’ చిత్రం కోసమే. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాశ్ తల్లిగా కనిపిస్తారు అర్చన. ఈ ఏడాదే ‘చోర్ బజార్’ చిత్రం థియేటర్స్‌కు రానున్నట్లుగా తెలిసింది. అంటే.. దాదాపు 28 సంవత్సరాల తర్వాత అర్చన మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారన్నమాట. తమిళంలో ఇరవై.. తెలుగులో పది తెలుగులో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘శివ’లో హీరోయిన్గా చేసిన అమలను అంత ఈజీగా మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. అయితే 1993లో ‘ఆగ్రహం’ తర్వాత అమల తెలుగు సినిమాకు గ్యాప్ ఇచ్చారు. తిరిగి 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత ‘మనం’ (2014) చిత్రంలో అతిథిగా కనిపించినప్పటికీ ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది మాత్రం తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) లోనే అని చెప్పాలి. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రంలో శర్వానంద్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో శర్వా తల్లి పాత్రలో కనిపిస్తారు అమల. దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్లో అమల కనిపించనున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఇక తమిళంలో 1991లో వచ్చిన ‘కర్పూర ముల్లై’ తర్వాత అమల మరో సినిమా చేయలేదు. ఇరవైసంవత్సరాల తర్వాత ‘కణం’ సినిమాతో తమిళ తెరపై ఆమె మళ్లీ కనిపించనున్నారు. రెండు దశాబ్దాలకు మళ్లీ... ‘బద్రి, జానీ’ సినిమాల్లో హీరోయిన్గా నటించిన రేణూ దేశాయ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2003లో వచ్చిన ‘జానీ’ తర్వాత తెలుగులో ఆమె మరో చిత్రం చేయలేదు. 2014లో మరాఠీ చిత్రం ‘ఇష్క్ వాలా లవ్’కి దర్శకత్వం వహించారు కానీ నటిగా వెండితెరపై మాత్రం మెరవలేదు. ఇప్పుడు కనిపించనున్నారు. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’లో ఓ కీ రోల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారామె. ఈ సినిమాకు వంశీ దర్శకుడు. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజయ్యే చాన్స్ ఉంది. పదేళ్ల తర్వాత.. ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’... ఈ డైలాగ్ విన్న వెంటనే జెనీలియా గుర్తు రాకుండా ఉండరు. 2012లో వచ్చిన ‘నా ఇష్టం’ సినిమా తర్వాత జెనీలియా మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు. ఇటీవలే ఆమె ఒక తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కిరీటి (వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు) హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో జెనీలియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత జెనీలియా తెలుగు సినిమావైపు చూశారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ద్విభాషా (తెలుగు, కన్నడం) చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. డబుల్ ధమాకా ‘గోల్కొండ హైస్కూల్’, ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ‘కలర్స్’ స్వాతి ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2017లో వచి్చన ‘లండన్ బాబులు’ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో మరో సినిమా చేయలేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత తెలుగులో ఆంథాలజీ ఫిల్మ్ ‘పంచతంత్రం’ అంగీకరించారు. అలాగే ఈ సినిమాతో పాటు స్వాతి ‘ఇడియట్స్’ అనే ఫిల్మ్ కూడా చేశారు. స్వాతి, నిఖిల్ దేవాదుల, సిద్ధార్థ్ శర్మ, శ్రీ హర్ష ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఆదిత్యా హాసన్ దర్శకుడు. అభిõÙక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి నవీన్ మేడారం షో రన్నర్. ఇలా కమ్బ్యాక్లోనే ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ డబుల్ ధమాకా ఇస్తున్నారు స్వాతి. వీరే కాదండోయ్... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సోనాలీ బింద్రే, రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో మీరా జాస్మిన్ కీ రోల్స్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా తెలుగు సినిమాల పరంగా బ్రేక్‌లో ఉన్న మరికొందరు తారలు కూడా రీ ఎంట్రీ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. -
రీఎంట్రీకి రెడీ..పెళ్లయినా హీరోయిన్స్‌గానే
వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కప్పు కాఫీ... ‘బొమ్మరిల్లు’లో ఇలాంటి డైలాగుల్లో జెనీలియా అమాయకత్వాన్ని మరచిపోలేం. అమ్మాయి.. బాగుంది.. చూడచక్కగా ఉంది.. నటన కూడా బాగుంది. ‘అమ్మాయి బాగుంది’తో తెలుగు తెరకు వచ్చిన మీరా జాస్మిన్‌కి లభించిన ప్రశంసలు.గ్లామర్ మాత్రమే కాదు.. మంచి నటి కూడా.. హిందీలో అనుష్కా శర్మకు దక్కిన అభినందనలు. ఈ ముగ్గురు భామలూ పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ చెప్పారు. ఇప్పుడు బ్రేక్‌కి ఫుల్స్టాప్ పెట్టారు. సినిమాలు సైన్ చేశారు. అభిమానులను ఆనందపరచడానికి మళ్లీ వస్తున్నారు. పెళ్లయిన నాయికలకు ‘లీడ్ రోల్స్’ రావు అనే మాటని ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జ్యోతిక, రాణీ ముఖర్జీ వంటి తారలు అబద్ధం చేశారు. కథానాయికలుగా చేస్తున్నారు. అంతెందుకు? దాదాపు పద్నాలుగేళ్ల గ్యాప్ తర్వాత శ్రీదేవి రీ–ఎంట్రీ ‘ఇంగ్లిష్–వింగ్లిష్’లో చేసిన లీడ్ రోల్‌తోనే జరిగింది. ఆ తర్వాత ‘మామ్’లోనూ లీడ్ రోల్ చేశారామె. శ్రీదేవి హఠాత్తుగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. లేకుంటే ఈ ఫిఫ్టీ ప్లస్ తారను మరిన్ని మెయిన్ రోల్స్‌లో చూడగలిగేవాళ్లం. మామూలుగా హాలీవుడ్లో ఫిఫ్టీ, సిక్స్టీ ప్లస్ తారలు కూడా నాయికలుగా చేస్తుంటారు. ఇండియన్ సినిమాలోనూ అది సాధ్యం అని నిరూపించారు శ్రీదేవి. ఇక రీ ఎంటర్ అవుతున్న తారల్లో జెనీలియా గురించి చెప్పాలంటే.. ‘బొమ్మరిల్లు, రెడీ, శశిరేఖా పరిణయం, ఆరెంజ్’.. ఇలా తెలుగులో మంచి సినిమాలు జెనీలియా ఖాతాలో ఉన్నాయి. 2012లో చేసిన ‘నా ఇష్టం’ తర్వాత ఈ నార్త్ బ్యూటీ తెలుగులో సినిమాలు చేయలేదు. అదే ఏడాది హిందీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రెండు మూడు హిందీ చిత్రాల్లో, ఓ మరాఠీ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించడంతో పాటు కొన్ని చిత్రాలకు నిర్మాతగా చేశారు. 2014లో ఒక బాబుకి, 2016లో ఓ బాబుకి జన్మనిచ్చారు జెనీలియా. ఇక నటిగా కొనసాగాలనుకుంటున్నారు. మరాఠీ సినిమా ‘వేద్’తో ఆమె రీ ఎంట్రీ షురూ అయింది. మరాఠీలో జెనీలియా కథానాయికగా చేస్తున్న తొలి చిత్రం ఇది. అది కూడా ఆమె భర్త రితేష్ దర్శకత్వం వహించనున్న సినిమా కావడం విశేషం. ‘‘నేను మహారాష్ట్రలో పుట్టి, పెరిగాను. కానీ మరాఠీలో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర చేయలేదు. ఆ కొరత తీరుతున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు జెనీలియా. ఇక, మీరా జాస్మిన్ విషయానికొస్తే.. ‘అమ్మాయి బాగుంది’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీ అంతకు ముందే మలయాళ, తమిళ చిత్రాల్లో నటించారు. వాటిలో తమిళ చిత్రం ‘రన్’ తెలుగులోనూ విడుదలైంది. తెలుగులో ‘గుడుంబా శంకర్’, ‘భద్ర’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 2014లో అనిల్ జాన్ని పెళ్లాడిన మీరా ఆ తర్వాత నాలుగైదు సినిమాల్లో నటించారు. వాటిలో అతిథి పాత్రలు ఉన్నాయి. బ్రేక్‌కి ముందు ట్రెడిషనల్ హీరోయిన్ క్యారెక్టర్లు చేసిన మీరా జాస్మిన్ రీ–ఎంట్రీలో అందుకు పూర్తి భిన్నమైన ఇమేజ్‌ని కోరుకుంటున్నట్లున్నారు. మళ్లీ వస్తున్న విషయాన్ని తెలియజేస్తూ, గ్లామరస్‌గా ఫొటోషూట్ చేయించుకున్నారు. అంతేకాదు.. అభిమానులకు అందుబాటులో ఉండాలని సోషల్ మీడియాలోకీ ఎంట్రీ ఇచ్చారు. ‘మక్కళ్’ అనే మలయాళ సినిమా అంగీకరించారు మీరా. ‘అందం హిందోళం.. అదరం తాంబూలం’ అంటూ ‘యముడికి మొగుడు’లో స్టైల్‌గా స్టెప్పులేసిన రాధ 30 ఏళ్ల క్రితం స్టార్ హీరోయిన్. తెలుగులో ‘అగ్నిపర్వతం’, ‘సింహాసనం’, ‘రాముడు భీముడు’ వంటి పలు చిత్రాల్లో కథానాయికగా 1980 నుంచి 1990 వరకూ నాటి తరానికి పాపులర్. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర హీరోలతో నటించారామె. 1991లో వ్యాపారవేత్త రాజశేఖరన్‌ని పెళ్లాడాక సినిమాలకు బ్రేక్ వేశారు. 30ఏళ్ల తర్వాత ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు.. అయితే స్మాల్ స్క్రీన్‌కి. తమిళంలో ఈ మధ్యే ప్రసారం ప్రారంభమైన ‘సూపర్ క్వీన్’కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు రాధ. మంచి పాత్రలు వస్తే సినిమాల్లోనూ నటించే ఆలోచనలో రాధ ఉన్నారని సమాచారం. అటు హిందీ వైపు వెళితే.. అనుష్కా శర్మ వెండితెరపై కనిపించి దాదాపు మూడేళ్లవుతోంది. 2017లో క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లాడాక, బ్రేక్ తీసుకున్నారామె. గత ఏడాది ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ ఐదేళ్ల బ్రేక్‌లో నటించలేదు కానీ, నిర్మాతగా సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు బ్రేక్‌కి ఫుల్స్టాప్ పెట్టి, హీరోయిన్గా ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్’ సినిమాకి సైన్ చేశారు అనుష్క. భారత ప్రముఖ మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. జులన్ పాత్రను అనుష్క చేస్తున్నారు. ‘‘ఇలాంటి ప్రయోజనాత్మకమైన సినిమా ద్వారా వస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు అనుష్కా శర్మ.రాధ, జెనీలియా, మీరా జాస్మిన్, అనుష్కా శర్మ.. వీరి ఎంట్రీ మరికొంతమంది తారలకు ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఇక వీలైతే నాలుగు సినిమాలు లేదా అంతకు మించి.. కుదిరితే లీడ్ రోల్స్‌లో తమ అభిమాన తారలను చూడాలని ఫ్యాన్స్ కోరుకోకుండా ఉంటారా! -
ఎలన్ మస్క్‌కి టాలీవుడ్ ప్రముఖుల రిక్వెస్ట్
Tollywood Stars Welcome Elon Musk After KTR Tweet: తెలంగాణ పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ప్రపంచ అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌పై బీజేపీ నుంచి రాజకీయ విమర్శలు ఎదురవుతుండగా, మరోవైపు ప్రశంసలు సైతం కురుస్తున్నాయి. ప్రముఖ జర్నలిస్టులు, ఎంట్రప్రెన్యూర్లతో పాటు సినీ ప్రముఖులు సైతం కేటీఆర్‌కు మద్ధతు ట్వీట్లు చేస్తూ.. ఎలన్‌మస్క్‌కి ఆహ్వానం పలుకుతున్నారు. .@elonmusk - Come to Hyderabad - India!!! It will be epic to have you 🤍 The Government here in Telangana is terrific too.. — Vijay Deverakonda (@TheDeverakonda) January 15, 2022 Dear @elonmusk we would love to have @Tesla in Telangana ..as we have the best infrastructure and the leading business hub of India @KTRTRS https://t.co/MWa4L2sl2k — Gopichandh Malineni (@megopichand) January 15, 2022 Love this car so so much @elonmusk Feels like hope is around the corner @KTRTRS https://t.co/Ee5qVUz4FW — Genelia Deshmukh (@geneliad) January 15, 2022 Welcome to #Tesla 🚘 @elonmusk sir you have best land& infrastructure in Telangana🙏🏻of course best Minister & Administration @KTRTRS https://t.co/fmJYszN4PP — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) January 15, 2022 ఈమేరకు టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, నిఖిల్ సిద్ధార్థతో పాటు దర్శకుడు గోపిచంద్ మలినేని సైతం కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వాల్ని ప్రశంసిస్తూనే.. టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కి స్వాగతం పలుకుతూ ట్వీట్లు చేశారు. What a Person ❤ Lets Get Tesla to Telangana anna ... @KTRTRS @elonmusk @TelanganaCMO https://t.co/E5yc1QYW5e — Nikhil Siddhartha (@actor_Nikhil) January 15, 2022 నటి జెనిలీయాతో పాటు దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఇందులో ఉన్నారు. ఇక ప్రముఖ జర్నలిస్టులు పంకజ్ పంచౌరీ, సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ చంద్రా సైతం ఉన్నారు. సంబంధిత వార్త: హేయ్ ఎలన్‌మస్క్ .. వెల్కమ్ టూ తెలంగాణ: కేటీఆర్ -
స్టెప్పులతో ఇరగదీసిన జెనీలియా, సల్మాన్ : డ్యాన్సింగ్ వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బర్త్‌డే (డిసెంబరు 27, సోమవారం)సందర్భంగా హీరోయిన్ జెనీలియా డిసౌజా శుభాకాంక్షలు తెలిపారు. అయితే సల్మాన్ ఖాన్‌ను విష్ చేసేందుకు జెనీలియా సోమవారం సాయంత్రం పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. గతంలో జెనీలియా, సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేసిన ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.షేర్ చేసిన కొన్నిగంటల్లో, ఈ క్లిప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. పెద్ద మనసున్న సల్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సంతోషం, ప్రేమ, చక్కటి ఆరోగ్యంతో ఉండేలా ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఆజ్ భాయ్ కా బర్త్‌డే హై." అంటూ జెనీలియా తనఇన్స్టాలో పోస్ట్ చేసింది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులతోపాటు, హీరో, హీరోయిన్ల ద్వారా సల్మాన్‌కు శుభాకాంక్షల వెల్లువ కురిసింది. ముఖ్యంగా సల్మాన్ మాజీ ప్రేయసి, కొత్త పెళ్లి కూతురు, హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా సల్మాన్‌కు బర్త్‌డే విషెస్ అందించింది. కాగా సల్మాన్ ఖాన్ శనివారం రాత్రి పన్వేల్ ఫామ్‌హౌస్‌లో విషం లేని పాము కాటుకు గురయ్యారు. నవీ ముంబైలోని కమోథేలోని ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆదివారం ఉదయం డిశ్చార్జ్ అయిన సల్మాన్ కుటుంబంతో కలిసి సోమవారం తన ఫామ్‌హౌస్‌లో 56వ పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) -
వైరల్ అవుతోన్న జెనిలియా ఎమోషనల్ పోస్ట్
‘బొమ్మరిల్లు’ సినిమాతో హా హా.. హాసిని అంటూ అందరి మనసులో అలా నిలిచిపోయింది నటి జెనిలియా. ఆ తర్వాత ‘రెడీ’, ‘ఢీ’.. సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం పూర్తిగా నటనకు గుడ్‌బై చెప్పి హౌజ్ వైఫ్‌గా మారింది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమారులు. అయితే సినిమాలకు దూరమైనప్పటికీ తన వ్యక్తిగత జీవితం, కుటుంబ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో తరచూ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను పలకరిస్తూ ఉంటుంది. చదవండి: ‘సర్జరీతో అసహ్యంగా మారిన మరో హీరోయిన్’ ఈ నేపథ్యంలో ఇటీవల తన పెద్ద కుమారుడు రియాన్ 7వ పుట్టినరోజు సందర్భంగా, జెనీలియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. రియాన్‌పై ప్రేమ కురిపిస్తూ పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్ల హృదయాలను హద్దుకుంటోంది. దీంతో ఆ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు రియాన్ కోసం ఓ లేఖ రాసుకొచ్చింది జెన్నీ. ‘ప్రియమైన రియాన్! నీ చిట్టి బుర్రలో ఉన్న బోలెడన్ని కోరికలు, ఆశలను కచ్చితంగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా నీకు మాటిస్తున్నా. నువ్వు ఎగరాలనుకున్నప్పుడు నేను నీ రెక్కను కాలేను కానీ, ఆ రెక్కల కింద గాలినవుతా. చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్ ఎంట్రీ.. ప్రతి విషయంలోనూ నువ్వు మొదటి స్థానంలోనే ఉండాలని నేను కోరుకోను. చివరి స్థానంలో ఉన్నా సరే, నీ ప్రత్యేకతల్ని నేను గుర్తిస్తాను. అంతే తప్పించి నిరాశ చెందను. ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటూ, నువ్వు ఒంటరివి కాకుండా చూస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు రియాన్. ఐ లవ్ యూ మై బ్రేవ్ బాయ్’ అంటూ తల్లి ప్రేమను కురిపించింది. ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉంటే తమ అభిమాని హీరోయిన్ జెన్నీ ఇలా ఏమోషనల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జెనిలియా, రితేశ్‌లు తమ కుమారులు ఎప్పుడు సమయంలో కేటాయిస్తుంటారు. ఎక్కడికి వెళ్లిన వారిని వెంట తీసుకుని వారితో సరదాగా గడుపుతుంటారు. View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) -
అమితాబ్ ముందు కంటతడి పెట్టిన జెనీలియా దంపతులు
బాలీవుడ్లో అందమైన కపుల్స్‌లో రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా జంట ఒకటి. ఈ మధ్య ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతున్న ఈ దంపతులు తాజాగా అమితాబ్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 13’ షోకి ప్రత్యేక అతిథులుగా వచ్చారు. అయితే తాజాగా కేబీసీ 13లో పాల్గొన్న ఈ దంపతులు కంటతడి పెట్టారు. కేబీసీ 13 కొత్త ఎపిసోడ్‌కి సంబంధించిన ఈ వీడియోని సోనీ టీవీ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో పోస్ట్ చేసింది. మామూలుగా ఈ షోలో పాల్గొన్న సెలబ్రీటీలు గెలుచుకున్న మనీని క్యాన్సర్ బారిన పడిన పిల్లల వైద్యానికి ఉపయోగిస్తారు. దాని కోసం సహాయం చేయమని కోరుతూ క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు సంబంధించిన వీడియోని రితేష్, జెనీలియా దంపతులకు చూపించారు. అది చూసిన ఆ పిల్లలు ఏం పాపం చేశారని ఇలాంటి శిక్ష అనుభవిస్తున్నారని జెన్నీ కంటతడి పెట్టింది. అది చూసిన రితేష్ సైతం ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయమై ఇలాంటి మంచి పని కోసం కృషి చేస్తున్న అమితాబ్‌ని వారు ప్రశంసించారు. అయితే ఇంతకుముందు ఎపిసోడ్స్‌లో దీపికా పదుకొనే, ఫరా ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, జాకీ ష్రాప్, సునీల్ శెట్టి వంచి బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు పాల్గొన్నారు. షోలో వారు గెలుచుకున్న మొత్తాన్ని క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లల చికిత్స కోసం ఇచ్చారు. చదవండి: ‘వల్గర్ ఆంటీ’ అంటూ ట్రోలింగ్.. జెనీలియా ఘాటు రిప్లై View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
కన్ను కొట్టిన దీప్తి..రాందేవ్ బాబాతో శిల్పా ఆసనాలు
► కన్నుకొట్టిన బిగ్‌బాస్ భామ దీప్తి సునయన ►తన ఇద్దరు పిల్లల కోసం స్పెషల్ పోస్ట్ అంటున్న రష్మిక ►రాందేవ్ బాబాతో శిల్పాశెట్టి యోగాసనాలు View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Varun Sandesh (@itsvarunsandesh) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Kangana Thalaivii (@kanganaranaut) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) -
ప్రీతితో రితేష్.. కోపంగా జెనీలియా.. అసలు నిజం ఇదేనా?
ఐఫా అవార్డ్స్ 2019 సందర్భంగా కలిసిన ప్రీతి జింటా చేతులపై రితేష్ దేశ్‌ముఖ్ ముద్దు పెట్డుకోవడం, ఆ సమయంలో ఆయన భార్య జెనీలియా డిసౌజా కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టడం తెలిసిందే. అనుకోకుండా క్యాప్చర్ అయిన ఆ వీడియో చాలాకాలం తర్వాత బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దానిపై ఎన్నో మీమ్స్, జోకులు హల్చల్ చేశాయి. తాజాగా అలా కోపంగా ఉండడానికి కారణాన్ని తెలియజేసింది జెనీలియా. తాజాగా జెనీలియా తన భర్త రితేష్‌తో కలిసి అర్భాజ్‌ఖాన్ హోస్ట్ చేస్తున్న డిజిటల్ షో ‘పించ్’ సీజన్ 2కి అతిథిగా వచ్చింది. ఆ సమయంలో ఆ వీడియోపై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ గురించి అడగగా.. ‘చాలా కాలం తర్వాత, నేను ఓ అవార్డు ఫంక్షన్‌కు హాజరయ్యాను. కొత్త డ్రెస్ వేసుకొని, హై హీల్స్ వేసుకొని వెళ్లాను. చాలా రోజుల అనంతరం వేసుకున్న హై హీల్స్ నన్ను ఎంతో ఇబ్బంది పెడుతుండగా అలా ఉన్నాను. అలా నేను ఇబ్బంది పడుతుంటే రితేష్, ప్రీతి చేతులపై ముద్దు పెట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో క్యామెరాలో బంధించారు. అంతేకానీ మరేం లేదని’ జెన్నీ తెలిపింది. అయితే ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అంటూ మరో వీడియోను రిలీజ్ చేసింది ఈ నటి. అందులో ఇంటికి రాగానే ఈ భామ.. భర్త రితేష్‌ను కొడుతున్నట్లు, ఆయన వద్దని వేడుకుంటున్నట్లు ఫన్నీగా ఓ వీడియోను చేసింది. దీనిపై టైగర్ ష్రాప్, ప్రీతి జింటా సహా పలువురు ప్రముఖులు స్పందించారు. కాగా వీరిద్దరూ 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కెరీర్లో దూసుకుపోతున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. చదవండి: ‘వల్గర్ ఆంటీ’ అంటూ ట్రోలింగ్.. జెనీలియా ఘాటు రిప్లై View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) -
‘వల్గర్ ఆంటీ’ అంటూ ట్రోలింగ్.. జెనీలియా ఘాటు రిప్లై
సెలబ్రిటీలు ఏం చేసినా వైరల్ అవడం, కొన్నిసార్లు అది ట్రోల్‌కి గురికావడం సాధారణంగా జరుగుతుంటుంది. ఇలాంటివి బాలీవుడ్లో మరి ఎక్కువ. ఇటీవల బీ టౌన్ జంట నటుడు రితేశ్ దేశ్‌ముఖ్, నటి జెనీలియా డిసౌజాకు అలాగే జరిగింది. ఈ ఏడాది హోలీ సందర్భంగా వారి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేయగా కొందరు నెటిజన్లు ‘వల్గర్ ఆంటీ’ అంటూ ట్రోల్ చేశారు. నటుడు అర్బాజ్ ఖాన్ హోస్ట్ చేస్తున్న డిజిటల్ షో ‘పించ్’. ఈ షో సీజన్ 2కి తాజాగా రితేశ్, జెనీలియా జంట అతిథులుగా వచ్చారు. దీంట్లో సెలబ్రిటీలు ట్రోల్‌కి సంబంధించిన కామెంట్స్‌ని చదివి వారి రెస్పాన్స్ తీసుకుంటూ ఉంటాడు. అలాగే ఈ జంటకి సైతం ఓ వీడియో చూపించాడు. అందులో నటి ప్రీతి జింటాని రితేశ్ చేతులపై ముద్దు పెట్టకోగా, జెనీలియా జలసీతో చూస్తూ ఉంది. అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత జెన్నీ కోపంతో భర్తను కొడుతున్నట్లు, ఆయన వద్దు అని వేడుకుంటున్నట్లు ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియోని చూసిన ఓ నెటిజన్ ‘సిగ్గు లేదా, వల్గర్ ఆంటీ. ఎప్పుడూ ఓవర్ యాక్టింగ్ చేస్తుంటావ్. ఇది నీ ముఖానికి సెట్ అవ్వదు’ అని కామెంట్ పెట్టాడు. దీనిపై స్పందించిన నటి జెన్నీ ‘అతని ఇంట్లో పరిస్థితులు బాలేనట్లు ఉన్నాయి అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. భాయ్ సాబ్, మీరు ఇంట్లో బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను’ అంటూ ఘాటుగా స్పందించింది. దీనిపై రితేశ్ స్పందిస్తూ పాపులారిటీ ఉన్నవాళ్లకి ఇలాంటి విమర్శలు మామూలేనని, వాటి గురించి పట్టించుకోకూడదని వ్యాఖ్యానించాడు. అయితే ఈపించ్ షోకి వారు వచ్చిన ఎపిసోడ్ ప్రోమోని యూట్యూబ్‌లో పెట్టగా వైరల్‌గా మారింది. చదవండి: ‘బొమ్మరిల్లు’లో హాసిని పాత్ర నా నిజ జీవితంలోనిది -
‘బొమ్మరిల్లు’లో హాసిని పాత్ర నా నిజ జీవితంలోనిది: డైరెక్టర్
‘బొమ్మరిల్లు’.. ఈ సినిమా పేరు వినగానే మొదట గుర్తొచ్చే పాత్ర ఏంటంటే హా.. హా.. హాసిని. అంతగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తం హీరోయిన్ చూట్లూ తిరిగే ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బొమ్మరిల్లు హిట్‌తో డైరెక్టర్ భాస్కర్ పేరు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌గా మారింది. అంత పెద్ద విజయం సాధించిన ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలను డైరెక్టర్ భాస్కర్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషించిన హాసిని పాత్రను ఎలా క్రియేట్ చేశారన్నది ఈ సందర్భంగా వివరించాడు. చదవండి: ఆ వీడియోలోని వ్యక్తి నేను కాదు.. జో బైడెన్ మీద ఒట్టు!: వర్మ ఆయన మాట్లాడుతూ.. తన నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా హాసిని పాత్రను తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. ‘ఆర్య సినిమాకు పని చేస్తున్న సమయంలో ఈ మూవీ హిట్ అయితే నాతో ఓ సినిమా చేస్తానని రాజు గారు(‘దిల్’ రాజు) మాట ఇచ్చారు. మంచి కథ సిద్దం చేసి తనని కలవమని చెప్పారు. అనుకున్నట్టుగానే ఆర్య హిట్ అయ్యింది. దీంతో ఆయనకు రెండు సార్లు స్క్రిప్ట్‌లు వివరించాను. అవి ఆయనకు నచ్చలేదు. మూడోసారి బొమ్మరిల్లు కథతో వెళ్లాను. ఈ కథ నచ్చింది కానీ, హీరోయిన్ పాత్ర అంతగా లేదు, దాని మీద మరింత వర్క్ చేసి రమ్మన్నారు. దీనికి నేను 15 రోజులు గడువు అడిగాను. హీరోయిన్ పాత్ర ఎలా తీర్చిదిద్దాలని నేను, వాసు వర్మ తెగ ఆలోచించాం. కానీ సరైన లైన్ తట్టట్లేదు. ఇలా 14 రోజులు గడిచాయి. చిరాకు వస్తుంది. 15వ రోజు వచ్చేసింది. రాత్రంతా నిద్ర లేదు’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్ అనుమానాస్పద మృతి.. ఇక ‘ఆ రోజు రాత్రి నేను, వాసు చర్చించుకుంటూనే ఉన్నాం. మాటల మధ్యలో నా జీవితంలో జరిగిన సంఘటనను ఆయనకు చెప్పాను. ఒకమ్మాయిని అనుకోకుండా గుద్ది సారీ చెబితే.. తనొచ్చి ఒకసారి గుద్ది వెళ్లిపోతే కొమ్ములు వస్తాయని మరోసారి ఢీకొట్టి వెళ్లిందని చెప్పాను. అది బాగుందని వాసు అనడంతో ఆ సీన్ రాశాం. ఇక దాని చుట్టూ సన్నివేశాలు అల్లుకుంటూ పాత్రను తీర్చిదిద్దాం. మరుసటి రోజు సాయంత్రం వెళ్లి రాజు గారికి ఈ క్యారెక్టర్ గురించి చెబితే భలే ఉంది అన్నారు. దీంతో ఈ పాత్రకు ఏ హీరోయిన్ కావాలని అడిగారు. జెనీలియాను తీసుకుందామని చెప్పాను. అలా హాసిని పాత్రను చాలా కష్టపడి క్రియేట్ చేశాం’ అని వివరించాడు. కాగా 9 ఆగష్టు 2006 విడుదలైన ఈ చిత్రంలో హీరోగా సిద్దార్థ్ నటించాడు. ప్రకాశ్ రాజ్, జయసుధలు ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: ఫుట్‌బోర్డ్‌పై సమంత, నయన్, విజయ్.. వీడియో వైరల్ -
హల్చల్: జెనిలియా రచ్చ, అల్లు స్నేహా ఛాలెంజ్
♦ ప్రతి రోజు ఫన్డే అంటూ మేకప్ వీడియో షేర్ చేసిన రకుల్ ప్రీతీసింగ్ ♦ వదులుకోవడమే నా పెద్ద విజయం అంటున్న బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ♦ ఒక మంచి రోజు అంటూ కెమెరా పట్టిన బుట్టబోమ్మ పూజ హెగ్డే ♦ అల్టిమేట్ రైడ్ వెనుక ఉండే ప్రాబ్లమ్స్ ఇవీ అంటున్న అక్షయ్ కుమార్ ♦ గ్రూప్ డ్యాన్స్‌లో జెనిలియా, రిషితేష్ దేశ్‌ముఖ్‌లు ఎక్బార్ అంటూ రచ్చ ♦ ఫొటో ఛాలెంజ్ పేరుతో ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసిన అల్లు వారి కోడలు స్నేహరెడ్డి View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) -
హల్చల్ :దిశ-రాహుల్‌ల పెళ్లి సందడి.. స్లిమ్ లుక్‌లో షెహ్నాజ్
♦ స్లిమ్ లుక్‌తో షాకిచ్చిన షెహ్నాజ్ ♦ ఫుల్ జోష్‌లో మెహ్రీన్..రోజుకో పోస్టు ♦ వాటికి 100 మార్కులు ఇస్తానంటున్న శివాత్మిక ♦ కష్టమైన పనులు సింపుల్‌గా ♦ పింక్ అంటే లవ్ అంటున్న కృతి సనన్ ♦ వితికా స్టన్నింగ్ స్టిల్స్ ♦ సంతోషానికి అదే లాంగ్వెజ్ అంటున్న శిల్పా శెట్టి ♦ పెళ్లికి సిద్దమైన దిశ-రాహుల్ View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by DP (@dishaparmar) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Kirti Kulhari (@iamkirtikulhari) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) -
నన్ను ఆశ్చర్యంగా చూస్తుంటే భలే ఉంటుంది: జెనీలియా
వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అన్న హహహ హాసినిని ఎవరు మరిచిపోగలరు? అవును జెనిలియా! అమాయకమైన అందం.. అల్లరి అభినయం ఆమె క్రియేట్ చేసుకున్న బ్రాండ్! మరి ఫ్యాషన్‌లో? చూద్దాం.. జ్యూయెలరీ బ్రాండ్ వాల్యూ చక్కని జ్వాన్ జ్వాన్ అంటే డచ్ భాషలో చక్కదనం అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే జ్వాన్ కలెక్షన్స్ చక్కగా ఉంటాయి. డిజైన్‌తో పాటు దుస్తుల నాణ్యతకూ ప్రాధాన్యం ఇస్తారు. అదే వీరి బ్రాండ్ వాల్యూ. గాంధీనగర్‌కు చెందిన తన్వి సావ్లాని 2016లో సూరత్‌లో ‘జ్వాన్’ను ప్రారంభించింది. మొదట్లో కేవలం తన డిజైన్స్‌కు మాత్రమే పరిమితం చేసింది. కానీ తర్వాత ఔత్సాహిక డిజైనర్స్నూ ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో వాళ్లు డిజైన్ చేసిన దుస్తులనూ అందిస్తోంది. ఇవి ఆన్లైన్ స్టోర్స్‌లోనూ దొరుకుతాయి. ధరలు మధ్యస్తంగా ఉంటాయి. డిజైనర్ వందన జగ్వానీ ప్రముఖ జ్యూయెలరీ డిజైనర్స్‌లో వందన జగ్వానీ ఒకరు. వజ్రాభరణాల ప్రఖ్యాత బ్రాండ్ ‘నోటన్దాస్ జ్యూయెలర్స్’తో కలిసి పనిచేస్తోంది ఆమె. ఈ మధ్యనే తన పేరు మీద ‘వందన వరల్డ్’ జ్యూయెలరీ స్టోర్‌ను ప్రారంభించింది. పలురకాల వజ్రాలను ఉపయోగించి నగలను రూపొందించడం ఆమె ప్రత్యేకత. డైమండ్ నాణ్యత ఆధారంగా ధర ఉంటుంది. డ్రెస్ బ్రాండ్ : జ్వాన్ కలెక్షన్స్ (Zwaan Collections) పేరు: రెడ్ డ్రేప్డ్ టాప్ విత్ రెడ్ ప్యాంట్స్ (Red Draped Top with Red Pants) ధర: రూ. 17,800 'ఇతరులు అనుకున్నదాని కంటే భిన్నంగా కనిపించి, మెప్పించడం నాకు చాలా ఇష్టం.అలా వారు నన్ను ఆశ్చర్యంగా చూస్తుంటే భలే ఆనందంగా ఉంటుంది' – జెనిలియా దేశ్‌ముఖ్ -
కళ్లతోనే మాట్లాడేస్తున్న ముద్దుగుమ్మలు
♦ మేం దాచుకోవాలనుకున్న ఫీలింగ్స్‌ను కళ్లు చెప్పేస్తాయంటోన్న సిమ్రత్ కౌర్ ♦ సెహరి డబ్బింగ్ పూర్తైందంటున్న సిమ్రాన్ చౌదరి ♦ సోహైల్‌తో టీవీ నటి శిల్ప ♦ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానంటూ స్నేహితురాలు నందితకు బర్త్‌డే విషెస్ తెలిపిన జెనీలియా View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Richa Chadha (@therichachadha) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Anchor Shilpa Chakravarthy (@tvshilpa) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Sameera Bharadwaj (@sameerabharadwaj) View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియా.. ఆ హీరోతో సినిమా?
హ..హ..హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి జెనీలియా. బొమ్మరిల్లు సినిమాతో బంపర్‌హిట్ అందుకున్న ఈ బ్యూటీ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వివాహం తర్వాత సినిమాలకు దూరమయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండేది. భర్త రితేష్‌తో కలిసి పలు ఫన్నీ వీడియోలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ట్యాగ్ లైన్‌ను దక్కించుకుంది ఈ జంట. తాజాగా టాలీవుడ్లో రీ ఎంట్రీకి సిద్ధమైందట ఈ భామ. యంగ్ హీరో రామ్‌తో త్వరలోనే ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెడీ సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ జోడీకి యూత్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు జెనీలియా రీ ఎంటట్రీ వార్తలతో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి : నటి ప్రీతికి హీరో ముద్దులు..చిర్రెత్తిన భార్య ఏం చేసిందంటే.. రష్మికకు ప్రపోజ్ చేసిన రౌడీ హీరో.. వీడియో వైరల్ -
ముద్దు వీడియోపై నటి ప్రీతి జింటా రియాక్షన్
ముంబై : ఓ అవార్డు ఫంక్షన్లో నటి ప్రీతి జింటాను హీరో రితేష్ దేశ్‌ముఖ్ ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన భర్త రితేష్..తన కళ్ల ముందే నటి ప్రీతి జింటా చేతులకు ముద్దు పెట్టుకోవడంతో తెగ ఫీల్ అవుతుంటుంది. రితీష్- ప్రీతి జింటాలను చూసి జెనీలియా జలస్‌గా చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంటుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై జెనీలియా ఇటీవలె మరో వీడియోను రిలీజ్ చేసింది. ఆ ఫంక్షన్ అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటూ రితేష్‌ను చితకబాదుతూ ఓ ఫన్నీ వీడియోను రూపొందించింది. దీనిపై నటి ప్రీతి జింటా స్పందించారు. 'చాలా ఫన్నీగా ఉంది..రితేష్- జెనీలియా మీరు ఇలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు తీయండి. లవ్ యూ బోత్' అంటూ కామెంట్ చేసింది. ఇక జెనీలియా- రితేష్‌ల వీడియోపై నటులు టైగర్ ష్రాఫ్, మాధురి దీక్షిత్, సంజయ్ కపూర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) సామాన్యులకూనా, సెలబ్రిటీలకైనా తన ముందే భర్త మరో మహిళతో క్లోజ్‌గా ఉంటే తట్టుకోలేరు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్లోనే ఎలాంటి కంట్రవర్సీలు లేకుండా హ్యాపీగా సాగిపోతున్న జంటల్లో రితేష్- జెనీలియా ముందు వరుసలో ఉంటారు. ఓ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీరు 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పటికప్పుడు క్రేజీ వీడియోలతో ఆకట్టుకునే ఈ జంటకు బాలీవుడ్లో మోస్ట్ లవబుల్ కపుల్స్‌గా పేరుంది. చదవండి : వైరల్ : నటిని ముద్దుపెట్టుకున్న బాలీవుడ్ హీరో హీరో కార్తీక్‌కు కరోనా..టెన్షన్లో కియారా అద్వానీ -
నటిని ముద్దుపెట్టుకున్నహీరో ...జెనీలియా ఎక్స్ప్రెషన్స్
-
నటి ప్రీతికి హీరో ముద్దులు..చిర్రెత్తిన భార్య ఏం చేసిందంటే..
ముంబై : భర్త తన ముందే వేరే మహిళతో క్లోజ్‌గా ఉంటే ఏ భార్యకైనా కోపం వస్తుంది. దీనికి సినిమా స్టార్స్ కూడా అతీతం కాదు. ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉన్నా, భర్త తన కళ్లముందే మరో నటితో సన్నిహితంగా ఉంటే ఈర్వ్స, చిరాకు, కోపం..ఇలా అన్నీ వస్తాయి. హీరోయిన్ జెనీలియాకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ అవార్డు ఫంక్షన్లో జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్..నటి ప్రీతి జింటాను కలిశారు. ఈ సందర్భంగా రితేష్..ప్రీతి చేతులకు ఫ్రెండ్లీగా ముద్దు పెట్టాడు. ఇది చూసి పక్కనే ఉన్న జెనీలియా చాలా అసౌకర్యానికి ఫీల్ అవుతుంటుంది. మీ సంభాషణ ఎప్పుడు ముగిస్తారురా బాబు..అన్నట్లు ఇద్దరినీ చాలా జలస్‌గా చూస్తుంటుంది. నిజానికి ఇది 2019లో ఐఫా అవార్డుల సందర్భంగా జరిగిన సన్నివేశం. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఈ వీడియో బయటికొచ్చొంది. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రితీష్- ప్రీతి జింటాలను చూసి జెనీలియా జలస్‌గా చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంటుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీనిపై పలు స్పూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన జెనీలియా..ఈ ఫంక్షన్ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అంటూ మరో వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఇంటికి రాగానే జెనీలియా..భర్త రితీష్‌ను కొడుతున్నట్లు ఫన్నీగా ఓ వీడియోను చేసింది. దీన్ని రితేష్- ప్రీతి జింటాలకు సైతం ట్యాగ్ చేసింది. ఈ ఫన్నీ వీడియోపై టైగర్ ష్రాప్, ప్రీతి జింటా సహా పలువురు ప్రముఖులు స్పందిచారు. కాగా జెనీలియా-రితేష్ దేశ్‌ముఖ్ 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కెరీర్లో దూసుకుపోతున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా..సోషల్ మీడియాలో మాత్రం క్రేజీ వీడియాలు చేస్తూ ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. చదవండి :జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు త్వరలో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ నటుడు, పిక్స్ వైరల్ -
జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు
ఇటీవల హీరోయిన్ జెనీలియా చేతికి స్వల్ప గాయమైన విషయం తెలిసిందే. దీంతో కొద్ది రోజులుగా ఆమె చేతికి బ్యాండ్‌తోనే కనిపిస్తున్నారు. గాయంతో చేయి పైకి లేపడానికి కూడా కష్టంగా ఉన్న భార్యకు సపర్యలు చేస్తున్నాడు బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్. ఆమె తనంతట తాను జుట్టు వేసుకోవడం కష్టమని అనుకున్నాడో ఏమో కానీ జెనీలియాకు దగ్గరుండి మరీ జుట్టు వేశాడు. శ్రీవారి సేవలకు మురిసిపోయిన ఈ భామ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు సో స్వీట్, బెస్ట్ కపుల్స్ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. ఇక ఎప్పుడూ క్రేజీ పనులు చేసే జెనీలియా హీరో రామ్‌తో ఇన్‌స్టా రీల్స్ చేయించేందుకు ట్రై చేసింది. అయ్యో అయ్యో అయ్యో దానయ్య అంటూ రామ్‌తో స్టెప్పులు వేయించాలని చూసింది. కానీ రామ్ మాత్రం నో అన్నట్లుగా కదలకుండా ఉండిపోవడంతో ఈ రీల్ వీడియో ఫన్నీగా మారిపోయింది. దీంతో 'బాబు గారు ఫస్ట్ టైమ్ రీల్ చేస్తున్నారు కదా, సిగ్గు పడుతున్నారు' అంటూ ఈ వీడియోను సైతం అభిమానులతో పంచుకుంది. చదవండి: హాలీవుడ్‌కి తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ -
అమ్మ పాత చీరతో కొత్త డ్రెస్సు: హీరో
కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకుంటూనే సామన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీపావళి పండగను దేదీప్యమానంగా జరుపుకున్నారు. ఇంటి ముందు దీపాలు వెలిగించడంతో పాటు కొందరు పటాసులు సైతం కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. బాలీవుడ్ నటి జెనీలియా భర్త, నటుడు రితేష్ దేశ్‌ముఖ్ తన పిల్లలతో కలిసి వేడుకల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. రితేష్.. అతడి తల్లి పాత చీరతో కొత్త బట్టలు కుట్టించారు. వాటిని హీరోతో పాటు అతడి పిల్లలు కూడా ధరించారు. దీంతో తండ్రీకొడుకులు ఒకే రంగు దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఈ వీడియోను జెనీలియా చిత్రీకరించారు. ఇక రితేష్ చేసిన పనిని అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. సూపర్ ఐడియా అని ప్రశంసిస్తున్నారు. (చదవండి: అభిమానులకు అక్షయ్ దీపావళి కానుక) కాగా కెరీర్లో దూసుకుపోతున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు జెనీలియా. రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక సినిమాల్లో పెద్దగా కనిపించింది లేదు. కానీ రితేష్ నటించి, నిర్మించే సినిమాల్లో సరదాగా అతిథి పాత్రల్లో మెరుస్తుంటారు. అయితే దక్షిణాదిలో మాత్రం రితేష్‌ను జెనీలియా భర్తగానే చూస్తారు. కానీ అలా అన్నప్పుడు తన ఇగో హర్ట్ అయ్యిందని రితేష్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. (చదవండి: ఆ మాటలకు నా ఇగో హర్ట్ అయ్యింది: జెనీలియా భర్త) View this post on Instagram A post shared by Riteish Deshmukh (@riteishd) -
13 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి బొమ్మరిల్లు
2006లో విడుదలైన బొమ్మరిల్లు సినిమా అందులో నటించిన వారికి, తీసిన మేకర్స్‌కి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల దృష్టిలో నిలిచిపోయింది. దర్శకుడు భాస్కర్ని బొమ్మరిల్లు భాస్కర్‌గా మార్చింది. నిర్మాత దిల్ రాజుకు లాభాల పంట పండించింది. అందరూ ఈ సినిమాను అంతగా ఆధరించారు కాబట్టే తెలుగులోనే కాకుండా ఇతర మూడు భాషల్లో విడుదలై అక్కడ కూడా విజయాలను సాధించింది. తమిళంలో సంతోష్ సుబ్రహ్మణ్యంగా విడుదలైన సినిమాలలో జయం రవి సరసన జెనీలియానే కథానాయికగా నటించి తన నటనతో తమిళ ప్రేక్షకులను కూడా కట్టిపడేసింది. ఇంత మంచి సినిమా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్న నిర్మాత బోణీ కపూర్ 2007లోనే ఈ చిత్ర రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. అప్పటికి ఇంకా సినిమాల్లోకి అడుగుపెట్టని హర్మాన్ భవేజాని హీరోగా పరిచయం చేస్తూ అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఇట్స్ మై లైఫ్ అంటూ బొమ్మరిల్లును హిందీలో రీమేక్ చేశాడు. కానీ షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత సినిమా రిలీజ్ అవ్వలేదు. కారణం ఏదైనా ఆ సినిమా ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు. (నానికి విలన్‌గా మరో యంగ్ హీరో) అయితే 13 సంవత్సరాల తర్వాత ఇట్స్ మై లైఫ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవ్వడం మొదలైన తర్వాత ఎప్పటి నుంచో విడుదలకు నోచుకోని సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వైపు అడుగులేయడం మొదలుపెట్టాయి. ఇట్స్ మై లైఫ్ సినిమాకు కూడా ఇదే మంచి అవకాశం అనుకొని నవంబర్ 29న జీ5 యాప్‌లో విడుదల చేద్దామని నిర్ణయించుకున్నారు. ప్రకాశ్ రాజ్ పాత్రలో సీనియర్ నటుడు నానా పాటేకర్ మనల్ని అలరించనున్నారు. హాసిని లాగా జెనీలియా చేసే క్యూట్ యాక్టింగ్‌ను మళ్లీ మనం చూడబోతున్నాం. -
నాకు కరోనా వస్తుందని అస్సలు అనుకోలేదు
నటి జెనీలియా కోవిడ్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన హోం క్వారంటైన్ అనుభవాలను వివరించారు జెనీలియా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘టెస్ట్ చేయించడం వల్ల కరోనా అని తెలిసింది. లేకపోతే ఎన్నటికి తెలిసేది కాదేమో. ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే.. అందరూ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం. నా విషయానికి వస్తే.. నాకు కరోనా పాజిటివ్ వస్తుందని అస్సలు ఊహించలేదు. ఎందుకంటే నాకు జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కనిపించలేదు. ఇక ఇంటి నుంచి అసలు బయటకే వెళ్లలేదు. కానీ పాజిటివ్ వచ్చింది. దాంతో కాస్త ఆందోళన చెందాను. కానీ వెంటనే నేను వేరే ఇంటికి మారాను. అక్కడే 21 రోజులు క్వారంటైన్లో ఉన్నాను. ఇక నన్ను నేను బిజీగా ఉంచుకునే ప్రయత్నం చేశాను. కుటుంబానికి దూరంగా ఉండటం చాలా కష్టం. ఇంట్లో వేరే గదిలో క్వారంటైన్లో ఉంటే అప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుంది. కనీసం ఇంట్లో వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారు.. ఏం చేస్తున్నారో తెలుస్తుంది. కానీ నేను వేరే ఇంట్లో ఉండటంతో చాలా బాధపడ్డాను. అసలు తగ్గకపోతే ఏంటి పరిస్థితి అనిపించింది. ఇది నిజంగా చాలా కష్టం’ అన్నారు జెనీలియా. (చదవండి: డాక్టర్స్ డే: బాలీవుడ్ జంట కొత్త నిర్ణయం) ఇక పిల్లల గురించి ఎంతో ఆందోళన చెందాను అన్నారు జెనీలియా. ‘రితేష్ వారి బాధ్యత తీసకున్నాడు. చాలా బాగా చూసుకున్నాడు. ఇటు నన్ను.. అటు పిల్లల్ని ఎంతో బాగా చూసుకోగలిగాడు. నిజంగా చాలా అదృష్టవంతురాలిని అనిపించింది. కానీ ఇంటర్నెట్, ఇతర వ్యాపకాలు ఒంటరితనాన్ని దూరం చేయలేవు’ అన్నారు జెనీలియా. కోవిడ్ పట్ల సమాజం తీరు గురించి ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి బాధ్యతారహిత సమాజంలో ఉన్నందుకు క్షమించక తప్పదు అన్నారు. బాలీవుడ్‌తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జెనీలియా.. దక్షిణాదిన అగ్ర తారగా వెలుగొందిన విషయం తెలిసిందే. అరంగేట్ర సినిమాలో తనకు జోడిగా నటించిన రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బాలీవుడ్ అన్యోన్య జంటల్లో ఒకటిగా చెప్పుకొనే రితేశ్-జెనీలియాలకు రియాన్, రేహిల్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా రితేశ్.. మహారాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడన్న సంగతి తెలిసిందే -
హీరోయిన్ జెనీలియా పుట్టిన రోజు స్పెషల్ ఫోటోలు
-
హ్యాపీ బర్త్‌డే జెన్నూ: రామ్
హీరోయిన్ జెనీలియా పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హీరో రామ్ ట్విట్టర్ వేదికగా ఆమెకు బర్త్‌డే విషేస్ తెలిపారు. రామ్, జెనీలియా 2008లో వచ్చిన ‘రెడీ’ చిత్రంలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఈ విషయాన్ని జెనీలియా పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఈ క్రమంలో ఆమె పుట్టిన రోజు సందర్భంగా రామ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎవరినైనా.. ఎప్పుడైనా దేని గురించి అయినా అడగగలిగే అంత అత్యంత నిస్వార్థ, శ్రద్ధగల స్నేహితురాలు నువ్వే. హ్యాపీ బర్త్ డే జెన్నూ. రానున్న సంవత్సరాలు మరింత ఉత్తమంగా ఉండాలని ఆశిస్తున్నాను. త్వరలోనే ఇదే రోజున మనందరం మరోసారి కలుసుకుందాం’ అంటూ ట్వీట్ చేశారు రామ్. అంతేకాక జెనీలియా కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. దీనిలో జెనీలియా, ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్, వారి పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. (సినీ ఇండస్ట్రీపై రామ్ ఆసక్తికర ట్వీట్) Happppyyy Birthday to the most selfless & caring friend anyone can ever ask for! Have the bestest year ahead Genuuu @geneliad ..we should all get together for the 🤘day again sometime.. Lotsa Love..#RAPO pic.twitter.com/HAxpyl2At2 — RAm POthineni (@ramsayz) August 5, 2020 జెనీలియా తెలుగుతో పాటు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించారు. బాలీవుడ్లో కూడా పని చేశారు. ఆ తర్వాత నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్నారు. రామ్ ప్రస్తుతం నటించిన చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్డౌన్ విధించడంతో థియేటర్లన్ని బంద్ అయ్యాయి. దాంతో ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశారని సమాచారం. హీరోయిన్ జెనీలియా పుట్టిన రోజు స్పెషల్ ఫోటోలు ఇక్కడ క్లిక్ చేయండి -
ముందుకు సాగిపోవాలి అంతే: జెనీలియా
‘‘ప్రతీ సినిమా ఎంతో ప్రేమతో, మరెంతో మంది చెమటతో రూపుదిద్దుకుంటుంది. దాని కోసం చాలా మంది తన సర్వస్వాన్ని ధారబోస్తారు. అలాంటి వారు కాస్త గౌరవం కోరుకోవడం సబబే. అలాగే ఓ ఇన్విటేషన్ వస్తుందని ఊహించడం కూడా సరైందే. కనీసం అందుకు సంబంధించిన ఓ చిన్న సమాచారం అందినా బాగుంటుంది. కానీ, కొన్నిసార్లు జీవితమే సరిగ్గా ఉండదు. ముందుకు సాగిపోవాలి అంతే ఫ్రెండ్’’ అంటూ బాలీవుడ్ నటి జెనీలియా డిసౌజా తన స్నేహితుడు, కో- స్టార్ విద్యుత్ జమాల్‌కు అండగా నిలిచారు. కొన్ని సంఘటనలు బాధించేవిగా ఉన్నా వాటిని అలా వదిలేయాలని చెప్పుకొచ్చారు. ఇందుకు బదులిచ్చిన విద్యుత్ జమాల్... ‘మై ఫేవరెట్.. థాంక్యూ’ అంటూ ధన్యవాదాలు తెలిపాడు.( వెండితెరపై ‘1200 కిలో మీటర్ల పయనం’) కాగా లాక్డౌన్ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ సంస్థ డిస్నీ హాట్‌స్టార్.. ‘బాలీవుడ్‌కీ హోమ్డెలివరీ’ అంటూ 7 హిందీ సినిమాలను హాట్‌స్టార్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్(కాంచన రీమేక్), అజయ్ దేవగణ్ ‘భూజ్’, అలియా భట్ సడక్-2, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దిల్ బేచారా, అభిషేక్ బచ్చన్ ‘ది బిగ్బుల్’ సినిమాలతో పాటు ద్యుత్ జమాల్ ‘ఖుదా హాఫీజ్’, కునాల్ కేము ‘లూట్ కేస్’ తదితర సినిమాలతో తన ప్రేక్షకులకు వినోదం అందించనుంది. ఈ నేపథ్యంలో అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్, అభిషేక్ బచ్చన్, ఆలియా భట్‌తో స్టార్ కిడ్, హీరో వరుణ్ ధావన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాడు.(మరేం చేయాలి.. లొంగిపోవాలి అంతే!) ఈ క్రమంలో ఈవెంట్‌కు తమను ఆహ్వానించలేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని తీవ్ర ఆవేదనకు గురైన విద్యుత్ జమాల్, కునాల్ కేము సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన జెనీలియా సహా ఇతర నెటిజన్లు వీరిద్దరికి మద్దతు పలుకుతూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. స్టార్స్, స్టార్ కిడ్స్‌కు మాత్రమే ఎక్కడైనా సముచిత గౌరవం దక్కుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా జెనీలియా, విద్యుత్ జమాల్ ఫోర్స్(వెంకటేష్ ఘర్షణ రీమేక్) సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. My Favourite...Thankyou 🌸 https://t.co/VOxtaaSLfb — Vidyut Jammwal (@VidyutJammwal) June 30, 2020 -
హ్యాపీ బర్త్‌డే పప్పా: రితేశ్ భావోద్వేగం
-
మిస్ యూ పప్పా: హీరో భావోద్వేగం
‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. మిమ్మల్ని రోజూ మిస్సవుతున్నా!!’’ అంటూ బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ తన తండ్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ జయంతి సందర్భంగా భావోద్వేగ వీడియోను షేర్ చేశాడు. హ్యాంగర్‌కు తగిలించి ఉన్న తండ్రి కుర్తా స్లీవ్‌లో తన చేతిని ఉంచిన రితేశ్.. దానిని ఆలింగనం చేసుకుని ఆ చేతితో తన తలను తానే నిమురుకున్నాడు. తండ్రే స్వయంగా దిగివచ్చి తనను ఆత్మీయంగా హత్తుకున్నట్టు ఉద్వేగానికి లోనయ్యాడు. మిస్ యూ నాన్నా అంటూ ట్విటర్ వేదికగా నివాళి అర్పించాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను వీక్షించిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. ‘ఎంత అందమైన వీడియో’అంటూ రితేశ్ ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు. అతడితో పాటు మరికొంత మంది సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.(ప్రముఖ దర్శకుడి ఇంట్లో ఇద్దరికి కరోనా పాజిటివ్) కాగా రితేశ్ భార్య, నటి జెనీలియా సైతం మామగారిని గుర్తు చేసుకుంటూ.. ‘‘నువ్వు గర్వపడే విషయం ఏమిటని టీచర్ రియాన్‌ను అడిగినపుడు.. వాడి సమాధానం.. మా తాతయ్య అని. ఎల్లప్పుడూ మేం మీ సమక్షంలోనే ఉన్నట్లు భావిస్తాం. మీరెక్కడున్నా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారని తెలుసు. మా అందరిలో మీరు జీవించే ఉన్నారు. హ్యాపీ బర్త్‌డే పప్పా’’అని భావోద్వేగపూరిత పోస్టు పెట్టారు. కాగా 1945 మే 26న జన్మించిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్.. మహారాష్ట్ర సీఎంగా, కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. 2012లో కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధితో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. విలాస్‌రావ్ నలుగురు కుమారుల్లో రితేశ్ సినీరంగంలో ఉండగా.. మిగిలిన వారు రాజకీయాల్లో ప్రవేశించి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.(‘గ్లామర్ వాలా, సఫాయీ వాలా ఒకటే’) -
‘నువ్వు ఎల్లప్పుడూ నా వాడివే’
బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ నేడు 41వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా రితేశ్ భార్య, నటి జెనీలియా షేర్ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. తమ ఇద్దరు కుమారులు, తాను రితేశ్‌ను ఆత్మీయంగా ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసిన జెనీలియా... ‘నువ్వు ఎల్లప్పుడూ నా వాడివే. నీకు వందేళ్లు వచ్చినా ఎలాంటి మార్పూ ఉండదు. నేడైనా రేపైనా నువ్వున్నది నా కోసమే. హ్యాపీ బర్త్‌డే లవ్. ఎన్నటికైనా నా ప్రేమ నీకే సొంతం’ అంటూ క్యాప్షన్ జత చేశారు. ఈ క్రమంలో రితేశ్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా జెనీలియా- రితేశ్‌ల జోడి తమకు ఆదర్శమని, మీ ప్రేమ ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలని పలువురు నెటిజనన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ‘తుజే మేరీ కసమ్’ సినిమాలో కలిసి నటించిన రితేశ్ దేశ్‌ముఖ్- జెనీలియా బీ-టౌన్ ప్రేక్షకులను ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట రియల్ లైఫ్‌లోనూ జోడీ కట్టారు. పెళ్లికి తొలుత పెద్దల నుంచి వ్యతిరేకత రావడంతో... కొన్నాళ్లపాటు స్నేహితులుగానే ఉన్న ఈ స్టార్ కపుల్.. పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరికి రేహిల్, రియాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక రితేశ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర మాజీ సీఎం, దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడన్న సంగతి తెలిసిందే. ‘బొమ్మరిల్లు’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనస్సుల్లో ‘హాసిని’గా చెరగని ముద్రవేసుకున్న జెనీలియా.. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు. View this post on Instagram Dear Forever Mine😍😍😍 Il say the same thing to you now, that Il say to you when you turn 100 - You are my today and all of my tomorrows Happy Birthday Love Forever yours ❤️❤️❤️ Ps- I’m always in the mood for you 😘 A post shared by Genelia Deshmukh (@geneliad) on Dec 16, 2019 at 6:32pm PST -
సర్ప్రైజ్ చేయమన్నందుకు...ఇదిగో ఇలా!!
‘తుజే మేరీ కసమ్’ సినిమాలో కలిసి నటించిన రితేశ్ దేశ్‌ముఖ్- జెనీలియా బీ-టౌన్ ప్రేక్షకులను ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట రియల్ లైఫ్‌లోనూ జోడీ కట్టారు. పెళ్లికి పెద్దల ఆమోదం లభించకపోవడంతో కొన్నాళ్లు స్నేహితులుగానే ఉన్న ఈ స్టార్ కపుల్.. పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వివాహ బంధంతో ఒక్కటై కపుల్ గోల్స్‌ను సెట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరు కుమారులతో క్యూట్ ఫ్యామిలీ కలిగి ఉన్న ఈ జంట సోషల్ మీడియాలో తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడంలోనూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా జెనీలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రితేశ్ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘ సరికొత్త లుక్‌తో నన్ను సర్ప్రైజ్ చేయమని రితేశ్‌ను అడిగాను. ఇదిగో తను ఇలా ఎర్ర రంగు ఉడుత తోకతో నా ముందుకు వచ్చాడు... కూల్‌గా ఉంది కదా!!’ అంటూ రితేశ్ న్యూలుక్ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ క్రమంలో.. ‘మీ మాటకు విలువనిచ్చి రితేశ్ ఇలా తయారయ్యాడా? గ్రేట్. మాకు కూడా చెప్పండి ఈ హెయిర్‌స్టైల్ పేరేమిటో. మీ జంట ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా రితేశ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడన్న సంగతి తెలిసిందే. ఇక రితేశ్‌తో కలిసి తొలిసారి వెండితెరపై సందడి చేసిన జెనీలియా అతడిని పెళ్లి చేసుకుని ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు. View this post on Instagram Asked @riteishd to surprise me with a new look & he comes back sporting a Red Squirrel Tail .... COOL isn’t it 😍😍😍😍???? A post shared by Genelia Deshmukh (@geneliad) on May 31, 2019 at 7:15am PDT -
ఇది బచ్చాగ్యాంగ్ చాలెంజ్!!
బీ టౌన్ స్టార్ కిడ్స్ తైమూర్, అబ్రామ్, ఆరాధ్య బచ్చన్, ఇనాయా ఖేము, మిషాలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. వీరి ఫొటోలు షేర్ చేస్తే చాలు లక్షల్లో లైకులు వచ్చిపడతాయి. తాజాగా ఈ జాబితాలో చేరేందుకు బాలీవుడ్ స్టార్ కపుల్ జెనీలియా- రితేశ్‌ల చిన్న కుమారుడు రెహిల్ కూడా సిద్ధమైపోయాడు. అయితే అందరిలా కేవలం ఫొటోలతో సరిపెట్టకుండా... ఫిట్నెస్ వీడియోతో అదరగొట్టాడు. తన తండ్రి రితేశ్ దేశ్‌ముఖ్ విసిరిన ఫిట్నెస్ చాలెంజ్‌ను స్వీకరించిన రెండేళ్ల రెహిల్... రోప్ సాయంతో గోడ మీదకి ఎక్కుతూ చాలెంజ్ పూర్తి చేశాడు. అంతేకాదు... స్టార్ కిడ్స్ తైమూర్ అలీఖాన్, లక్ష్యా కపూర్, కరణ్ జోహార్ కవలలు యశ్- రూహీలకు చాలెంజ్ కూడా విసిరాడు. రెహిల్కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన జెనీలియా..‘ రెహిల్.. వాళ్ల నాన్న విసిరిన ఫిట్నెస్ చాలెంజ్‌ను స్వీకరించాడు. ఇప్పుడు బచ్చా గ్యాంగ్‌కు చాలెంజ్ విసురుతున్నాడు.. #బచ్చేఫిట్తోదేశ్ఫిట్’ అంటూ క్యాప్షన్ జత చేశారు. రెహిల్ క్యూట్ వీడియోను చూసిన కరణ్ జోహార్...‘ ఓ మైగాడ్!!! చూడండి!!!! ఇతను రాక్‌స్టార్. నేనైతే రెహిల్లా చాలెంజ్ పూర్తి చేస్తానో లేదో’ అంటూ సరదాగా కామెంట్ చేశారు. Rahyl accepts his Baba’s #FitnessChallenge ... He further challenges the Bachcha Gang..... #BachceFitTohDeshFit A post shared by Genelia Deshmukh (@geneliad) on Aug 28, 2018 at 11:46pm PDT OMG!!! Look at him!!!! He’s a rock star!!!! Am nervous to even attempt this with mine😂😂😂 https://t.co/nihN0wVjyz — Karan Johar (@karanjohar) August 29, 2018 -
జెనీలియా రెండ్రోజులు నాతో మాట్లాడలేదు!
సాక్షి, ముంబై: రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజాలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన తొలి సినిమా 'తుఝే మేరి కసమ్' సినిమా వచ్చి అప్పుడే 15 ఏళ్లు అవుతోంది. ఈ సినిమా రితేశ్, జెనీలియాల జీవితాన్ని మార్చివేసింది. ఈ సినిమాలో సహనటులుగా ప్రస్థానాన్ని ప్రారంభించిన వీరిద్దరు ఇప్పుడు భార్యాభర్తలుగా కలిసి జీవితాన్ని సాగిస్తున్నారు. ఇదే విషయాన్ని గుర్తుచేసిన రితేశ్.. ఈ సినిమా సెట్స్‌లో మొదటి రెండురోజులు జెనీలియా తనతో అస్సలు మాట్లాడలేదని తెలిపాడు. ప్రముఖ తెలుగు దర్శకుడు కే విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన 'తుఝే మేరి కసమ్' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 'జనవరి 3, 2003న 'తుఝే మేరీ కసమ్' సినిమా విడుదలైంది. నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. మొదటి సినిమాతోనే జీవితం మారిపోయింది. ఆర్కిటెక్ట్ నటుడు అయ్యాడు. సహనటి జెనీలియా జీవితభాగస్వామి అయింది' అని రితేశ్ ట్వీట్ చేశారు. నిర్మాత రామోజీరావు, దర్శకుడు విజయ్‌భాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 'మా నాన్న అప్పటి ముఖ్యమంత్రి కావడంతో సినిమా షూటింగ్ సమయంలో తొలిరెండురోజులు జెనీలియా మాట్లాడలేదు. ఆమె అడిగిన మొదటి మాట నీ సెక్యూరిటీ ఏదని.. నాకు ఎలాంటి సెక్యూరిటీ లేదని చెప్పాను' అని రితేశ్ గుర్తుచేసుకున్నారు. దివంగత మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడైన రితేశ్ తనను ఈ సినిమాకు రికమండ్ చేసినందుకు సినిమాటోగ్రాఫర్ కబీర్‌లాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. Sincere thanks to Director Vijaya Bhaskar Ji - I Love You Sir, Producer Shri Ramoji Rao Sir 🙏🏽 Respect. Cinematographer Kabir Lal Sir- who recommended me. 🙏🏽. #15YearsOfTujheMeriKasam pic.twitter.com/npIpCgd6jQ — Riteish Deshmukh (@Riteishd) 3 January 2018 .@geneliad didn’t speak to me for the first two days during the shoot of the film because my father was the Chief Minister on Maharashtra then. #15YearsOfTujheMeriKasam pic.twitter.com/dezgUiqtpz — Riteish Deshmukh (@Riteishd) 3 January 2018 -
సౌత్ లోనూ హాసిని రీ ఎంట్రీ
బొమ్మరిల్లు సినిమాలో హ.. హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ జెనీలియా. సౌత్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన జెనీలియా తరువాత బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. తన తొలి చిత్ర హీరో రితేష్ దేశ్‌ముఖ్ ను పెళ్లాడిన ఈ బ్యూటి సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలకు తల్లయినా ఇప్పటికీ అదే గ్లామర్ మెయిన్ టైన్ చేస్తున్న హాసిని రీ ఎంట్రీతో అదరగొట్టేందుకు రెడీ అవుతోంది. పెళ్లి తరువాత రెండు హిందీ సినిమాలతో పాటు ఓ మరాఠి సినిమాలో అతిథి పాత్రల్లో నటించిన జెనీలియా త్వరలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించేందుకు ప్లాన్ చేస్తుందట. ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్ కు హాజరైన జెనీలియా త్వరలో ఓ మరాఠి సినిమాతో పాటు సౌత్ సినిమాల్లోనూ నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలిపారు. -
లవ్లీ కపుల్.. స్వీట్ ట్వీట్స్
బాలీవుడ్ క్యూట్ అండ్ హ్యాపీ కపుల్ జెనీలియా, రితేష్‌లు సందర్భం వచ్చిన ప్రతిసారి తమ ప్రేమను వ్యక్తపరచుకుంటూనే ఉంటారు. ఇటీవలే రెండవ బిడ్డకు జన్మనిచ్చిన జెనీలియా ప్రస్తుతం ఆ సంబరంలోనే ఉంది. అయితే శుక్రవారం జెన్నీ పుట్టినరోజు కావడంతో తోటి నటీనటులు, సన్నిహితుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అన్నిటికంటే, అందరికంటే.. భర్త రితేష్ నుంచి అందిన విషెస్ ఆమెతోపాటు అందరినీ ఆకట్టుకున్నాయి. 'నిన్ను నవ్వుతూ చూడటం కంటే నన్నేదీ సంతోషంగా ఉంచలేదు. హ్యాపీ బర్త్ డే బయ్కో(బయ్కో అంటే మరాఠీలో భార్య అని అర్థం)'.. అంటూ వారిద్దరూ ఉన్న ఓ అపురూపమైన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. భర్త ప్రేమకు జెనీలియా స్పందిస్తూ.. 'థాంక్యూ నవ్రా( నవ్రా అంటే మరాఠీలో భర్త అని అర్థం).. నేనెప్పుడూ నవ్వుతూ ఉండటానికి నువ్వే కారణం, లవ్ యూ సోమచ్' అంటూ ట్వీట్ చేశారు. ఈ లవ్లీ కపుల్ స్వీట్ విషెస్ పలువురిని ఆకట్టుకున్నాయి. వీరి ప్రేమ వర్థిల్లుగాక అంటూ ప్రేమగా దీవించేస్తున్నారు. 'నువ్వేకావాలి' సినిమాకు రీమేక్ గా తీసిన 'తుఝే మేరీ కసమ్' సినిమా ద్వారా జెనీలియా, రితేష్‌లు తొలిసారి బాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. ఆ పరిచయం స్నేహమై, స్నేహం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో 2012లో వైభవంగా వివాహం చేసుకున్నారు. అనోన్యమైన జంటగా వీరికి మంచి పేరుంది కూడా. ఇద్దరు పిల్లల తల్లి అయిన జెనీలియా వెండితెరకు తాత్కాలికంగా దూరమయ్యారు. పలు విజయవంతమైన చిత్రాలతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆమె తిరిగి వెండితెరపై మెరవాలనే అభిమానుల ఆశ త్వరలో నెరవేరాలని ఆశిద్దాం. హ్యాపీ బర్త్ డే హాసినీ. Happy Birthday Baiko @geneliad - nothing makes me happier than seeing you smile. Have the bestest one. #HBDGenelia pic.twitter.com/PT7GfExh79 — Riteish Deshmukh (@Riteishd) 4 August 2016 Thank you Navra.. Ur the reason I smile always .. Love you so much https://t.co/IYsNdaRZR2 — Genelia Deshmukh (@geneliad) 5 August 2016 -
స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది!
జెనీలియా మళ్లీ తల్లి కానున్నారా? ప్రస్తుతం బాలీవుడ్లో అందరూ ఆసక్తికరంగా చర్చిస్తున్న టాపిక్ అది. జోరుగా షికారు చేస్తున్న ఈ వార్తకు జెనీలియా కానీ, ఆమె భర్త రితేశ్ దేశ్‌ముఖ్ కానీ స్పందించలేదు. మౌనం అర్ధాంగీకారం అంటారనీ, ప్రస్తుతం జెనీలియా గర్భవతి అనీ చాలామంది ఫిక్స్ అయ్యారు. దాచినా దాగదు కాబట్టి, కొన్ని నెలలు ఆగితే అసలు విషయం తెలిసిపోతుంది. జెనీలియా ఇప్పటికే ఒక బాబుకు తల్లి. ముద్దుల కొడుకు రియాన్ మొదటి బర్త్‌డేను మొన్న నవంబర్ 25న ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అమ్మతనంలోని తీయదనం గురించి జెనీలియా ఏం చెబుతున్నారంటే... బిడ్డ పుట్టినప్పుడు తల్లి మనోభావాలు విచిత్రంగా ఉంటాయి. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అని కంగారుపడిపోయేదాన్ని. ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నప్పటికీ ఏదో తెలియని భయం ఉండేది. బయటి ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయాను. రాత్రింబవళ్లూ రియాన్ గురించే. కొంతమంది పిల్లలు రాత్రిపూట అదే పనిగా ఏడవడం నేను స్వయంగా చూశాను. మా అబ్బాయి కూడా అలానే చేస్తాడని కంగారుపడ్డాను. కానీ, రియాన్ చక్కగా నిద్రపోయేవాడు. మొదటిసారి బిడ్డను కన్న తల్లికి చుట్టూ ఉన్నవాళ్లు ఏవేవో సలహాలిస్తుంటారు. వాటిల్లో ఏది పాటించాలో తెలియక డైలమాలో పడిపోతాం. అందుకే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లుంటే వాళ్ల సలహాలను పాటించాలి. ఎక్కువగా కన్ఫ్యూజ్ అయితే మాతృత్వాన్ని ఎంజాయ్ చేయలేం. అందుకే కొత్తగా తల్లయినవాళ్లు ఎలాంటి అపోహలూ, భయాలూ పెట్టుకోకుండా మదర్‌హుడ్‌ను ఎంజాయ్ చేయమని చెబుతున్నాను. నా బిడ్డకు సంబంధించిన ప్రతి పనీ నేనే స్వయంగా చేస్తాను. సాయంత్రం అయ్యేసరికి బాగా అలసి పోతాను. ఆ అలుపు చాలా తియ్యగా ఉంటుంది. మా అబ్బాయిని పెంచడం మొదలుపెట్టాక నన్ను పెంచిన మా అమ్మ మీద గౌరవం పెరిగింది. అమ్మ కూడా నా మీద ఇంత ప్రాణం పెట్టుకుని, పెంచి ఉంటుంది కదా అనిపించింది. నా ప్రెగెన్న్సీని డాక్టర్ కన్ఫర్మ్ చేయగానే, ‘నువ్వు మాత్రమే కాదు.. నేను కూడా ప్రెగ్నెంటే. ఈ తొమ్మిది నెలల కాలంలో శారీరకంగా నీలో వచ్చే మార్పులు నాకు రాకపోవచ్చు. నీ కష్టాలు కూడా తెలియదు. కానీ, అడుగడుగునా నీకు తోడుంటా’ అని నా భర్త రితేశ్ అన్నప్పుడు చాలా అదృష్టవంతు రాల్ని అనిపించింది. ఆయన మంచి భర్త మాత్రమే కాదు... మంచి తండ్రి కూడా. పిల్లవాడికి డైపర్స్ మారుస్తాడు. స్నానం చేయిస్తాడు. రాత్రి పాలు తాగించేటప్పుడు తను కూడా మేల్కొనే ఉంటాడు. బిడ్డను పెంచడం కేవలం నా ఒక్కదాని బాధ్యత మాత్రమే అని తనెప్పుడూ అనుకోలేదు. పెళ్లయిన తర్వాత నేనేం మారలేదు. అమ్మ అయ్యాక కూడా మారలేదు. నాలో వచ్చిందల్లా శారీరక మార్పు మాత్రమే. ఆ మార్పును నేను ఆనందంగా అంగీకరిస్తున్నా. ఎందుకంటే, మనం పుట్టిన తర్వాత మన అమ్మ ఇలా బబ్లీగా అయ్యిందని నా కొడుకు తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం సినీనటిగా లైమ్ లైట్లో లేననే బాధ ఇసుమంత కూడా లేదు. అంతకు మించిన ఆనందాన్ని అనుభవిస్తున్నా. అప్పుడప్పుడూ మాత్రమే బయటికి వస్తున్నా. ఆ రిలీఫ్ చాలు. నేను, రితేశ్ మా అబ్బాయి లేకుండా బయటికి వెళ్లం. మేం పిల్లవాడితో కనిపిస్తే చాలు ఫొటోలు తీసేస్తుంటారు. అలా చేయడం మాకు ఇబ్బందిగా ఉంటుంది. అది గ్రహించి ఎవరికి వాళ్లు తమ కెమెరాలను క్లిక్‌మనిపించకుండా ఉండాలని కోరుకుంటాం. ఒకవేళ తీసినా మొహం అదోలా పెట్టుకోం. నిజం చెప్పాలంటే అమ్మను అయ్యాక స్వర్గంలో ఉన్నట్లుగా అనిపించింది. ప్రతి నెలా బిడ్డలో వచ్చే మార్పు, ఎదుగుదల చూస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంటుంది. అందుకే అంటారేమో... ‘మదర్‌హుడ్ ఈజ్ మేజికల్’ అని! -
అందం కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా
ముంబై: మనిషికి అందం చాలా ముఖ్యమైన ఈ రోజుల్లో నటి జెనీలియా అందం ఆవిరై పోయిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పారు. ఒకప్పటి దక్షిణాది కలల రాణి ఈ అమ్మడు. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయికగా వెలుగొందారు. కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించిన జెనీలియా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని నటనకు దూరం అయ్యారు. ఒక బిడ్డకు తల్లి కూడా అయిన జెనీలియా మళ్లీ నటించడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దాన్ని బలపరచేలా ఇప్పుడీ ముద్దుగుమ్మ అందం పెంచుకునే అంశంపై శ్రద్ధ పెట్టారు. అందుకోసం కొత్త ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారట. ఈ విషయాన్ని జెనీలియా తెలుపుతూ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత తన శరీర చాయ బాగా నల్లబడిపోయిందన్నారు. ముఖమంతా ప్యాచ్ ప్యాచ్‌గా మారిపోయిందన్నారు. నిజం చెప్పాలంటే తన ముఖాన్ని తానే అద్దంలో చూసుకోవడం మానేశానన్నారు. అంతేకాదు తాను వయసుకు మించి కనిపించడంతో ఆలోచించి మళ్లీ యవ్వనంగా కనిపించడానికి ఆధునిక ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు జెనీలియా. -
అమ్మ కానున్న జెనీలియా
‘అంతేనా... వీలైతే నాలుగు మాటలు. కుదిరితే కప్పు కాఫీ’... అని ఎనిమిదేళ్ల క్రితం తెరపై జెనిలియా చేసిన అల్లరి అంతా ఇంతానా! తర్వాత తను ఎన్ని సినిమాల్లో నటించినా... తెలుగువారి గుండెల్లో మాత్రం ఆమె హాసినీనే. అలాంటి హాసిని త్వరలో అమ్మ కాబోతోంది. రితేష్ దేశముఖ్ని రెండేళ్ల క్రితం పెళ్లాడిన ఈ అందాల భామ... అప్పుడే పిల్లలొద్దని కొన్నాళ్ల క్రితం తన భర్తతో గొడవ కూడా పెట్టుకుందని అప్పట్లో మీడియాలో కథనాలు కూడా ప్రసారమయ్యాయి. వాటిని జెన్నీ కూడా ఖండించలేదు. అయితే ప్రస్తుతం మాత్రం అత్తారింటి అభిమతాన్ని గౌరవిస్తూ... ‘అమ్మ’ అవ్వడానికి సిద్ధమైపోయారు జెనీలియా. అంటే త్వరలో అందాల హాసిని పొత్తిళ్లలో ఓ చిన్నారిని చూడబోతున్నామన్నమాట. -
జెనీలియా తల్లి కాబోతోంది!!
హ.. హ.. హాసిని అంటూ బొమ్మరిల్లుతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుని, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్తో మెడలో మూడు ముళ్లు వేయించుకున్న జెనీలియా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె భర్త రితేష్ నిర్ధారించాడు. బాంబే టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపాడు. తన భార్య గర్భవతి అంటూ ఇన్నాళ్లుగా వస్తున్న కథనాలన్నీ ఇప్పుడు నిజమయ్యాయని అన్నాడు. ఆమె గర్భం దాల్చిందని, పిల్లల విషయంలో తామిద్దరం చాలా ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నామని చెప్పాడు. ఇటీవల కొన్ని ఫొటోలలో జెనీలియా పొట్ట ఎత్తుగా కనపడటంతో ఆమె గర్భవతి అయి ఉంటుందని పత్రికల్లో గుప్పుమంది. ఇక త్వరలోనే తండ్రి కాబోతున్న ఆనందంలో ఉన్న రితేష్ దేశ్‌ముఖ్.. సాజిద్ ఖాన్, సైఫ్ అలీఖాన్‌లతో కలిసి చేసిన 'హమ్‌షకల్స్' చిత్రం ప్రమోషన్లో మునిగి తేలుతున్నాడు. -
తల్లి కాబోతోందా..!
పెళ్లి కాని తారలను ‘పెళ్లెప్పుడు’ అని అడుగుతుంటారు. పెళ్లయిన తర్వాత ‘మమ్మీ... డాడీ’ అని ఎప్పుడు పిలిపించుకుంటారు? అనడుగుతారు. ప్రతీ హీరో, హీరోయిన్ ఈ ప్రశ్నలు ఫేస్ చేయడం కామన్. గతంలో జెనీలియా కూడా పెళ్లి ప్రశ్నను ఎదుర్కొన్నవారే. ఇప్పుడు రెండో ప్రశ్నతో ఆమెను వెంటాడుతున్నారు. అది మాత్రమే కాదు.. కొన్ని నెలల క్రితం ఆమె గర్భవతి అనే వార్త కూడా వచ్చింది. అది నిజం కాదని ఆమె మేనేజర్ స్పష్టం చేశారు. ఇప్పుడు మరోసారి జెనీలియా తల్లి కాబోతున్నారనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్ నిర్మించిన ‘ఎల్లో’ చిత్రం ప్రీమియర్ షోలో ఇటీవల పాల్గొన్నారు జెనీలియా. ఆమెని చూసినవాళ్లు ప్రెగ్నెంటేమో అని అనుమానిస్తున్నారు. దానికి కారణం జెన్నీ బొద్దుగా కనిపించడమే. మరి.. ఈసారైనా ఈ ఊహాగానాలు నిజమో కాదో.. త్వరలోనే తెలిసిపోతుంది.