లవ్లీ కపుల్.. స్వీట్ ట్వీట్స్ | Riteish Deshmukh's birthday wish to wife Genelia D'Souza is the best ever | Sakshi
Sakshi News home page

లవ్లీ కపుల్.. స్వీట్ ట్వీట్స్

Published Fri, Aug 5 2016 6:54 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

లవ్లీ కపుల్.. స్వీట్ ట్వీట్స్

లవ్లీ కపుల్.. స్వీట్ ట్వీట్స్

బాలీవుడ్ క్యూట్ అండ్ హ్యాపీ కపుల్ జెనీలియా, రితేష్లు సందర్భం వచ్చిన ప్రతిసారి తమ ప్రేమను వ్యక్తపరచుకుంటూనే ఉంటారు. ఇటీవలే రెండవ బిడ్డకు జన్మనిచ్చిన జెనీలియా ప్రస్తుతం ఆ సంబరంలోనే ఉంది. అయితే శుక్రవారం జెన్నీ పుట్టినరోజు కావడంతో తోటి నటీనటులు, సన్నిహితుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

అన్నిటికంటే, అందరికంటే.. భర్త రితేష్ నుంచి అందిన విషెస్ ఆమెతోపాటు అందరినీ ఆకట్టుకున్నాయి. 'నిన్ను నవ్వుతూ చూడటం కంటే నన్నేదీ సంతోషంగా ఉంచలేదు. హ్యాపీ బర్త్ డే బయ్కో(బయ్కో అంటే మరాఠీలో భార్య అని అర్థం)'.. అంటూ వారిద్దరూ ఉన్న ఓ అపురూపమైన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. భర్త ప్రేమకు జెనీలియా స్పందిస్తూ.. 'థాంక్యూ నవ్రా( నవ్రా అంటే మరాఠీలో భర్త అని అర్థం).. నేనెప్పుడూ నవ్వుతూ ఉండటానికి నువ్వే కారణం, లవ్ యూ సోమచ్' అంటూ ట్వీట్ చేశారు. ఈ లవ్లీ కపుల్ స్వీట్ విషెస్ పలువురిని ఆకట్టుకున్నాయి. వీరి ప్రేమ వర్థిల్లుగాక అంటూ ప్రేమగా దీవించేస్తున్నారు.

'నువ్వేకావాలి' సినిమాకు రీమేక్ గా తీసిన 'తుఝే మేరీ కసమ్' సినిమా ద్వారా జెనీలియా, రితేష్లు తొలిసారి బాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. ఆ పరిచయం స్నేహమై, స్నేహం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో 2012లో వైభవంగా వివాహం చేసుకున్నారు. అనోన్యమైన జంటగా వీరికి మంచి పేరుంది కూడా. ఇద్దరు పిల్లల తల్లి అయిన జెనీలియా వెండితెరకు తాత్కాలికంగా దూరమయ్యారు. పలు విజయవంతమైన చిత్రాలతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆమె తిరిగి వెండితెరపై మెరవాలనే అభిమానుల ఆశ త్వరలో నెరవేరాలని ఆశిద్దాం. హ్యాపీ బర్త్ డే హాసినీ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement