Genelia Dsouza And Riteish Deshmukh Mister Mummy Papaji Pet Se Video Song Out - Sakshi
Sakshi News home page

Mister Mummy: విభిన్న కథాంశంగా 'మిస్టర్ మమ్మీ'.. ఆకట్టుకుంటున్న వీడియో సాంగ్

Published Wed, Nov 9 2022 5:19 PM | Last Updated on Wed, Nov 9 2022 7:05 PM

Genelia Dsouza And Riteish Deshmukh  Movie Mister Mummy Video Song out - Sakshi

నటనతో పాటు నిజ జీవితంలోనూ ఒక్కటైన జంట రితేష్‌ దేశ్‌ముఖ్‌- జెనీలియా. మళ్లీ ఒక దశాబ్దం తర్వాత వీరిద్దరూ వెండితెరపై కనిపించనున్నారు. తాజాగా వీరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం'మిస్టర్‌ మమ్మీ' విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో గర్భం దాల్చిన పురుషుడి పాత్రలో రితేష్‌ దేశ్‌ముఖ్‌ కనిపించనున్నారు. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. 'పాపాజీ పేట్‌ సే' అంటూ సాగే పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌లో రితేశ్ దేశ్‌ముఖ్ ఫర్మామెన్స్ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించింది చిత్రబందం. షాద్‌ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని టీ -సిరీస్‌ నిర్మిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement