‘వల్గర్‌ ఆంటీ’ అంటూ ట్రోలింగ్‌.. జెనీలియా ఘాటు రిప్లై | Genelia DSouza Strong Reply to Troll on video with Reteish Deshmukh | Sakshi
Sakshi News home page

Genelia D'Souza and Reteish Deshmukh: ‘వల్గర్‌ ఆంటీ’ అంటూ ట్రోలింగ్‌.. జెనీలియా ఘాటు రిప్లై

Published Wed, Sep 29 2021 12:22 PM | Last Updated on Wed, Sep 29 2021 1:20 PM

Genelia DSouza Strong Reply to Troll on video with Reteish Deshmukh - Sakshi

సెలబ్రిటీలు ఏం చేసినా వైరల్‌ అవడం, కొన్నిసార్లు అది ట్రోల్‌కి గురికావడం సాధారణంగా జరుగుతుంటుంది. ఇలాంటివి బాలీవుడ్‌లో మరి ఎక్కువ. ఇటీవల బీ టౌన్‌ జంట నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్, నటి జెనీలియా డిసౌజాకు అలాగే జరిగింది. ఈ ఏడాది హోలీ సందర్భంగా వారి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయగా కొందరు నెటిజన్లు ‘వల్గర్‌ ఆంటీ’ అంటూ ట్రోల్‌ చేశారు.

నటుడు అర్బాజ్ ఖాన్ హోస్ట్‌ చేస్తున్న డిజిటల్‌ షో ‘పించ్’. ఈ షో సీజన్ 2కి తాజాగా రితేశ్‌, జెనీలియా జంట అతిథులుగా వచ్చారు. దీంట్లో సెలబ్రిటీలు ట్రోల్‌కి సంబంధించిన కామెంట్స్‌ని చదివి వారి రెస్పాన్స్‌ తీసుకుంటూ ఉంటాడు. అలాగే ఈ జంటకి సైతం ఓ వీడియో చూపించాడు. అందులో నటి ప్రీతి జింటాని రితేశ్‌ చేతులపై ముద్దు పెట్టకోగా, జెనీలియా జలసీతో చూస్తూ ఉంది. అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత జెన్నీ కోపంతో భర్తను కొడుతున్నట్లు, ఆయన వద్దు అని వేడుకుంటున్నట్లు ఉన్న ఆ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యింది. 

అయితే ఈ వీడియోని చూసిన ఓ నెటిజన్‌ ‘సిగ్గు లేదా, వల్గర్‌ ఆంటీ. ఎప్పుడూ ఓవర్‌ యాక్టింగ్ చేస్తుంటావ్‌. ఇది నీ ముఖానికి సెట్‌ అవ్వదు’ అని కామెంట్‌ పెట్టాడు. దీనిపై స్పందించిన నటి జెన్నీ ‘అతని ఇంట్లో పరిస్థితులు బాలేనట్లు ఉన్నాయి అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. భాయ్ సాబ్,  మీరు ఇంట్లో బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను’ అంటూ ఘాటుగా స్పందించింది. దీనిపై రితేశ్‌ స్పందిస్తూ పాపులారిటీ ఉన్నవాళ్లకి ఇలాంటి విమర్శలు మామూలేనని, వాటి గురించి పట్టించుకోకూడదని వ్యాఖ్యానించాడు. అయితే ఈపించ్‌ షోకి వారు వచ్చిన ఎపిసోడ్‌ ప్రోమోని యూట్యూబ్‌లో పెట్టగా వైరల్‌గా మారింది.

చదవండి: ‘బొమ్మరిల్లు’లో హాసిని పాత్ర నా నిజ జీవితంలోనిది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement