ముచ్చటగా మూడోసారి.. హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ అంటూ కామెంట్స్? | Genelia Gets Third Time Pregnancy, Netizens Comments Goes Viral | Sakshi
Sakshi News home page

Genelia: బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియాకు ప్రెగ్నెన్సీ.. నెటిజన్స్ కామెంట్స్ వైరల్!

Published Sun, Sep 10 2023 6:31 PM | Last Updated on Mon, Sep 11 2023 9:28 AM

Genelia Gets Third Time Pregnancy Netizens Comments Goes Viral - Sakshi

బొమ్మరిల్లు చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ జెనిలీయా. సిద్ధార్థ్‌కు జంటగా నటించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులో సత్యం చిత్రంతో పరిచయమైన జెనిలీయా.. ఆ తర్వాత సాంబ, హ్యాపీ, సై, మిస్టర్ మేధావి, రెడీ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఆ తర్వాత ఫిబ్రవరి 2012లో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైంది. అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ సందడి చేస్తోంది.తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. ముంబయిలో ఓ ఈవెంట్‌లో జెనీలియాపై ప్రెగ్నెన్సీ రూమర్స్ ఊపందుకున్నాయి. 

(ఇది చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!)

గత రాత్రి ముంబయిలోని ఈవెంట్‌లో ఫోటోలకు పోజులిచ్చింది ఈ బాలీవుడ్ జంట. అయితే ఆ ఫోటోల్లో బ్లూ డ్రెస్‌లో ఉన్న జెనీలియాకు బేబీ బంప్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియా పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉండగా.. మూడోసారి ప్రెగ్నెంట్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరలవుతోంది. 

ఓ నెటిజన్ కామెంట్స్‌లో రాస్తూ..'జెనీలియా గర్భవతి అయి ఉండొచ్చు' అని రాయగా.. మరో నెటిజన్ 'అవును ఆమె మూడోబిడ్డను ఆశిస్తోంది' ‍అంటూ పోస్ట్ చేశారు.  కాగా.. రితేష్, జెనీలియా కలిసి రితీష్ మరాఠీలో దర్శకత్వం వహించిన వేద్‌లో నటించారు. మరోవైపు జెనీలియా ట్రయల్ పీరియడ్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అక్షయ్ కుమార్‌తో కలిసి హౌస్‌ఫుల్ 5తో రితేష్ నటించనున్నారు. 

(ఇది చదవండి: డిఫరెంట్ ట్రైలర్.. వినాయక చవితికి మూవీ రిలీజ్)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement