rithesh Deshmukh
-
ముచ్చటగా మూడోసారి.. హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ అంటూ కామెంట్స్?
బొమ్మరిల్లు చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ జెనిలీయా. సిద్ధార్థ్‌కు జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో సత్యం చిత్రంతో పరిచయమైన జెనిలీయా.. ఆ తర్వాత సాంబ, హ్యాపీ, సై, మిస్టర్ మేధావి, రెడీ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఆ తర్వాత ఫిబ్రవరి 2012లో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైంది. అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ సందడి చేస్తోంది.తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. ముంబయిలో ఓ ఈవెంట్లో జెనీలియాపై ప్రెగ్నెన్సీ రూమర్స్ ఊపందుకున్నాయి. (ఇది చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) గత రాత్రి ముంబయిలోని ఈవెంట్లో ఫోటోలకు పోజులిచ్చింది ఈ బాలీవుడ్ జంట. అయితే ఆ ఫోటోల్లో బ్లూ డ్రెస్‌లో ఉన్న జెనీలియాకు బేబీ బంప్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియా పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉండగా.. మూడోసారి ప్రెగ్నెంట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరలవుతోంది. ఓ నెటిజన్ కామెంట్స్‌లో రాస్తూ..'జెనీలియా గర్భవతి అయి ఉండొచ్చు' అని రాయగా.. మరో నెటిజన్ 'అవును ఆమె మూడోబిడ్డను ఆశిస్తోంది' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రితేష్, జెనీలియా కలిసి రితీష్ మరాఠీలో దర్శకత్వం వహించిన వేద్‌లో నటించారు. మరోవైపు జెనీలియా ట్రయల్ పీరియడ్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అక్షయ్ కుమార్‌తో కలిసి హౌస్‌ఫుల్ 5తో రితేష్ నటించనున్నారు. (ఇది చదవండి: డిఫరెంట్ ట్రైలర్.. వినాయక చవితికి మూవీ రిలీజ్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అందుకే సినిమాలకు దూరమయ్యాను : జెనీలియా
హా హా హాసినీ అనగానే మనకు గుర్తొచ్చే హీరోయిన్ జెనీలియా. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా కొనసాగిన జెనీలియా పెళ్లి తర్వాత నటనకు దూరమయ్యింది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ఆమె ముంబైలోనే ఉంటూ అక్కడే సెటిల్ అయ్యింది. ఇటీవలె వేద్(మజిలీకి రీమేక్)సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా సాలిడ్ హిట్‌ను సొంతం చేసుకుంది. భర్త రితేష్ డైరెక్షన్లో నటించిన ఆమె ఇందులో సమంత పాత్రను పోషించగా, చైతూ రోల్లో రితేష్ నటించారు. చాలా గ్యాప్ తర్వాత గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన జెనీలియా నటనకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఈ క్రమంలో తన నటనా జీవితంపై జెనీలియా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు పోషించాలనుకున్నా. ఇల్లాలిగా, పిల్లలకు మంచి తల్లిగా పూర్తి సమయం కేటాయించాలనుకున్నా. అందుకే సినిమాలకు దూరమయ్యా. ఇక రీసెంట్గా వేద్ సినిమా విజయం నాలో కొత్త ఉత్సానిచ్చింది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆడియెన్స్ నన్ను నటిగా ఆదరించారు. మళ్లీ మంచి కథలు దొరికితే తప్పకుండా నటిస్తా అంటూ చెప్పుకొచ్చింది. -
అభిమాని కాళ్లు పట్టుకున్న స్టార్ హీరో.. ఫోటో వైరల్
సినిమా స్టార్స్‌కు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్‌తో ఒక్క ఫోటో అయినా దిగాలని చాలామంది కలలు కంటారు. అదే గనుక నిజమైతే వారి ఆనందానికి అవధులు ఉండవు. సరిగ్గా ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది. రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా జంటగా నటిస్తున్న చిత్రం వేద్. తెలుగులో మజిలీ చిత్రానికి రీమేక్ ఇది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఓ కాలేజీ క్యాంపస్‌కు వెళ్లారు చిత్ర యూనిట్. ఆ సమయంలో ఓ యువతి స్టేజ్‌పైకి వచ్చి రితేష్‌తో డ్యాన్స్ చేయాలని ఉందని చెప్పింది. అభిమాని కోరిక మేరకు వెంటనే రితేష్ ఆమెతో కలిసి డ్యాన్స్ చేశాడు. దీంతో ఆమె ఆనందం తట్టుకోలేక ఏడుస్తూ అతడి కాళ్లు పట్టుకుంది. వెంటనే రితేష్ ఆమెను పైకి లేపి ఆమె కాళ్లు తాకడంతో అతని బిహేవియర్‌కు ఫిదా అయిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం రితేష్‌ను చూస్తే అర్థమవుతుందంటూ అతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
జెనీలియా మూవీపై దర్శకుడు సంచలన ఆరోపణలు.. !
జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మిస్టర్ మమ్మీ'. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. షాద్ అలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ సినిమాలో మహేశ మంజ్రేకర్, అరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిస్టర్ మమ్మీ ట్రైలర్లో రితేశ్ గర్భంతో కనిపిస్తుండగా.. మహేష్ మంజ్రేకర్ డాక్టర్ పాత్రలో కనిపించారు. అయితే తాజాగా ఈ సినిమాపై మరో దర్శకుడు సంచలన ఆరోపణలు చేశారు. (చదవండి: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!) కోల్‌కతాకు చెందిన చిత్రనిర్మాత, దర్శకుడు ఆకాశ్ ఛటర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ తన స్క్రిప్ట్‌ను కాపీ కొట్టిందని ఆయన ఆరోపించారు. 'మిస్టర్ మమ్మీ' చిత్రంలోని కాన్సెప్ట్‌ను తన స్టోరీ అయిన 'విక్కీ పేట్ సే' నుంచి కాపీ చేశారంటూ వ్యాఖ్యానించారు. ఆకాశ్ ఛటర్జీ మాట్లాడుతూ.. 2020లో నేను 'విక్కీ పేట్ సే' కథతో టీ-సిరీస్‌ను సంప్రదించా. అప్పుడు ఈ చిత్ర నిర్మాణానికి కూడా అంగీకరించారు. కానీ ఆ తర్వాత అసలు కథకు ఎలాంటి మార్పులు లేకుండా 'మిస్టర్ మమ్మీ' పేరుతో మూవీని రూపొందించారు.' అని అన్నారు. అందుకే తన కథకు క్రెడిట్ ఇవ్వాలని ఆకాశ్ ఛటర్జీ డిమాండ్ చేస్తున్నారు. తన స్క్రిప్ట్‌ను స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్‌లో రిజిస్టర్ చేశానని ఆకాశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. టి-సిరీస్‌తో అతని సంభాషణకు సంబంధిచిన స్క్రీన్ షాట్లను పంచుకున్నారు. ఆ చిత్రంలో టైటిల్ రోల్లో ఆయుష్మాన్ ఖురానా కనిపించారు. -
డాక్టర్స్ డే: బాలీవుడ్ జంట కొత్త నిర్ణయం
జన్మనిచ్చేది అమ్మ అయితే.. ప్రాణం పోసేది వైద్యుడు. కరోనా లాంటి ప్రాణాంతక రోగాలు వచ్చినప్పుడు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడేందుకు శ్రమిస్తారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ జంట జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్ ఓ ప్రతిజ్ఞ పూనారు. తమ అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు. "రితేశ్, నేను ఈ పని ఎప్పుడో చేయాలని భావించాం, కానీ కుదరలేదు. ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా మేము మా అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ సంకల్పానికి పూనుకునేందుకు మమ్మల్ని ప్రోత్సహించిన డా.నోజర్ శెరీర్, FOGSIకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. (ఇది శాశ్వతం.. మీ ప్రేమకు ధన్యవాదాలు!) ఒకరికి జీవితాన్ని ఇవ్వడమే అసలైన బహుమతి. కాబట్టి మీరు కూడా ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు ఈ పనిలో భాగస్వాములు అవండి. అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞ పూనండి" అని జెనీలియా పిలుపునిచ్చింది. వీరి నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ వైద్యులు బిధాన్ చంద్రరాయ్ గుర్తుగా ప్రతి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటాం. ఆయన 1882 జూలై 1న జన్మించగా 1962 జూలై 1వ తేదీనే మరణించారు. ఆయన అందించిన విశేషమైన సేవలకు గానూ భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 4న బిధాన్ చంద్రరాయ్‌కు అత్యున్నత పురస్కారమైన భారత రత్నను బహుకరించింది. (విద్యుత్ జమాల్‌కు అండగా జెనీలియా!) View this post on Instagram @riteishd and me have been thinking about it for a long time but unfortunately didn’t get down to doing it. Today on Doctor’s Day we pledge to donate our organs. We want to thank Dr Nozer Sherier and FOGSI for inspiring us. The greatest gift you can give someone is ‘The gift of life’. .We urge you all to take a part in this initiate and pledge to save lives, pledge to donate your organs. A post shared by Genelia Deshmukh (@geneliad) on Jul 1, 2020 at 4:29am PDT -
వైరల్: బాలీవుడ్ హీరోకు రూ. 4కోట్ల 70లక్షల రుణమాఫీ
ముంబై: విలాస్‌రావ్ దేశ్‌ముఖ్.. మహారాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. విలాస్‌రావ్ సీఎంగా ఉన్న కాలంలోనే ఆయన కుమారుడు రితేశ్ దేశ్‌ముఖ్ ను బాలీవుడ్ హీరోగా పరిచయం చేశారు. అయితే ఇదంతా గతం. తాజాగా.. బాలీవుడ్ హీరో, మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేశ దేశ్ ముఖ్ రైతు రుణమాఫీ పొందారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైతు రుణమాఫీ కింద రితేశ్.. ఆయన సోదరుడు అమిత్ దేశ్‌ముఖ్ రూ. 4కోట్ల 70లక్షలు లోన్ తీసుకున్నట్లు, కొన్ని డాక్యుమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై స్పందించిన రితేశ్ దేశ్‌ముఖ్.. మేము ఎలాంటి లోన్ తీసుకోలేదని అటువంటపుడు రుణమాపీ ఎలా జరుగుతుందన్నారు. చదవండి: కుక్కకు పులి వేషం వేసి వాటిని తరిమేశాడు..! సోషల్‌మీడియాలో వైరల్ అవుతోన్న డాక్యుమెంట్స్ ఏవీ కూడా నిజం కాదన్నారు. ఆ డాక్యుమెంట్స్‌ను పోస్ట్ చేసిన మధుపూర్ణిమ కిశ్వర్ అనే మహిళ.. రితేశ్ స్పందన తర్వాత తన పోస్ట్‌ను తొలగిస్తూ క్షమాపణలు కోరింది. తన ఫ్రెండ్ ఒక లింక్‌ను తనకు షేర్ చేస్తే అదే నిజమని నమ్మి తాను పోస్ట్ చేసినట్లు చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగవని ఆ మహిళ తప్పును గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. మరో ట్వీట్ చేసింది. I am also deeply impressed by the gracious manner in which @Riteishd pointed out my mistake. Thank you Riteish, that one tweet of yours carried many valuable lessons. https://t.co/EBdyqmm63g — MadhuPurnima Kishwar (@madhukishwar) December 3, 2019 Dear @madhukishwar Ji, The said paper in circulation is with malafide motive. Neither me nor my brother @AmitV_Deshmukh have availed any loan as mentioned in the paper posted by you. Hence, there is no question of any loan waiver whatsoever. Please don’t be misled. Thank you. https://t.co/yCfxNt2ZRm — Riteish Deshmukh (@Riteishd) December 3, 2019 -
మాజీ సీఎం కుమారులు.. పల్సి గ్రామ మనువళ్లు
సాక్షి, భైంసా(ముథోల్): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలైంది. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావుదేశ్‌ముఖ్ కుభీర్ మండలం పల్సి గ్రామ అల్లుడు. పల్సి గ్రామానికి చెందిన వైశాలిని విలాస్రావుదేశ్ముఖ్కు ఇచ్చి వివాహం జరిపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన విలాస్‌రావుదేశ్‌ముఖ్ దంపతులకు ముగ్గురు కుమారులు. విలాస్‌రావుదేశ్‌ముఖ్ మరణానంతరం ఆయన పెద్ద కొడుకు అమిత్దేశ్ముఖ్, చిన్న కొడుకు దీరజ్‌దేశ్‌ముఖ్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రెండో కుమారుడు రితేశ్‌దేశ్‌ముఖ్ బాలివుడ్లో కథానాయకుడిగా రాణిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ సొంతగడ్డ లాథూర్‌లో అసెంబ్లీ పోరు కొనసాగుతోంది. ఇద్దరు కొడుకులు కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. ఇందులో లాథూర్ అర్బన్ నుంచి అమిత్దేశ్ముఖ్, లాథూర్ రూరల్ నుంచి చిన్న కొడుకు దీరజ్‌దేశ్‌ముఖ్ పోటీకి దిగారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దేశమంతటా బీజేపీ గాలివీస్తున్నప్పటికీ తమ తండ్రి సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఈ కుటుంబం ముందుకెళ్తోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా విలాస్‌రావుదేశ్‌ముఖ్ లాథూర్ ప్రాంతంలో విస్తరించిన సేవలే వీరి గెలుపునకు నాంది పలుకుతాయని అక్కడి వారు చెప్పుకుంటున్నారు. ప్రచార బాధ్యతలు రితేశ్పైనే... మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావుదేశ్‌ముఖ్ మరణానంతరం అక్కడ రాజకీయవారసత్వం కొనసాగించాలని ఆ కుటుంబం నిర్ణయించింది. ఇద్దరు సోదరులకు గెలిపించేందుకు బాలీవుడ్ కథానాయకుడు రితేశ్‌దేశ్‌ముఖ్ ప్రచార బాధ్యతలు నెత్తినవేసుకున్నారు. ప్రచార పర్వంలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయ వేదికలపై ప్రసంగాలు చేస్తూ హీరోయిజం ప్రదర్శిస్తున్నారు. లాథూర్ తన సొంత గడ్డ అని ఈ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావుదేశ్‌ముఖ్ చేసిన సేవలకు ప్రజలు గెలిపించి తీరుతారంటూ తనదైన శైలిలో ప్రసంగిస్తున్నారు. వైశాలినితో ముగ్గురు కుమారులు పల్సి గ్రామంలో ఆసక్తి.. ప్రస్తుతం లాథూర్ ఎన్నికల ప్రచార తీరు... అక్కడి సభలపై పల్సి గ్రామంలో ఆసక్తి నెలకొంది. పిళ్లుబాయి మనువళ్లు ఎమ్మెల్యేలుగా నిల్చున్నారని వారంతా చర్చించుకుంటున్నారు. మరాఠీ చానళ్లలో మీడియా కథనాలు చూస్తూ అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. లాథూర్ రాజకీయాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటున్నారు. పిళ్లుబాయి మనువళ్లు.. పల్సికర్ రంగారావుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పుష్పకు కుమార్తె, రెండవ భార్య పిళ్లుబాయికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పిళ్లుబాయి మొదటి కూతురు వైశాలిని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్ముఖ్తో వివాహం జరిపించారు. పిళ్లుబాయి మనువడే రితేశ్ అంటూ పల్సివాసులు చెప్పుకుంటున్నారు. జెడ్పీ మొదటి చైర్మన్ రంగారావు ఊరిపేరే ఇంటిపేరుగా వస్తోంది. పల్సి గ్రామం వారికి ఇంటి పేరుగా మారింది. అప్పట్లో ఈ ప్రాంతమంతా మహారాష్ట్రలో ఉండేది. పెద్ద భూస్వామి అయిన రంగారావును మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వాసులు రంగారావు పల్సికర్ అని పిలుస్తుండేవారు. భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాక ముథోల్ ప్రాంతాన్ని ఆదిలాబాద్ జిల్లాలో కలిపేశారు. అప్పట్లో జిల్లా పరిషత్ మొదటి చైర్మన్‌గా ఎన్నికైన పల్సికర్ రంగారావు అనారోగ్యంతో మృతి చెందారు. అంత్యక్రియలు స్వగ్రామంలోనే చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న విలాస్‌రావు దేశ్‌ముఖ్ మామ పెద్ద కర్మ నిర్వహించే 12వ రోజు పల్సికి వచ్చారు. రంగారావు మరణానంతరం ఈ ప్రాంత ప్రజల్లో ఆయన పేరు చిరకాలం ఉండిపోయేలా అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ భైంసా మండలంలో వాడి గ్రామం వద్ద సుద్దవాగుపై నిర్మించే మినీ ప్రాజెక్టుకు పల్సికర్ రంగారావు ప్రాజెక్టుగా నామకరణం చేశారు. వైశాలి చిన్న తనంలో పెరిగిన ఇల్లు అంతటా చర్చ... రితేశ్ తల్లి వైశాలిని చిన్ననాడు పెరిగిన ఇళ్లు ఇప్పటికీ పల్సిలో ఉంది. రంగారావు కుటుంబీకులు అంతా మహారాష్ట్రకు వెళ్లిపోయినా ఇంటిని మాత్రం భద్రంగా ఉంచుతున్నారు. గత ఏడాది ఇంటికి మరమ్మతు కూడా చేశారు. చుట్టూ గోడను రాతి బండతో నిర్మించారు. లోపల పెద్ద కోటను పోలిన కట్టడాలు ఉన్నాయి. కోట లోపల పచ్చని చెట్లను పెంచారు. రెండో అంతస్తును కట్టెతో అందంగా చెక్కారు. రితేశ్ జెనీలియాల పెళ్లి వేడుకకు పల్సి గ్రామస్తులు ముంబయికి వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావుదేశ్‌ముఖ్ అంత్యక్రియలకు సైతం పల్సి గ్రామస్తులు లాథూర్‌కు చేరుకున్నారు. విలాస్‌రావుదేశ్‌ముఖ్ కుటుంబీకులతో పల్సి గ్రామానికి విడదీయలేని అనుబంధమే ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విలాస్‌రావుదేశ్‌ముఖ్ కుటుంబీకులు ఎమ్మెల్యేగా అభ్యర్థులుగా పోటీచేయడంతో మళ్లీ ఈ గ్రామస్తుల చూపు లాథూర్వైపునకు మళ్లింది. ప్రతిరోజు బాలీవుడ్ కథానాయకుడు రితేశ్‌దేశ్‌ముఖ్ ప్రసంగాలను పల్సి గ్రామస్తులు తమ ఇళ్ల నుంచే తిలకిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో పల్సి గ్రామస్తుల చూపంతా లాథూర్ జిల్లాపైనే ఉంది. -
నటుడికి ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం
శంషాబాద్ : బాలీవుడు నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ట్విటర్ వేదికగా శంషాబాద్ విమానాశ్రయంలో తాను ఎదుర్కొన్న సమస్యను వెలుగులోకి తీసుకొచ్చారు. సోమవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు లాంజ్‌లోని లిఫ్ట్‌లో ప్రయాణిస్తుండగా కరెంటు సరఫరా ఆగిపోయి ఒక్కసారిగా నిలిచిపోయింది. ఆ సమయంలో ఒకే ఒక్కటిగా ఉన్న ఎగ్జిట్( బయటికి) డోర్ కూడా తెరుచుకోలేదు. మరికొద్ది సమయం తర్వాత లిఫ్ట్ యధాతథంగా పనిచేసింది. ఆ సమయంలో ఆ వీడియోను తీసి ట్విట్టర్లో ఈ విషయాన్ని రితేష్ ప్రస్తావించారు. ఒక వేళ ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఎగ్జిట్ డోర్ తెరుచుకోకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. రితేష్ దేశ్‌ముఖ్ ట్వీట్లకు ఆర్జీఐఏ అధికారులు స్పందించారు. చిన్నపాటి సాంకేతిక సమస్య కారణంగా ఆ పరిస్థితి తలెత్తిందన్నారు. అత్యవసర సమయాల్లో ఎగ్జిట్ డోర్‌ను బద్దలు కొట్టవచ్చన్నారు. అక్కడే ఓ బాక్స్‌లో దీనికి సంబంధించిన కీ కూడా ఉంటుందన్నారు. ఎంతో విలువైన ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు రితేష్ దేశ్‌ముఖ్‌కు ధన్యవాదాలు తెలిపారు. So we were at the Hyderabad Airport Lounge - suddenly the power goes off- the way in & out is an elevator that shuts down. The only exit door is locked in a chain (Incase of FIRE🔥 it’s a tragedy waiting to happen)- pic.twitter.com/jO3TQhVlQG — Riteish Deshmukh (@Riteishd) May 27, 2019 -
ఫొటోషూట్.. హీరో క్షమాపణలు
సాక్షి, ముంబై : బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ మరాఠా ప్రజలకు క్షమాపణ చెప్పారు. తనకు ఎవరి మనోభావాలు కించపరిచే ఉద్దేశం లేదంటూ వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందంటే... చారిత్రక ప్రదేశాల నవలా రచయిత విశ్వాస్ పాటిల్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ రవి జాదవ్‌లతో కలిసి రితేశ్ గురువారం ముంబైలోని రాయ్‌గఢ్ ఛత్రపతి శివాజీ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహం ముందు రితేశ్ ఫొటోషూట్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రితేశ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహం ముందు ఫొటోషూట్ ఎలా నిర్వహిస్తారు. అక్కడ ఫొటోలు దిగటం నిషిద్ధం. ఇదొక పనికిమాలిన చర్య’ అంటూ పలు సామాజిక సంస్థలు, నెటిజన్లు రితేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇందుకు స్పందించిన రితేశ్.. ’ ఆయన(శివాజీ) పాదాల ముందు తలవంచి ఆశీస్సులు పొందాను. ఆయనకు పూల మాల వేశాను. ఎన్నో ఏళ్లుగా నేను ఈ పనులన్నీ చేస్తున్నాను. ఆయన పట్ల గల భక్తి భావంతోనే అక్కడ ఫొటోలు దిగాను. అంతే తప్ప ఎవరి మనోభావాలో దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు లేదు. నా ఈ చర్య వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి’ అంటూ వివరణ ఇచ్చారు. కాగా రితేశ్ ఫొటోలపై స్పందించిన బీజేపీ ఎంపీ... ‘అక్కడ ఫొటోలు దిగటం నిషిద్ధం. ప్రతీ ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే. రితేశ్ చర్యను ఖండిస్తున్నా’ అంటూ మండిపడ్డారు. Visited Raigad Fort this morning, the capital of Maratha Empire. It’s an unimaginable high to feel the presence of one of the greatest warriors born in India Shri Chhatrapati Shivaji Maharaj. Nothing is more invigorating than bowing down and seeking his blessings. pic.twitter.com/MLAZ9MD8VF — Riteish Deshmukh (@Riteishd) July 5, 2018 -
కి.. పోయి కృ.. వచ్చె
ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు హీరోయిన్ కృతీ కర్భందా. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో రానున్న ఫోర్త్ పార్ట్ ‘హౌస్‌పుల్ 4’లో ఆమె ఒక కథానాయికగా నటించనుండటమే ఇందుకు కారణం. ఫస్ట్ అండ్ సెకండ్ హౌస్ఫుల్స్కు దర్శకత్వం వహించిన సాజిద్ ఖాన్నే ‘హౌస్‌ఫుల్ 4’ను డైరెక్ట్ చేయనున్నారు. థర్డ్ పార్ట్‌కు సాజిద్ సామ్జీ అండ్ ఫర్హాద్ సామ్జీ కలిసి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, పూజా హెగ్డే, చుంకీ పాండే ముఖ్య తారలుగా నటించనున్న ‘హౌస్‌ఫుల్ 4’ టీమ్‌లోకి తాజాగా కృతీ కర్భందా ఎంపికయ్యారు. అక్షయ్‌కుమార్ సరసన ఈమె కనిపించనున్నారట. ‘‘బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కామెడీ ఫ్రాంచైజీస్‌లో హౌస్‌ఫుల్ ఒకటి. ఇంతమంది స్టార్స్ ఉన్న సినిమాలో నేనింత వరకు నటించలేదు. అలాగే ఇలాంటి డిఫరెంట్ స్టోరీ కూడా నేను వినలేదు. ఈ సినిమాలో భాగమైనందుకు హ్యాపీ’’ అని పేర్కొన్నారు కృతీ. నిజానికి కియారా అద్వానీని అనుకున్న ప్లేస్‌లో ఫైనల్‌గా కృతీ భాగమయ్యారని బీటౌన్ టాక్. కి పోయి కృ వచ్చె అన్నమాట. ఇదివరకు ‘బోణి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ నెక్ట్స్ ‘తీన్మార్, బ్రూస్ లీ’ లాంటి సినిమాలతో తెలుగు తెరపై మెరిశారు. -
నేను సృష్టించిన అద్భుతం : జెనీలియా
హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న జెనీలియా తన కొడుకు పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. తన చిన్న కొడుకు రహైల్ పుట్టిన రోజు సందర్భంగా తను నేను సృష్టించిన అద్భుతం అంటూ ట్వీత్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో రహైల్ తో కలిసి దిగిన ఫోటోతో పాటు ఈ కామెంట్ ను పోస్ట్ చేసింది. రహైల్ తండ్రి, బాలీవుడ్ హీరో రితేష్ కూడా కొడుకు బర్త్ డేను సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేశాడు, పుట్టిన రోజు వేడుకకు తను కేక్ రెడీ చేస్తున్న వీడియోనే ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు రితేష్. ' ఈ రోజు ప్రత్యేకమైన రోజు.. రహైల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ కామెంట్ చేశాడు. హ..హ.. హాసినిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన జెనీలియా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ను పెళ్లాడిన తరువాత వెండితెరకు దూరమైన ఈ బ్యూటి రెండో కొడుకుకు జన్మనిచ్చిన తరువాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే జెనీలియాకు రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో హైప్ రాలేదు. Happy Birthday Rahyl... everytime I need to see a miracle,I look into your eyes and believe I created one.. You are soooo special lil one, you always will be and your mine that's all that matters.. God Bless You Always A post shared by Genelia Deshmukh (@geneliad) on May 31, 2017 at 9:47pm PDT