ముంబై: విలాస్‌రావ్ దేశ్‌ముఖ్.. మహారాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. విలాస్‌రావ్ సీఎంగా ఉన్న కాలంలోనే ఆయన కుమారుడు రితేశ్ దేశ్ముఖ్ ను బాలీవుడ్ హీరోగా పరిచయం చేశారు. అయితే ఇదంతా గతం. తాజాగా.. బాలీవుడ్ హీరో, మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేశ దేశ్ ముఖ్ రైతు రుణమాఫీ పొందారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైతు రుణమాఫీ కింద రితేశ్.. ఆయన సోదరుడు అమిత్ దేశ్‌ముఖ్ రూ. 4కోట్ల 70లక్షలు లోన్ తీసుకున్నట్లు, కొన్ని డాక్యుమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై స్పందించిన రితేశ్ దేశ్‌ముఖ్.. మేము ఎలాంటి లోన్ తీసుకోలేదని అటువంటపుడు రుణమాపీ ఎలా జరుగుతుందన్నారు.
చదవండి: కుక్కకు పులి వేషం వేసి వాటిని తరిమేశాడు..!
సోషల్‌మీడియాలో వైరల్ అవుతోన్న డాక్యుమెంట్స్ ఏవీ కూడా నిజం కాదన్నారు. ఆ డాక్యుమెంట్స్‌ను పోస్ట్ చేసిన మధుపూర్ణిమ కిశ్వర్ అనే మహిళ.. రితేశ్ స్పందన తర్వాత తన పోస్ట్‌ను తొలగిస్తూ క్షమాపణలు కోరింది. తన ఫ్రెండ్ ఒక లింక్‌ను తనకు షేర్ చేస్తే అదే నిజమని నమ్మి తాను పోస్ట్ చేసినట్లు చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగవని ఆ మహిళ తప్పును గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. మరో ట్వీట్ చేసింది.
I am also deeply impressed by the gracious manner in which @Riteishd pointed out my mistake. Thank you Riteish, that one tweet of yours carried many valuable lessons. https://t.co/EBdyqmm63g
— MadhuPurnima Kishwar (@madhukishwar) December 3, 2019
Dear @madhukishwar Ji, The said paper in circulation is with malafide motive. Neither me nor my brother @AmitV_Deshmukh have availed any loan as mentioned in the paper posted by you. Hence, there is no question of any loan waiver whatsoever. Please don’t be misled. Thank you. https://t.co/yCfxNt2ZRm
— Riteish Deshmukh (@Riteishd) December 3, 2019
Comments
Please login to add a commentAdd a comment