నటుడికి ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం | Riteish Deshmukh Tweets About Shamshabad Airport | Sakshi
Sakshi News home page

ట్విటర్‌ వేదికగా రితేష్‌ దేశ్‌ముఖ్‌ ఆవేదన

May 29 2019 10:34 AM | Updated on May 29 2019 11:34 AM

Riteish Deshmukh Tweets About Shamshabad Airport - Sakshi

ఆ సమయంలో ఒకే ఒక్కటిగా ఉన్న ఎగ్జిట్‌( బయటికి) డోర్‌ కూడా....

శంషాబాద్‌ : బాలీవుడు నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ ట్విటర్‌ వేదికగా శంషాబాద్‌ విమానాశ్రయంలో తాను ఎదుర్కొన్న సమస్యను వెలుగులోకి తీసుకొచ్చారు. సోమవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు లాంజ్‌లోని లిఫ్ట్‌లో ప్రయాణిస్తుండగా కరెంటు సరఫరా ఆగిపోయి ఒక్కసారిగా నిలిచిపోయింది. ఆ సమయంలో ఒకే ఒక్కటిగా ఉన్న ఎగ్జిట్‌( బయటికి) డోర్‌ కూడా తెరుచుకోలేదు. మరికొద్ది సమయం తర్వాత లిఫ్ట్‌ యధాతథంగా పనిచేసింది. ఆ సమయంలో ఆ వీడియోను తీసి ట్విట్టర్‌లో ఈ విషయాన్ని రితేష్‌ ప్రస్తావించారు. ఒక వేళ ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఎగ్జిట్‌ డోర్‌ తెరుచుకోకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. రితేష్‌ దేశ్‌ముఖ్‌ ట్వీట్‌లకు ఆర్‌జీఐఏ అధికారులు స్పందించారు. చిన్నపాటి సాంకేతిక సమస్య కారణంగా ఆ పరిస్థితి తలెత్తిందన్నారు. అత్యవసర సమయాల్లో ఎగ్జిట్‌ డోర్‌ను బద్దలు కొట్టవచ్చన్నారు. అక్కడే ఓ బాక్స్‌లో దీనికి సంబంధించిన కీ కూడా ఉంటుందన్నారు. ఎంతో విలువైన ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చినందుకు రితేష్‌ దేశ్‌ముఖ్‌కు ధన్యవాదాలు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement