
సినిమా స్టార్స్‌కు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్‌తో ఒక్క ఫోటో అయినా దిగాలని చాలామంది కలలు కంటారు. అదే గనుక నిజమైతే వారి ఆనందానికి అవధులు ఉండవు. సరిగ్గా ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది. రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా జంటగా నటిస్తున్న చిత్రం వేద్. తెలుగులో మజిలీ చిత్రానికి రీమేక్ ఇది.
త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఓ కాలేజీ క్యాంపస్‌కు వెళ్లారు చిత్ర యూనిట్. ఆ సమయంలో ఓ యువతి స్టేజ్‌పైకి వచ్చి రితేష్‌తో డ్యాన్స్ చేయాలని ఉందని చెప్పింది. అభిమాని కోరిక మేరకు వెంటనే రితేష్ ఆమెతో కలిసి డ్యాన్స్ చేశాడు.
దీంతో ఆమె ఆనందం తట్టుకోలేక ఏడుస్తూ అతడి కాళ్లు పట్టుకుంది. వెంటనే రితేష్ ఆమెను పైకి లేపి ఆమె కాళ్లు తాకడంతో అతని బిహేవియర్‌కు ఫిదా అయిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం రితేష్‌ను చూస్తే అర్థమవుతుందంటూ అతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment