బాలీవుడ్‌లో అందమైన కపుల్స్‌లో రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా జంట ఒకటి. ఈ మధ్య ఎక్కువగా ట్రోలింగ్‌కి గురవుతున్న ఈ దంపతులు తాజాగా అమితాబ్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 13’ షోకి ప్రత్యేక అతిథులుగా వచ్చారు. అయితే తాజాగా కేబీసీ 13లో పాల్గొన్న ఈ దంపతులు కంటతడి పెట్టారు.
కేబీసీ 13 కొత్త ఎపిసోడ్‌కి సంబంధించిన ఈ వీడియోని సోనీ టీవీ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో పోస్ట్ చేసింది. మామూలుగా ఈ షోలో పాల్గొన్న సెలబ్రీటీలు గెలుచుకున్న మనీని క్యాన్సర్ బారిన పడిన పిల్లల వైద్యానికి ఉపయోగిస్తారు. దాని కోసం సహాయం చేయమని కోరుతూ క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు సంబంధించిన వీడియోని రితేష్, జెనీలియా దంపతులకు చూపించారు. అది చూసిన ఆ పిల్లలు ఏం పాపం చేశారని ఇలాంటి శిక్ష అనుభవిస్తున్నారని జెన్నీ కంటతడి పెట్టింది. అది చూసిన రితేష్ సైతం ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయమై ఇలాంటి మంచి పని కోసం కృషి చేస్తున్న అమితాబ్‌ని వారు ప్రశంసించారు.
అయితే ఇంతకుముందు ఎపిసోడ్స్‌లో దీపికా పదుకొనే, ఫరా ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, జాకీ ష్రాప్, సునీల్ శెట్టి వంచి బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు పాల్గొన్నారు. షోలో వారు గెలుచుకున్న మొత్తాన్ని క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లల చికిత్స కోసం ఇచ్చారు.
చదవండి: ‘వల్గర్ ఆంటీ’ అంటూ ట్రోలింగ్.. జెనీలియా ఘాటు రిప్లై
Comments
Please login to add a commentAdd a comment