బిగ్‌బాస్‌ విన్నర్‌గా కంటెంట్‌ క్రియేటర్.. ప్రైజ్‌మనీ ఎన్ని లక్షలంటే? | Suraj Chavan Wins Bigg Boss Marathi 5 Trophy On Sunday Grand Finale, Know His Prize Money Details | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Marathi Winner: బిగ్‌బాస్‌ విన్నర్‌గా సూరజ్‌ చవాన్.. రన్నరప్‌ ఎవరంటే?

Published Mon, Oct 7 2024 8:05 AM | Last Updated on Mon, Oct 7 2024 9:15 AM

Suraj Chavan wins Bigg Boss Marathi 5 on sunday grand finale

ప్రస్తుతం బిగ్‌బాస్‌ రియాలిటీ షో సినీ ప్రియులను అలరిస్తోంది. ఇప్పటికే బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ షో తాజాగా తమిళంలో సీజన్-8 అట్టహాసంగా ప్రారంభమైంది. తాజాగా బిగ్‌బాస్‌ మరాఠీ సీజన్‌-5 గ్రాండ్ ఫినాలే ఆదివారం జరిగింది. ఈ రియాలిటీ షో విజేతగా కంటెంట్ క్రియేటర్ సూరజ్ చవాన్‌ నిలిచారు. బిగ్‌బాస్‌ ట్రోఫీతో పాటు రూ.14.6 లక్షలు ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. ఈ సీజన్‌లో రన్నరప్ అభిజీత్ సావంత్ నిలిచాడు. మూడో స్థానంలో నటి నిక్కీ తంబోలి నిలిచింది.

ఈ గ్రాండ్ ఫీనాలేలో జిగ్రా మువీ టీమ్ సందడి చేసింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో ఆలియా భట్, వేదాంగ్ రైనా, దర్శకుడు వాసన్ బాలా ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ మరాఠీ సీజన్‌- 5 విజేత సూరజ్ చవాన్‌కు ట్రోఫీని అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. మరాఠీ సీజన్‌-5కు జెనీలియా భర్త రితేశ్ దేశ్‌ముఖ్‌ హోస్ట్‌గా వ్యవహరించారు. విన్నర్‌తో దిగిన ఫోటోలను రితేశ్‌ దేశ్‌ముఖ్‌ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement