
హా హా హాసినీ అనగానే మనకు గుర్తొచ్చే హీరోయిన్ జెనీలియా. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన జెనీలియా పెళ్లి తర్వాత నటనకు దూరమయ్యింది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ఆమె ముంబైలోనే ఉంటూ అక్కడే సెటిల్ అయ్యింది. ఇటీవలె వేద్(మజిలీకి రీమేక్)సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా సాలిడ్ హిట్‌ను సొంతం చేసుకుంది.
భర్త రితేష్ డైరెక్షన్‌లో నటించిన ఆమె ఇందులో సమంత పాత్రను పోషించగా, చైతూ రోల్‌లో రితేష్ నటించారు. చాలా గ్యాప్ తర్వాత గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన జెనీలియా నటనకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఈ క్రమంలో తన నటనా జీవితంపై జెనీలియా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు పోషించాలనుకున్నా. ఇల్లాలిగా, పిల్లలకు మంచి తల్లిగా పూర్తి సమయం కేటాయించాలనుకున్నా. అందుకే సినిమాలకు దూరమయ్యా. ఇక రీసెంట్‌గా వేద్ సినిమా విజయం నాలో కొత్త ఉత్సానిచ్చింది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆడియెన్స్ నన్ను నటిగా ఆదరించారు. మళ్లీ మంచి కథలు దొరికితే తప్పకుండా నటిస్తా అంటూ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment