బొమ్మరిల్లు సినిమాలో హ.. హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ జెనీలియా. సౌత్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన జెనీలియా తరువాత బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. తన తొలి చిత్ర హీరో రితేష్ దేశ్ముఖ్ ను పెళ్లాడిన ఈ బ్యూటి సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలకు తల్లయినా ఇప్పటికీ అదే గ్లామర్ మెయిన్ టైన్ చేస్తున్న హాసిని రీ ఎంట్రీతో అదరగొట్టేందుకు రెడీ అవుతోంది.
పెళ్లి తరువాత రెండు హిందీ సినిమాలతో పాటు ఓ మరాఠి సినిమాలో అతిథి పాత్రల్లో నటించిన జెనీలియా త్వరలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించేందుకు ప్లాన్ చేస్తుందట. ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్ కు హాజరైన జెనీలియా త్వరలో ఓ మరాఠి సినిమాతో పాటు సౌత్ సినిమాల్లోనూ నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment