Riteish Deshmukh
-
జెనీలియా చేతికి గాయం
-
అమ్మ పాత చీరతో కొత్త డ్రెస్సు: హీరో
కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకుంటూనే సామన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీపావళి పండగను దేదీప్యమానంగా జరుపుకున్నారు. ఇంటి ముందు దీపాలు వెలిగించడంతో పాటు కొందరు పటాసులు సైతం కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. బాలీవుడ్ నటి జెనీలియా భర్త, నటుడు రితేష్ దేశ్ముఖ్ తన పిల్లలతో కలిసి వేడుకల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. రితేష్.. అతడి తల్లి పాత చీరతో కొత్త బట్టలు కుట్టించారు. వాటిని హీరోతో పాటు అతడి పిల్లలు కూడా ధరించారు. దీంతో తండ్రీకొడుకులు ఒకే రంగు దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఈ వీడియోను జెనీలియా చిత్రీకరించారు. ఇక రితేష్ చేసిన పనిని అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. సూపర్ ఐడియా అని ప్రశంసిస్తున్నారు. (చదవండి: అభిమానులకు అక్షయ్ దీపావళి కానుక) కాగా కెరీర్లో దూసుకుపోతున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు జెనీలియా. రితేష్ దేశ్ముఖ్ను ప్రేమించి పెళ్లాడిన ఆమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక సినిమాల్లో పెద్దగా కనిపించింది లేదు. కానీ రితేష్ నటించి, నిర్మించే సినిమాల్లో సరదాగా అతిథి పాత్రల్లో మెరుస్తుంటారు. అయితే దక్షిణాదిలో మాత్రం రితేష్ను జెనీలియా భర్తగానే చూస్తారు. కానీ అలా అన్నప్పుడు తన ఇగో హర్ట్ అయ్యిందని రితేష్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. (చదవండి: ఆ మాటలకు నా ఇగో హర్ట్ అయ్యింది: జెనీలియా భర్త) View this post on Instagram A post shared by Riteish Deshmukh (@riteishd) -
హ్యాపీ బర్త్డే పప్పా: రితేశ్ భావోద్వేగం
-
సౌత్ లోనూ హాసిని రీ ఎంట్రీ
బొమ్మరిల్లు సినిమాలో హ.. హ.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ జెనీలియా. సౌత్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన జెనీలియా తరువాత బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. తన తొలి చిత్ర హీరో రితేష్ దేశ్ముఖ్ ను పెళ్లాడిన ఈ బ్యూటి సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలకు తల్లయినా ఇప్పటికీ అదే గ్లామర్ మెయిన్ టైన్ చేస్తున్న హాసిని రీ ఎంట్రీతో అదరగొట్టేందుకు రెడీ అవుతోంది. పెళ్లి తరువాత రెండు హిందీ సినిమాలతో పాటు ఓ మరాఠి సినిమాలో అతిథి పాత్రల్లో నటించిన జెనీలియా త్వరలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించేందుకు ప్లాన్ చేస్తుందట. ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్ కు హాజరైన జెనీలియా త్వరలో ఓ మరాఠి సినిమాతో పాటు సౌత్ సినిమాల్లోనూ నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలిపారు. -
జెనీలియా మళ్లీ...?
ముంబై: వరుస శుభవార్తలతో బాలీవుడ్ తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే హీరోయిన్ రాణీ ముఖర్జీ, ఆదిత్యా చోప్రా ఇంట్లోకి ఓ బుజ్జి అతిథి చేరి సంతోషాన్ని పంచింది. ఇపుడిక జెనీలియా వంతట. ఇప్పటికే ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ అమ్మడు మళ్లీ తల్లి కాబోతోందట. బాలీవుడ్ క్యూట్ కపుల్ మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ బీటౌన్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై దేశ్ముఖ్ కుటుంబం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. కాగా బాలీవుడ్ హీరో హీరోయిన్లు రితేష్ దేశ్ముఖ్, జెనీలియా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే (నవంబర్ 24న) వీరి ముద్దుల కొడుకు రియాన్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.