కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకుంటూనే సామన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీపావళి పండగను దేదీప్యమానంగా జరుపుకున్నారు. ఇంటి ముందు దీపాలు వెలిగించడంతో పాటు కొందరు పటాసులు సైతం కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. బాలీవుడ్ నటి జెనీలియా భర్త, నటుడు రితేష్ దేశ్‌ముఖ్ తన పిల్లలతో కలిసి వేడుకల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. రితేష్.. అతడి తల్లి పాత చీరతో కొత్త బట్టలు కుట్టించారు. వాటిని హీరోతో పాటు అతడి పిల్లలు కూడా ధరించారు. దీంతో తండ్రీకొడుకులు ఒకే రంగు దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఈ వీడియోను జెనీలియా చిత్రీకరించారు. ఇక రితేష్ చేసిన పనిని అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. సూపర్ ఐడియా అని ప్రశంసిస్తున్నారు. (చదవండి: అభిమానులకు అక్షయ్ దీపావళి కానుక)
కాగా కెరీర్‌లో దూసుకుపోతున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు జెనీలియా. రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక సినిమాల్లో పెద్దగా కనిపించింది లేదు. కానీ రితేష్ నటించి, నిర్మించే సినిమాల్లో సరదాగా అతిథి పాత్రల్లో మెరుస్తుంటారు. అయితే దక్షిణాదిలో మాత్రం రితేష్‌ను జెనీలియా భర్తగానే చూస్తారు. కానీ అలా అన్నప్పుడు తన ఇగో హర్ట్ అయ్యిందని రితేష్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. (చదవండి: ఆ మాటలకు నా ఇగో హర్ట్ అయ్యింది: జెనీలియా భర్త)
Comments
Please login to add a commentAdd a comment