జెనీలియా మళ్లీ...?
జెనీలియా మళ్లీ...?
Published Thu, Dec 10 2015 6:00 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ముంబై: వరుస శుభవార్తలతో బాలీవుడ్ తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే హీరోయిన్ రాణీ ముఖర్జీ, ఆదిత్యా చోప్రా ఇంట్లోకి ఓ బుజ్జి అతిథి చేరి సంతోషాన్ని పంచింది. ఇపుడిక జెనీలియా వంతట. ఇప్పటికే ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ అమ్మడు మళ్లీ తల్లి కాబోతోందట. బాలీవుడ్ క్యూట్ కపుల్ మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ బీటౌన్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై దేశ్ముఖ్ కుటుంబం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. కాగా బాలీవుడ్ హీరో హీరోయిన్లు రితేష్ దేశ్ముఖ్, జెనీలియా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే (నవంబర్ 24న) వీరి ముద్దుల కొడుకు రియాన్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Advertisement
Advertisement