expecting
-
ఐటీ పరిశ్రమకు చల్లని కబురు.. మాంద్యం భయంపై సీఈవో ఊరట
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో కొన్నాళ్లుగా ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు కమ్ముకున్నాయి. చాలా కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన ఐటీ పరిశ్రమంలో పని చేస్తున్న టెక్ ఉద్యోగుల్లో ఉంది. అయితే ఈ భయంపై ఊరట కలిగించే మాటను గ్లోబల్ డేటా స్టోరేజ్ అండ్ సొల్యూషన్స్ మేజర్ నెట్‌యాప్ (NetApp) సీఈవో జార్జ్ కురియన్ (George Kurian) చెప్పారు. భారత్.. ఆసియాలో అతిపెద్ద మార్కెట్‌గా ఆవిర్భవిస్తుందని నెట్‌యాప్ అంచనా వేస్తోంది. దేశ ఆర్థిక బలం, పెరుగుతున్న యువ జనాభా ఇందుకు దోహం చేస్తాయని భావిస్తోంది. ఈ సంవత్సరం భారతదేశంలో 20 సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసిన ఈ సంస్థ, దేశంలో భాగస్వామ్యాలను, హెడ్‌కౌంట్‌ను విస్తరించడాన్ని కొనసాగిస్తుందని సీఈవో జార్జ్ కురియన్ పేర్కొన్నారు. తేలికపాటి మాంద్యం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి స్థాయి తగ్గడంతో ఐటీ పరిశ్రమలో తేలికపాటి మాంద్యం ఉండొచ్చని తెలిపారు. సంవత్సరం క్రితంతో పోలిస్తే, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వడ్డీ రేటు పెరుగుదల వేగం మందగించడం వల్ల అనిశ్చితి స్థాయి కొద్దిగా తగ్గింది. బిజినెస్ సెంటిమెంట్లు ఇప్పటికే వేగవంతమయ్యాయని చెప్పను కానీ విశ్వాసం మెరుగుపడటం ప్రారంభించిందని కురియన్ అభిప్రాయపడ్డారు. పరిస్థితులు మరింత దిగజారకపోతే అన్ని దేశాలూ మాంద్యం నుంచి బయటకు వస్తాయన్నారు. -
ఈ ఏడాది 80 శాతం వృద్ధి: పోకో
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్ తయారీలో ఉన్న పోకో ఇండియా ఈ ఏడాది 75–80 శాతం వృద్ధిని ఆశిస్తోంది. ప్రధానంగా మీడియం, ఎకానమీ విభాగంలో కంపెనీ హ్యాండ్‌సెట్స్‌కు డిమాండ్ ఇందుకు కారణమని పోకో ఇండియా హెడ్ హిమాన్షు టాండన్ సోమవారం తెలిపారు. ‘మార్కెట్ పరిశోధన సంస్థ కెనాలిస్ ప్రకారం.. భారత్‌లో మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 10–15 శాతం క్షీణించింది. ఆన్లైన్ అమ్మకాలు 20 శాతం పడిపోయాయి. అయితే షావొమీ సబ్–బ్రాండ్ పోకో మార్చి 2023 త్రైమాసికంలో 68 శాతం వృద్ధితో అమ్మకాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్లైన్ బ్రాండ్‌గా ఉద్భవించింది. రూ.10,000 లోపు ధరల శ్రేణిలో సి–సిరీస్‌లో మూడు మోడళ్లను, రూ.20,000–25,0000 ధరల విభాగంలో ఎక్స్5 ప్రో మోడళ్లను విడుదల చేయడం 2023 తొలి త్రైమాసికంలో కంపెనీ వృద్ధికి ఆజ్యం పోశాయి. రెండవ త్రైమాసికం విక్రయాలు జనవరి–మార్చి కంటే ఎక్కువగా ఉన్నాయి. (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా) కస్టమర్లలో 60 శాతం పాతవారే. కొన్ని పెద్ద బ్రాండ్లు ఆన్లైన్ విభాగంలో పలు ధరల శ్రేణులను ఖాళీ చేశాయని భావిస్తున్నాను. ఆ వాటాను పొందేందుకు ఇది మాకు సరైన సమయం. రూ.10,000లోపు సెగ్మెంట్‌పై దృష్టి పెడతాం. రూ.10 వేల శ్రేణిలో 5జీ మోడళ్లను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని వివరించారు. -
అమ్మకాల్లో 20 శాతం వృద్ధి 2023-24పై గోద్రెజ్ అప్లయన్సెస్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల అమ్మకాలు 20 శాతం పెరిగి రూ. 6,200 కోట్లకు చేరగలవని గోద్రెజ్ అప్లయన్సెస్ అంచనా వేస్తోంది. ప్రీమియం ఉత్పత్తుల వాటా ప్రస్తుతమున్న 35 శాతం నుంచి 40 శాతానికి పెరగగలదని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల అమ్మకాలు రూ. 5,200 కోట్లుగా ఉండగలవని అంచనా వేస్తున్నట్లు సంస్థ బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది చెప్పారు. ఏసీల విభాగం అమ్మకాలు రెండింతలు పెరిగి రూ. 1,200 కోట్లకు చేరగలవని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం కంపెనీ అమ్మకాల్లో ఏసీల వాటా 15 శాతంగా ఉండగా ఇది 22 శాతానికి చేరవచ్చని నంది చెప్పారు. కొత్తగా లీక్ ప్రూఫ్ ఎయిర్ కండీషనర్లను గురువారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దీని ధర రూ. 48,900గా ఉంటుంది. ఈ వేసవిలో కూలింగ్ ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చైనా నుంచి సరఫరాల్లో అంతరాయాలు ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుతం చాలా మటుకు విడిభాగాలు, పరికరాలను దేశీయంగానే తయారు చేసుకోవడం పెరుగుతోందని నంది వివరించారు. -
జెనీలియా మళ్లీ...?
ముంబై: వరుస శుభవార్తలతో బాలీవుడ్ తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే హీరోయిన్ రాణీ ముఖర్జీ, ఆదిత్యా చోప్రా ఇంట్లోకి ఓ బుజ్జి అతిథి చేరి సంతోషాన్ని పంచింది. ఇపుడిక జెనీలియా వంతట. ఇప్పటికే ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ అమ్మడు మళ్లీ తల్లి కాబోతోందట. బాలీవుడ్ క్యూట్ కపుల్ మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ బీటౌన్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై దేశ్‌ముఖ్ కుటుంబం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. కాగా బాలీవుడ్ హీరో హీరోయిన్లు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే (నవంబర్ 24న) వీరి ముద్దుల కొడుకు రియాన్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.