
వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అన్న హహహ హాసినిని ఎవరు మరిచిపోగలరు? అవును జెనిలియా! అమాయకమైన అందం.. అల్లరి అభినయం ఆమె క్రియేట్ చేసుకున్న బ్రాండ్! మరి ఫ్యాషన్‌లో? చూద్దాం..
జ్యూయెలరీ
బ్రాండ్ వాల్యూ
చక్కని జ్వాన్
జ్వాన్ అంటే డచ్ భాషలో చక్కదనం అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే జ్వాన్ కలెక్షన్స్ చక్కగా ఉంటాయి. డిజైన్‌తో పాటు దుస్తుల నాణ్యతకూ ప్రాధాన్యం ఇస్తారు. అదే వీరి బ్రాండ్ వాల్యూ. గాంధీనగర్‌కు చెందిన తన్వి సావ్లాని 2016లో సూరత్‌లో ‘జ్వాన్’ను ప్రారంభించింది. మొదట్లో కేవలం తన డిజైన్స్‌కు మాత్రమే పరిమితం చేసింది. కానీ తర్వాత ఔత్సాహిక డిజైనర్స్‌నూ ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో వాళ్లు డిజైన్ చేసిన దుస్తులనూ అందిస్తోంది. ఇవి ఆన్‌లైన్ స్టోర్స్‌లోనూ దొరుకుతాయి. ధరలు మధ్యస్తంగా ఉంటాయి.
డిజైనర్ వందన జగ్వానీ
ప్రముఖ జ్యూయెలరీ డిజైనర్స్‌లో వందన జగ్వానీ ఒకరు. వజ్రాభరణాల ప్రఖ్యాత బ్రాండ్ ‘నోటన్‌దాస్ జ్యూయెలర్స్’తో కలిసి పనిచేస్తోంది ఆమె. ఈ మధ్యనే తన పేరు మీద ‘వందన వరల్డ్’ జ్యూయెలరీ స్టోర్‌ను ప్రారంభించింది. పలురకాల వజ్రాలను ఉపయోగించి నగలను రూపొందించడం ఆమె ప్రత్యేకత. డైమండ్ నాణ్యత ఆధారంగా ధర ఉంటుంది.
డ్రెస్
బ్రాండ్ : జ్వాన్ కలెక్షన్స్
(Zwaan Collections)
పేరు: రెడ్ డ్రేప్డ్ టాప్ విత్ రెడ్ ప్యాంట్స్ (Red Draped Top with Red Pants)
ధర: రూ. 17,800
'ఇతరులు అనుకున్నదాని కంటే భిన్నంగా కనిపించి, మెప్పించడం నాకు చాలా ఇష్టం.అలా వారు నన్ను ఆశ్చర్యంగా చూస్తుంటే భలే ఆనందంగా ఉంటుంది'
– జెనిలియా దేశ్‌ముఖ్
Comments
Please login to add a commentAdd a comment