
Upasana Christmas Dress: క్రిస్‌మస్ పండగను ఎంతో గ్రాండ్‌గా జరుపుకుంది మెగా ఫ్యామిలీ. ఈ వేడుకల్లో రామ్‌చరణ్- ఉపాసన దంపతులు దిగిన ఫొటోలు నెట్టింట గింగిరాలు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉపాసన వేసుకున్న డ్రెస్ గురించి అమ్మాయిలు ఆరా తీస్తున్నారు. ఎంతో సింపుల్‌గా కనిపించడానికే ఇష్టపడే ఉపాసన క్రిస్‌మస్ పండగ రోజు వైట్ అండ్ రెండ్ డ్రెస్ ధరించింది.
చూడటానికి సాధారణంగా కనిపిస్తున్న ఈ డ్రెస్ ధర మాత్రం మామూలుగా లేదు. డోల్స్ అండ్ గబ్బానా బ్రాండ్‌కు చెందిన ఈ డ్రెస్ ఖరీదు రూ.2.5 లక్షలట. ఇది విన్న నెటిజన్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అంత సాదాసీదాగా ఉన్న డ్రెస్‌కు అన్ని లక్షలు పెట్టి కొన్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఆ డ్రెస్‌లో ఉపాసన చాలా బాగున్నారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment