
రామ్‌చరణ్ సతీమణి ఉపాసన.. తమ గారాలపట్టి క్లీంకార ఫోటో షేర్ చేసింది. ముత్తాత (ఉపాసన తాతయ్య), తాతయ్య (ఉపాసన తండ్రి)తో కలిసి అపోలో ఆస్పత్రిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం జరిగిన పవిత్రోత్సవాల్లో చిన్నారి పాల్గొందని తెలిపింది.
ఉపాసన ఎమోషనల్
తాత చంకనెక్కిన క్లీంకారను చూస్తుంటే తన చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయంది. అలాగే ఈ గుడి తనకెంతో ప్రత్యేకమని పేర్కొంది. అలాగే ఈ ఆనందకర క్షణాలను వెలకట్టలేనని పోస్ట్ కింద రాసుకొచ్చింది. ఇక ఉపాసన షేర్ చేసిన ఫోటోలో క్లీంకార ముఖం స్పష్టంగా కనిపించకూడదని కాస్త బ్లర్ చేసింది.
ఇంత పెద్దగా అయిపోయిందా?
ఇది చూసిన అభిమానులు.. ఈ చిట్టితల్లిని ఇంకెప్పుడు చూస్తామో అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో క్లీంకార అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు 11 ఏళ్ల తర్వాత కూతురు పుట్టింది. 2023 జూన్‌లో జన్మించిన తన ముద్దుల మనవరాలికి చిరంజీవి క్లీంకార అని నామకరణం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment