
తాజాగా బుజ్జి ఉపాసన ఇంటికి చేరింది. అదెలాగంటారా? కల్కి 2898 ఏడీ చిత్రయూనిట్ బుజ్జిని పోలి ఉన్న చిన్న బొమ్మను, పాత్రల స్టిక్కర్స్‌ను రామ్‌చరణ్- ఉపాసనల కూ
సలార్‌తో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ప్రభాస్.. కల్కి 2898 ఏడీ చిత్రంతో మరోసారి రికార్డులు తిరగరాసేందుకు సిద్ధమవుతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 27న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ఉపాసన ఇంటికి బుజ్జి
అయితే సినిమా రిలీజ్‌కు ముందే బుజ్జి అండ్ భైరవ అనే యానిమేషన్ సిరీస్ లాంచ్ చేశారు. ఇందులో బుజ్జి, భైరవ పాత్రలను పరిచయం చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ సిరీస్‌కు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా బుజ్జి ఉపాసన ఇంటికి చేరింది. అదెలాగంటారా? కల్కి 2898 ఏడీ చిత్రయూనిట్ బుజ్జిని పోలి ఉన్న చిన్న బొమ్మను, పాత్రల స్టిక్కర్స్‌ను రామ్‌చరణ్- ఉపాసనల కూతురు క్లీంకారకు బహుమతిగా ఇచ్చింది.

చిత్రయూనిట్‌కు థ్యాంక్స్
వాటితో క్లీంకార ఆడుకుంటున్న ఫోటోను ఉప్సీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అయితే కూతురు ముఖం కనిపించకుండా ఆ ఫోటో తీసింది. తనకు ఈ బహుమతి పంపినందుకు హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు స్వప్న దత్, ప్రింయాక దత్‌లకు కృతజ్ఞతలు తెలియజేసింది.
చదవండి: Bujji And Bhairava Review: యానిమేటెడ్ సిరీస్ ఎలా ఉందంటే..