బుల్లితెర కమెడియన్ యాదమ్మరాజు తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య స్టెల్లా రాజ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దీంతో ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ ప్రసవం అంత ఈజీగా జరగలేదంటూ తమ అనుభవాలను యూట్యూబ్ వీడియోతో పంచుకున్నారు.
బిడ్డకు గ్యారెంటీ ఇవ్వలేమన్న వైద్యులు
స్టెల్లా మాట్లాడుతూ.. సాధారణ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు తగ్గిందన్నారు. త్వరగా డెలివరీ చేయాలన్నారు. ఒక ఇంజక్షన్ తీసుకుని ఇంటికి వచ్చాను. తర్వాత ఇంకో డాక్టర్‌ను సంప్రదిస్తే ఇది చాలా ఎమర్జెన్సీ.. వెంటనే అడ్మిట్ అవాలన్నారు. కడుపులో ఉన్న బిడ్డకు కూడా గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. అప్పుడు యాదమ్మరాజును పట్టుకుని చాలా ఏడ్చాను. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చాం.
అందుకే శ్రీమంతం క్యాన్సిల్
తెలిసినవాళ్ల ద్వారా తర్వాతి రోజు గాంధీ ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు ఎక్కించారు. కానీ అక్కడి పరిస్థితులు చూశాక భయమేసి మరో ఆస్పత్రికి వెళ్లాం. నా పరిస్థితి క్లిష్టంగా ఉందన్నారు. బిడ్డ గురించి ఎలాంటి ఆశ పెట్టుకోవద్దన్నారు. ఇందువల్లే శ్రీమంతం కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. డాక్టర్స్ చెప్పిన డేట్ కంటే దాదాపు 15 రోజుల ముందే డెలివరీ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు నా డెలివరీ జరిగింది. బేబీ ఆరోగ్యంగా ఉంది అని స్టెల్లా రాజ్ చెప్పుకొచ్చింది. ఇకపోతే వీరికి బాబు పుట్టినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment