Yadamma Raju
-
కడుపులో బిడ్డకు గ్యారెంటీ ఇవ్వమన్నారు: స్టెల్లా ఎమోషనల్
బుల్లితెర కమెడియన్ యాదమ్మరాజు తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య స్టెల్లా రాజ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దీంతో ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ ప్రసవం అంత ఈజీగా జరగలేదంటూ తమ అనుభవాలను యూట్యూబ్ వీడియోతో పంచుకున్నారు.బిడ్డకు గ్యారెంటీ ఇవ్వలేమన్న వైద్యులుస్టెల్లా మాట్లాడుతూ.. సాధారణ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు తగ్గిందన్నారు. త్వరగా డెలివరీ చేయాలన్నారు. ఒక ఇంజక్షన్ తీసుకుని ఇంటికి వచ్చాను. తర్వాత ఇంకో డాక్టర్‌ను సంప్రదిస్తే ఇది చాలా ఎమర్జెన్సీ.. వెంటనే అడ్మిట్ అవాలన్నారు. కడుపులో ఉన్న బిడ్డకు కూడా గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. అప్పుడు యాదమ్మరాజును పట్టుకుని చాలా ఏడ్చాను. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చాం.అందుకే శ్రీమంతం క్యాన్సిల్తెలిసినవాళ్ల ద్వారా తర్వాతి రోజు గాంధీ ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు ఎక్కించారు. కానీ అక్కడి పరిస్థితులు చూశాక భయమేసి మరో ఆస్పత్రికి వెళ్లాం. నా పరిస్థితి క్లిష్టంగా ఉందన్నారు. బిడ్డ గురించి ఎలాంటి ఆశ పెట్టుకోవద్దన్నారు. ఇందువల్లే శ్రీమంతం కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. డాక్టర్స్ చెప్పిన డేట్ కంటే దాదాపు 15 రోజుల ముందే డెలివరీ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు నా డెలివరీ జరిగింది. బేబీ ఆరోగ్యంగా ఉంది అని స్టెల్లా రాజ్ చెప్పుకొచ్చింది. ఇకపోతే వీరికి బాబు పుట్టినట్లు తెలుస్తోంది.చదవండి: పాక్‌లో ఇండియన్ సినిమాల కోసం ఆరాటం.. ఏకంగా! -
జబర్దస్త్ యాదమ్మ రాజు భార్య స్టెల్లా మెటర్నిటీ ఫోటోషూట్
-
తండ్రి కాబోతున్నతెలుగు ప్రముఖ కమెడియన్.. పోస్ట్ వైరల్
ఎక్కడా లేని విధంగా తెలుగులో బోలెడంత మంది కమెడియన్స్ ఉన్నారు. సినిమాలు, టీవీ షోలు చేస్తూ ఉన్నంతలో ఎంటర్టైన్ చేస్తుంటారు. అలా స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి, షోల్లో స్కిట్స్ చేసేంతలా గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పేశాడు. తన భార్య ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని వెల్లడించాడు.(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్)'పటాస్' కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు.. సద్దాంతో కలిసి స్కిట్స్, ప్రోగ్రామ్స్ చేస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం 'జబర్దస్త్'లో కమెడియన్‌గా ఉన్నాడు. ఇకపోతే ఏడాదిన్నర క్రితం యూట్యూబర్ స్టెల్లా రాజ్‌ని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జంటనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!) View this post on Instagram A post shared by sharon stella pastham (@stellaraj_777) -
Yadammaraju-Stella: యాదమ్మరాజు- స్టెల్లా దంపతుల బంధానికి ఏడాది, స్పెషల్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
నవ్వులే నవ్వులు
చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్ వర్ధన్ , యాదమ్మ రాజు, అప్పారావు, బేబీ ప్రేక్షిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్లాంట్ మ్యాన్’. కె.సంతోష్ బాబు దర్శకత్వం వహించారు. డీఎం యూనివర్సల్ స్టూడియోస్‌పై పన్నా రాయల్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్లో విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పన్నా రాయల్ మాట్లాడుతూ–‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ‘ప్లాంట్ మ్యాన్’. ప్రారంభం నుంచి చక్కని వినోదం ఉంటుంది. ఒక కొత్త అంశం కూడా ఉంది.. అందుకే ఈ సినిమాకి ‘ప్లాంట్ మ్యాన్ ’ అనే టైటిల్ నిర్ణయించాం. ఈ చిత్రం తర్వాత కూడా మా బేనర్లో కొత్తవారిని పరిచయం చేస్తూ సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పీఎస్. మణికర్ణన్ , నేపథ్య సంగీతం: వినోద్ యాజమాన్య, సంగీతం: ఆనంద బాలాజీ, నిర్మాత–దర్శకత్వ పర్యవేక్షణ: పన్నా రాయల్. -
కుడికాలి వేలు తీసేశారు.. తొడపై చర్మాన్ని తీసి..: యాదమ్మరాజు
జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు కొద్దిరోజులుగా కాలికి కట్టుతో కనిపిస్తున్నాడు. తాజాగా స్లమ్‌డాగ్ హజ్బెండ్ ఈవెంట్లో కూడా అతడు చేతికర్ర సాయంతో నడుస్తూ కనిపించాడు. తనకు అంత పెద్ద గాయం ఎలా అయింది? ఏం జరిగిందనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు కమెడియన్. యాదమ్మరాజు మాట్లాడుతూ.. 'చాయ్ తాగడానికి బయటకు వెళ్లాను. అప్పుడే అటుగా వచ్చిన వ్యక్తి బైక్ స్కిడ్ అవడంతో నన్ను గుద్దేశాడు. కుడికాలి వేలు తీసేశారు. తొడ భాగం నుంచి చర్మం తీసేసి వేలు దగ్గర అతికించారు. ప్రాణం పోయినట్లనిపించింది. ఇప్పటికీ చాలా నొప్పిగా ఉంది. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనాలి కదా అని ఈవెంట్స్‌లో, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇంత జరిగినా ప్రమోషన్స్‌కు వచ్చిన యాదమ్మరాజుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మునుపటిలా పరుగులు పెట్టకుండా ఇంట్లో ఉండి కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. ఇకపోతే పటాస్ కామెడీ షోతో పాపులరయ్యాడు యాదమ్మ రాజు. తన పంచులు, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల పెదవులపై నవ్వులు పూయించాడు. జబర్దస్త్ షోతో మరింత మందికి చేరువైన ఈ కమెడియన్ ప్రియురాలి స్టెల్లా రాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ యూట్యూబ్ వీడియోలతో అభిమానులను అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం బుల్లితెర షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు యాదమ్మ రాజు. చదవండి: బిగ్‌బాస్ 7 ప్రారంభమయ్యేది అప్పుడే! -
Yadamma Raju Leg Injury Video: నడవలేని స్థితికి చేరుకున్న ఏదమ్మరజు
-
కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్!
ప్రముఖ కమెడియన్ యాదమ్మ రాజు హాస్పిటల్లో కనిపించాడు. కాలికి సర్జరీ జరగ్గా, పెద్ద కట్టుతో కనిపించాడు. భార్య స్టెల్లా అతడికి తోడుగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోని స్వయంగా యాదమ్మ రాజు తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఇంతకీ ఏం జరిగింది? (ఇదీ చదవండి: 'బేబీ' నటికి బెదిరింపులు.. చంపేస్తామంటూ!) ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన 'పటాస్' కామెడీ షోతో యాదమ్మ రాజు వెలుగులోకి వచ్చాడు. తనదైన పంచులు, టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ప్రస్తుతం 'జబర్దస్త్'లో సద్దాంతో కలిసి టీమ్ లీడర్‌గా చేస్తున్నాడు. ప్రతివారం స్కిట్స్‌తో నవ్వించే ఇతడు ఇప్పుడు సడన్‌గా కాలికి కట్టుతో కనిపించాడు. అయితే ఈ మధ్య ఏమైనా మెట్లపై నుంచి కాలు జారాడా? లేదా ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. వీడియో మాత్రమే పోస్ట్ చేసిన యాదమ్మ రాజు.. ఏం జరిగింది? ఏంటనేది బయటపెట్టలేదు. బహుశా ఏం జరిగిందనేది యూట్యూబ్‌లో వీడియోగా పెడతాడేమో చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా యూట్యూబర్ స్టెల్లా రాజ్‌ని యాదమ్మ రాజు గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకున్నాడు. (ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!)