
ఎక్కడా లేని విధంగా తెలుగులో బోలెడంత మంది కమెడియన్స్ ఉన్నారు. సినిమాలు, టీవీ షోలు చేస్తూ ఉన్నంతలో ఎంటర్‌టైన్ చేస్తుంటారు. అలా స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి, షోల్లో స్కిట్స్ చేసేంతలా గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పేశాడు. తన భార్య ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని వెల్లడించాడు.
(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్)

'పటాస్' కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు.. సద్దాంతో కలిసి స్కిట్స్, ప్రోగ్రామ్స్ చేస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం 'జబర్దస్త్'లో కమెడియన్‌గా ఉన్నాడు. ఇకపోతే ఏడాదిన్నర క్రితం యూట్యూబర్ స్టెల్లా రాజ్‌ని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జంటనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!)
Comments
Please login to add a commentAdd a comment