
జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు కొద్దిరోజులుగా కాలికి కట్టుతో కనిపిస్తున్నాడు. తాజాగా స్లమ్‌డాగ్ హజ్బెండ్ ఈవెంట్‌లో కూడా అతడు చేతికర్ర సాయంతో నడుస్తూ కనిపించాడు. తనకు అంత పెద్ద గాయం ఎలా అయింది? ఏం జరిగిందనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు కమెడియన్.
యాదమ్మరాజు మాట్లాడుతూ.. 'చాయ్ తాగడానికి బయటకు వెళ్లాను. అప్పుడే అటుగా వచ్చిన వ్యక్తి బైక్ స్కిడ్ అవడంతో నన్ను గుద్దేశాడు. కుడికాలి వేలు తీసేశారు. తొడ భాగం నుంచి చర్మం తీసేసి వేలు దగ్గర అతికించారు. ప్రాణం పోయినట్లనిపించింది. ఇప్పటికీ చాలా నొప్పిగా ఉంది. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనాలి కదా అని ఈవెంట్స్‌లో, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇంత జరిగినా ప్రమోషన్స్‌కు వచ్చిన యాదమ్మరాజుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మునుపటిలా పరుగులు పెట్టకుండా ఇంట్లో ఉండి కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు.
ఇకపోతే పటాస్ కామెడీ షోతో పాపులరయ్యాడు యాదమ్మ రాజు. తన పంచులు, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల పెదవులపై నవ్వులు పూయించాడు. జబర్దస్త్ షోతో మరింత మందికి చేరువైన ఈ కమెడియన్ ప్రియురాలి స్టెల్లా రాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ యూట్యూబ్ వీడియోలతో అభిమానులను అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం బుల్లితెర షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు యాదమ్మ రాజు.
Comments
Please login to add a commentAdd a comment