Comedian Yadamma Raju Leg Injured; Video Viral - Sakshi
Sakshi News home page

Yadamma Raju: హాస్పిటల్‌లో యాదమ్మ రాజు.. అలాంటి స్థితిలో?

Published Mon, Jul 24 2023 6:57 PM | Last Updated on Tue, Jul 25 2023 9:10 AM

Comedian Yadamma Raju Leg Injury Hospital Video - Sakshi

ప్రముఖ కమెడియన్ యాదమ్మ రాజు హాస్పిటల్‌లో కనిపించాడు. కాలికి సర్జరీ జరగ్గా, పెద్ద కట్టుతో కనిపించాడు. భార్య స్టెల్లా అతడికి తోడుగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోని స్వయంగా యాదమ్మ రాజు తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఇంతకీ ఏం జరిగింది? 

(ఇదీ చదవండి: 'బేబీ' నటికి బెదిరింపులు.. చంపేస్తామంటూ!)

ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన 'పటాస్' కామెడీ షోతో యాదమ్మ రాజు వెలుగులోకి వచ్చాడు. తనదైన పంచులు, టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ప్రస్తుతం 'జబర్దస్త్'లో సద్దాంతో కలిసి టీమ్ లీడర్‌గా చేస్తున్నాడు. ప్రతివారం స్కిట్స్‌తో నవ్వించే ఇతడు ఇప్పుడు సడన్‌గా కాలికి కట్టుతో కనిపించాడు. 

అయితే ఈ మధ్య ఏమైనా మెట్లపై నుంచి కాలు జారాడా? లేదా ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. వీడియో మాత్రమే పోస్ట్ చేసిన యాదమ్మ రాజు.. ఏం జరిగింది? ఏంటనేది బయటపెట్టలేదు. బహుశా ఏం జరిగిందనేది యూట్యూబ్‌లో వీడియోగా పెడతాడేమో చూడాల‍్సి ఉంది. ఇదిలా ఉండగా యూట్యూబర్ స్టెల్లా రాజ్‌ని యాదమ్మ రాజు గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకున్నాడు.

(ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement