
చుట్టమల్లే చుట్టేసి వెళ్లిపోయినట్లుంది 2024. మొన్నే ప్రారంభమైందనుకునేలోపే గుడ్‌బై చెప్పేందుకు రెడీ అయిపోయింది. కానీ ఈ ఏడాది ఎప్పటిలాగే బోలెడన్ని సినిమాలు రిలీజయ్యాయి. అందులో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్న చిత్రాలతో పాటు మనసులు కదిలించే కథలు కూడా ఉన్నాయి. అయితే మన సినిమాలు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవల్‌లో ప్రాచుర్యం ఉందాయి. అందుకు ఇదే బెస్ట ఎగ్జాంపుల్.
టాప్ 10లో ఎనిమిది మనవే!
పాకిస్తాన్‌లో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమా/వెబ్ సిరీస్‌ల జాబితాను గూగుల్ రిలీజ్ చేసింది. ఆశ్చర్యంగా టాప్ 10లో ఎనిమిది మన భారతీయ చిత్రాలే కాగా రెండు మాత్రమే పాక్ దేశానికి సంబంధించినవి. హీరామండి వెబ్ సిరీస్ మొదటి స్థానంలో ఉండగా 12th ఫెయిల్ రెండో స్థానంలో ఉంది. యానిమల్, మీర్జాపూర్ 3(వెబ్ సిరీస్), స్త్రీ 2 తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నాయి.
బిగ్‌బాస్‌కూ క్రేజ్
ఆరవ స్థానంలో పాక్ సినిమా ఇష్క్ ముర్షీద్ చోటు దక్కించుకుంది. తర్వాత మళ్లీ ఇండియన్ సినిమాలు, షోలే హవా చాటాయి. ఏడో స్థానంలో భూల్ భులయ్యా 3, ఎనిమిదో స్థానంలో డంకీ, తొమ్మిదో స్థానంలో హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్ పాగా వేశాయి. చివరగా పాక్ డ్రామా కభీ హమ్ కభీ తుమ్ పదో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment