google most searched
-
పాక్‌లో ఇండియన్ సినిమాల కోసం ఆరాటం.. ఏకంగా!
చుట్టమల్లే చుట్టేసి వెళ్లిపోయినట్లుంది 2024. మొన్నే ప్రారంభమైందనుకునేలోపే గుడ్‌బై చెప్పేందుకు రెడీ అయిపోయింది. కానీ ఈ ఏడాది ఎప్పటిలాగే బోలెడన్ని సినిమాలు రిలీజయ్యాయి. అందులో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్న చిత్రాలతో పాటు మనసులు కదిలించే కథలు కూడా ఉన్నాయి. అయితే మన సినిమాలు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవల్లో ప్రాచుర్యం ఉందాయి. అందుకు ఇదే బెస్ట ఎగ్జాంపుల్.టాప్ 10లో ఎనిమిది మనవే!పాకిస్తాన్లో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమా/వెబ్ సిరీస్‌ల జాబితాను గూగుల్ రిలీజ్ చేసింది. ఆశ్చర్యంగా టాప్ 10లో ఎనిమిది మన భారతీయ చిత్రాలే కాగా రెండు మాత్రమే పాక్ దేశానికి సంబంధించినవి. హీరామండి వెబ్ సిరీస్ మొదటి స్థానంలో ఉండగా 12th ఫెయిల్ రెండో స్థానంలో ఉంది. యానిమల్, మీర్జాపూర్ 3(వెబ్ సిరీస్), స్త్రీ 2 తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నాయి.బిగ్‌బాస్‌కూ క్రేజ్ఆరవ స్థానంలో పాక్ సినిమా ఇష్క్ ముర్షీద్ చోటు దక్కించుకుంది. తర్వాత మళ్లీ ఇండియన్ సినిమాలు, షోలే హవా చాటాయి. ఏడో స్థానంలో భూల్ భులయ్యా 3, ఎనిమిదో స్థానంలో డంకీ, తొమ్మిదో స్థానంలో హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్ పాగా వేశాయి. చివరగా పాక్ డ్రామా కభీ హమ్ కభీ తుమ్ పదో స్థానంలో నిలిచింది.చదవండి: తొలి స్థానంలో స్త్రీ2... రెండో స్థానంలో కల్కి 2898 ఏడీ -
ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఖాతాలో మరో రికార్డు..
Neeraj Chopra Leads Google 2021 Year in Search: 2021 సంవత్సరానికి గాను గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తుల జాబితాలో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా అగ్రస్థానంలో నిలిచాడు. అతని తర్వాతి స్థానాల్లో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్, పంజాబీ నటి షెహనాజ్ గిల్, బాలీవుడ్ నటి శిల్పా షెట్టి భర్త రాజ్ కుంద్రా, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, రెజ్లర్లు బజరంగ్ పునియా, సుశీల్ కుమార్, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ భార్య నటాషా దలాల్ ఉన్నారు. ఈ జాబితాకు సంబంధించిన వివరాలను గూగుల్ బుధవారం ప్రకటించింది. చదవండి: భారత టెస్ట్ జట్టు ప్రకటన.. జడేజాతో పాటు మరో స్టార్ స్పిన్నర్ ఔట్ -
సుల్తాన్ ఫస్ట్.. కబాలీ సెకండ్!
-
సుల్తాన్ ఫస్ట్.. కబాలీ సెకండ్!
న్యూఢిల్లీ: ఎన్నో అంచనాల మధ్య విడుదలైన తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ ‘కబాలి’ని వెనక్కి నెట్టి సల్మాన్ ఖాన్ మూవీ సుల్తాన్ గూగుల్ సెర్చ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 2016 ఏడాదికి గానూ గూగుల్ ఇండియా ట్రెండింగ్ మూవీల జాబితాలో కండలవీరుడు సల్మాన్ హవా సాగింది. కబాలి, డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఉడ్తా పంజాబ్, పాకిస్తాన్ నటులు ఉన్నారని విడుదలను ఆపేయాలన్న మూవీ ‘ఏ దిల్ హై ముష్కిల్’, రుస్తుమ్, సైరత్, మొహంజోదారో మూవీలకు సంబంధించిన వీడియోలు, వార్తలు గూగుల్ ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. సుల్తాన్ తర్వాత రెండో స్థానంలో రజనీకాంత్ మూవీ కబాలి నిలిచింది. హీరోల్లో సుశాంత్ రాజ్‌పుత్.. హీరోయిన్లలో దిశా పటానీ ధోనీ జీవిత కథాంశంతో వచ్చిన మూవీలో తెరపై ధోనీ పాత్రలో మెప్పించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మోస్ట్ బాలీవుడ్ ట్రెండింగ్ మేల్ ఆర్టిస్టుగా నిలిచాడు. కబీర్ బేడి, హర్షవర్ధన కపూర్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, సూరజ్ పంచోలీ, అనుపమ్ ఖేర్ టాప్-10 సెర్చింగ్ బాలీవుడ్ నటుల జాబితాలో ఉన్నారు. దిశా పటానీ టాప్ ట్రెండింగ్ హీరోయిన్గా నిలిచింది. పుజా హెగ్డే, ఊర్వశీ రౌతెలా, ఉర్మిలా మండోద్కర్, మందన కరిమి, వాణీ కపూర్, సయామీ ఖేర్, నిమ్రత్ కౌర్ టాప్ 10 ఫీమెల్ ఆర్టిస్టులలో చోటు దక్కించుకున్నారు.