
Neeraj Chopra Leads Google 2021 Year in Search: 2021 సంవత్సరానికి గాను గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తుల జాబితాలో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా అగ్రస్థానంలో నిలిచాడు. అతని తర్వాతి స్థానాల్లో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్, పంజాబీ నటి షెహనాజ్ గిల్, బాలీవుడ్ నటి శిల్పా షెట్టి భర్త రాజ్ కుంద్రా, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఉన్నారు.
వీరి తర్వాతి స్థానాల్లో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, రెజ్లర్లు బజరంగ్ పునియా, సుశీల్ కుమార్, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ భార్య నటాషా దలాల్ ఉన్నారు. ఈ జాబితాకు సంబంధించిన వివరాలను గూగుల్ బుధవారం ప్రకటించింది.
చదవండి: భారత టెస్ట్ జట్టు ప్రకటన.. జడేజాతో పాటు మరో స్టార్ స్పిన్నర్ ఔట్
Comments
Please login to add a commentAdd a comment