సుల్తాన్‌ ఫస్ట్‌.. కబాలీ సెకండ్‌! | Sultan movie most trending film of 2016 and Kabali second | Sakshi
Sakshi News home page

సుల్తాన్‌ ఫస్ట్‌.. కబాలీ సెకండ్‌!

Published Thu, Dec 15 2016 2:48 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

సుల్తాన్‌ ఫస్ట్‌.. కబాలీ సెకండ్‌!

సుల్తాన్‌ ఫస్ట్‌.. కబాలీ సెకండ్‌!

న్యూఢిల్లీ: ఎన్నో అంచనాల మధ్య విడుదలైన తమిళనాడు సూపర్‌ స్టార్‌​ రజనీకాంత్‌ మూవీ ‘కబాలి’ని వెనక్కి నెట్టి సల్మాన్‌ ఖాన్‌ మూవీ సుల్తాన్‌ గూగుల్‌ సెర్చ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 2016 ఏడాదికి గానూ గూగుల్‌ ఇండియా ట్రెండింగ్‌ మూవీల జాబితాలో కండలవీరుడు సల్మాన్‌ హవా సాగింది. కబాలి, డ్రగ్స్‌ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఉడ్తా పంజాబ్‌, పాకిస్తాన్‌​ నటులు ఉన్నారని విడుదలను ఆపేయాలన్న మూవీ ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’, రుస్తుమ్‌, సైరత్‌, మొహంజోదారో మూవీలకు సంబంధించిన వీడియోలు, వార్తలు గూగుల్‌ ఇండియాలో టాప్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. సుల్తాన్‌ తర్వాత రెండో స్థానంలో రజనీకాంత్‌ మూవీ కబాలి నిలిచింది.

హీరోల్లో సుశాంత్‌ రాజ్‌పుత్‌​.. హీరోయిన్లలో దిశా పటానీ
ధోనీ జీవిత కథాంశంతో వచ్చిన మూవీలో తెరపై ధోనీ పాత్రలో మెప్పించిన సుశాంత్‌ సింగ్‌​ రాజ్‌పుత్‌ మోస్ట్‌ బాలీవుడ్‌ ట్రెండింగ్‌ మేల్‌ ఆర్టిస్టుగా నిలిచాడు. కబీర్‌​ బేడి, హర్షవర్ధన​ కపూర్‌​, సల్మాన్‌ ఖాన్‌​, రణవీర్‌ సింగ్‌, సూరజ్‌​ పంచోలీ, అనుపమ్‌ ఖేర్‌ టాప్‌-10 సెర్చింగ్‌ బాలీవుడ్‌ నటుల జాబితాలో ఉన్నారు. ​దిశా పటానీ టాప్‌ ట్రెండింగ్‌ హీరోయిన్‌గా నిలిచింది. పుజా హెగ్డే, ఊర్వశీ రౌతెలా, ఉర్మిలా మండోద్కర్‌, మందన కరిమి, వాణీ కపూర్‌​, సయామీ ఖేర్‌, నిమ్రత్‌ కౌర్‌ టాప్‌ 10 ఫీమెల్‌ ఆర్టిస్టులలో చోటు దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement