Viral: Genelia Shares Funny Video Of Hitting Riteish Deshmukh Over Jealous - Sakshi
Sakshi News home page

వైరల్‌ : నటిని ముద్దుపెట్టుకున్న బాలీవుడ్‌ హీరో

Published Sat, Mar 20 2021 3:58 PM | Last Updated on Sat, Mar 20 2021 6:51 PM

Riteish Kisses Preity Zintas Hands, Jealous Genelia Gives Him A Punch - Sakshi

ముంబై : భర్త తన ముందే వేరే మహిళతో క్లోజ్‌గా ఉంటే ఏ భార్యకైనా కోపం వస్తుంది. దీనికి సినిమా స్టార్స్‌ కూడా అతీతం కాదు. ఎంత ఫ్రెండ్లీ నేచర్‌ ఉన్నా,  భర్త తన కళ్లముందే మరో నటితో సన్నిహితంగా ఉంటే ఈర్వ్స, చిరాకు, కోపం..ఇలా అన్నీ వస్తాయి. హీరోయిన్‌ జెనీలియాకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ అవార్డు ఫంక్షన్‌లో జెనీలియా భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌..నటి ప్రీతి జింటాను కలిశారు. ఈ సందర్భంగా రితేష్‌..ప్రీతి చేతులకు ఫ్రెండ్లీగా ముద్దు పెట్టాడు. ఇది చూసి పక్కనే ఉన్న జెనీలియా చాలా అసౌకర్యానికి ఫీల్‌ అవుతుంటుంది. మీ సంభాషణ ఎప్పుడు ముగిస్తారురా బాబు..అన్నట్లు ఇద్దరినీ చాలా జలస్‌గా చూస్తుంటుంది.

నిజానికి ఇది  2019లో ఐఫా అవార్డుల సంద‌ర్భంగా జరిగిన సన్నివేశం. సోషల్‌ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఈ వీడియో బయటికొచ్చొంది. ఈ మధ్యకాలంలో బాగా వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. రితీష్‌- ప్రీతి జింటాలను చూసి జెనీలియా జలస్‌గా చూస్తున్న ఎక్స్‌ప్రెషన్స్‌ వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంటుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీనిపై పలు స్పూఫ్‌ వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.

దీనిపై స్పందించిన జెనీలియా..ఈ ఫంక్షన్‌ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అంటూ మరో వీడియోను రిలీజ్‌ చేశారు. ఇందులో ఇంటికి రాగానే జెనీలియా..భర్త రితీష్‌ను కొడుతున్నట్లు ఫన్నీగా ఓ వీడియోను చేసింది. దీన్ని రితేష్‌- ప్రీతి జింటాలకు సైతం ట్యాగ్‌ చేసింది. ఈ ఫన్నీ వీడియోపై టైగర్‌ ష్రాప్‌, ప్రీతి జింటా సహా పలువురు ప్రముఖులు స్పందిచారు.


కాగా జెనీలియా-రితేష్‌ దేశ్‌ముఖ్‌ 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి రాయస్‌, రాహిల్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కెరీర్‌లో దూసుకుపోతున్న‌ స‌మ‌యంలో పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూరమైనా..సోషల్‌ మీడియాలో మాత్రం  క్రేజీ వీడియాలు చేస్తూ ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. 

చదవండి :జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్‌ నటుడు, పిక్స్‌ వైరల్‌ 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement