jealous
-
నటిని ముద్దుపెట్టుకున్నహీరో ...జెనీలియా ఎక్స్ప్రెషన్స్
-
నటి ప్రీతికి హీరో ముద్దులు..చిర్రెత్తిన భార్య ఏం చేసిందంటే..
ముంబై : భర్త తన ముందే వేరే మహిళతో క్లోజ్‌గా ఉంటే ఏ భార్యకైనా కోపం వస్తుంది. దీనికి సినిమా స్టార్స్ కూడా అతీతం కాదు. ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉన్నా, భర్త తన కళ్లముందే మరో నటితో సన్నిహితంగా ఉంటే ఈర్వ్స, చిరాకు, కోపం..ఇలా అన్నీ వస్తాయి. హీరోయిన్ జెనీలియాకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ అవార్డు ఫంక్షన్లో జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్..నటి ప్రీతి జింటాను కలిశారు. ఈ సందర్భంగా రితేష్..ప్రీతి చేతులకు ఫ్రెండ్లీగా ముద్దు పెట్టాడు. ఇది చూసి పక్కనే ఉన్న జెనీలియా చాలా అసౌకర్యానికి ఫీల్ అవుతుంటుంది. మీ సంభాషణ ఎప్పుడు ముగిస్తారురా బాబు..అన్నట్లు ఇద్దరినీ చాలా జలస్‌గా చూస్తుంటుంది. నిజానికి ఇది 2019లో ఐఫా అవార్డుల సందర్భంగా జరిగిన సన్నివేశం. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఈ వీడియో బయటికొచ్చొంది. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రితీష్- ప్రీతి జింటాలను చూసి జెనీలియా జలస్‌గా చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంటుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీనిపై పలు స్పూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన జెనీలియా..ఈ ఫంక్షన్ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అంటూ మరో వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఇంటికి రాగానే జెనీలియా..భర్త రితీష్‌ను కొడుతున్నట్లు ఫన్నీగా ఓ వీడియోను చేసింది. దీన్ని రితేష్- ప్రీతి జింటాలకు సైతం ట్యాగ్ చేసింది. ఈ ఫన్నీ వీడియోపై టైగర్ ష్రాప్, ప్రీతి జింటా సహా పలువురు ప్రముఖులు స్పందిచారు. కాగా జెనీలియా-రితేష్ దేశ్‌ముఖ్ 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కెరీర్లో దూసుకుపోతున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా..సోషల్ మీడియాలో మాత్రం క్రేజీ వీడియాలు చేస్తూ ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. చదవండి :జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు త్వరలో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ నటుడు, పిక్స్ వైరల్ -
‘ఆరేడుగురితో డేటింగ్.. ఇంకో లైఫ్ కావాలి’
సాక్షి, న్యూఢిల్లీ: ‘నేటి యువతరం యమ స్పీడు గురు!’ అని పెద్దలు అనుకోవడం పరిపాటి. వారు ఎవరి గురించి, ఎందుకు ఈ వ్యాఖ్య చేశారో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. వారు మాట్లాడుతున్నది సహస్రాబ్దుల గురించి. ముఖ్యంగా ‘దిల్వాలే దుల్హాహానియా లే జాయెంగే’ బాలీవుడ్ సినిమా విడుదలైన 1995 తర్వాత పుట్టిన వారి గురించి. ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరికొకరు అంటుకు తిరగడమే కాకుండా డేటింగ్‌లంటూ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం పట్ల చేస్తున్న వ్యాఖ్య. వారి వ్యాఖ్యలో ఆందోళనకంటే తమకూ అలాంటి అవకాశం లేకుండా పోయెనే అన్న అసూయనే ఎక్కువగా కనిపిస్తుంది. వాట్సప్, ఫేస్బుక్ లాంటి సామాజిక మీడియాలే కాకుండా డేటింగ్ యాప్‌గా ముద్రపడిన ‘టిండర్’ లాంటి యాప్‌లు యువతీ యువకులు కలిసి తిరగడానికి, సన్నిహితంగా మెలగడానికి పెళ్లికి ముందే లైంగిక అనుభవాలు చవి చూడడానికి దోహదపడుతున్నాయనడంలో సందేహం లేదు. ‘ఈ తరం వారిని చూసి నేను ఎంతో అసూయ పడుతున్నాను. నా జూనియర్ సహచరులు నెలకు ఆరేడుగురితో తిరుగుతున్నారు. నేను పెళ్లికి ముందు ఒక్కసారి కూడా ఎవరితో లైంగిక అనుభం లేదు’ అని ఓ బెంగుళూరులో పనిచేస్తున్న 40 ఏళ్ల ఐఐటీ గ్రాడ్యుయేట్ వాపోయారు. ‘సోషల్ మీడియా, మీటింగ్ యాప్‌లు లేని మా తరంలో ఆడ, మగ కలుసుకునేది చదువుకునే చోట, పనిచేసే చోట మాత్రమే. ఆడ, మగ కలుసుకునే అవకాశం తక్కువగా కూడా ఉండేది. 2000 సంవత్సరంలో మా ఆఫీసులో కలుసుకున్న వారు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం మాకే అశ్చర్యం కలిగించింది’ అని ‘ఎట్ మేక్ మై ట్రిప్’ సహ వ్యవస్థాపకులు సచిన్ భాటియా వ్యాఖ్యానించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొనే 2013లో తమ సంస్థ డేటింగ్ ప్లాట్‌ఫామ్ ‘ట్రూలీమ్యాడ్లీ’ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఒకప్పుడు తమ ఆఫీసులో పపిచేసే స్త్రీలు, పురుషులే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకునే వారని, ఇప్పుడు అలాంటి ఉదంతాలు బాగా తగ్గి పోయాయని, బయట ఇతరులను కలుసుకునే అవకాశం ఎక్కువగా ఉండడమే అందుకు కారణం కావచ్చని ఆయన అన్నారు. ‘నేటి తరానికి ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంది. సమాజంలో రిస్కులు తీసుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. కెరీర్ విషయంలో, రిలేషన్షిప్లో వారికంటూ ఓ క్లారిటీ ఉంది’ అని ఓ లాజిస్టిక్ సంస్థలో పనిచేస్తున్న 38 ఏళ్ల రాజేష్ చౌదరి అభిప్రాయపడ్డారు. ‘బెడ్రూమ్లో నా పర్సనాలిటీ గురించి నేను ఏదీ దాచకుండా నీకు చెబుతాను’ అని నాలుగంటే నాలుగు రోజుల క్రితమే పరిచయమైన ఓ 28 ఏళ్ల యువతి తనతో చెప్పడం తనకు ఎంతో ఆశ్చర్యం వేసిందని ఢిల్లీకి చెందిన రచయిత్రి అంకిత ఆనంద్ తెలిపారు. ‘మా తరంలో స్నేహానికే సమయం ఉండేది కాదు. కలుసుకునేందుకు కాఫీడేలు కూడా లేవు. ఈ తరాన్ని చూస్తే కొంత అసూయ వేస్తోంది’ అని 36 ఏళ్ల సౌమ్యా బైజాల్ అన్నారు. ఈ తరం సంబంధాలను చూసి అసూయ పడుతున్న ఓ సీనియర్ జర్నలిస్ట్ ‘నాకు ఇంకో జీవితం ఉంటే బాగుండు’ అని వ్యాఖ్యానించగా, ఆయన పక్కనే ఉన్న ఈ తరానికి చెందిన ఆయన కుమారుడు ‘తరం తరానికి తేడా ఎప్పుడూ ఉంటుంది. నా భవిష్యత్ తరాన్ని చూసి నేను కూడా అసూయ పడే రోజు వస్తుంది. అది తప్పదు!’ అని వ్యాఖ్యానించడం సబబే కావచ్చు. -
మగ బిడ్డ లేదని మరదలి బిడ్డను చంపబోయింది
-
ప్రియ తనయుడు
* నా బిడ్డగా పుట్టడం పుణ్యఫలం * తనయుడికి తండ్రి కితాబు * నిరాడంబర జీవితం సాగిస్తున్నారన్న స్టాలిన్ * పరస్పరం పొగడ్తల పన్నీరు * ఒకరి కోసం మరొకరి ఓట్ల వేట సాక్షి, చెన్నై: తండ్రి కోసం తనయుడు, తనయుడి కోసం తండ్రి ఓట్ల వేటలో పడ్డారు. స్టాలిన్ తనకు ప్రియ పుత్రుడని, అతడు బిడ్డగా పుట్టడం పుణ్యఫలమని డీఎంకే అధినేత కరుణానిధి వ్యాఖ్యానించారు. ఉన్న ఇంటిని కూడా ఆసుపత్రికి ఇచ్చేసి కరుణానిధి నిరాడంబర జీవితాన్ని సాగిస్తున్నారని డీఎంకే దళపతి స్టాలిన్ ప్రశంసించారు. తిరువారూర్ ఎన్నికల బరిలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధి, చెన్నై కొళత్తూరు రేసులో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ పోటీ చేస్తున్నారు. తండ్రి కోసం తనయుడు, తనయుడి కోసం తండ్రి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పర్యటన సాగిస్తున్న ఎంకే స్టాలిన్ సోమవారం కరుణానిధి పోటీ చేస్తున్న తిరువారూర్‌లో పర్యటించారు. అక్కడి ప్రచార సభలో స్టాలిన్ మాట్లాడుతూ తన తండ్రి, పార్టీ అధినేత కరుణానిధి ఇక్కడి వారే అని గుర్తు చేశారు. తిరువారూర్‌తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసి, ఉన్న ఇంటిని కూడా ఆసుపత్రికి ఇచ్చిన ఘనత కరుణానిధికే దక్కుతుందని వ్యాఖ్యానించారు. కుటుంబం నుంచి తన తర్వాత ఎవరూ వారసత్వ రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు. ప్రియ పుత్రుడు: స్టాలిన్ కొళత్తూరు నుంచి పోటీ చేస్తున్నారని, ఆయన తరఫున డీఎంకే అధినేత కరుణానిధి ప్రజల్ని ఉద్ధేశించి ప్రసంగించారు. స్టాలిన్ పార్టీ కోసం తనను అర్పించుకున్నాడని, రేయింబవళ్లు శ్రమిస్తున్నాడని పేర్కొన్నారు. స్టాలిన్‌ను చూస్తుంటే కొన్ని సమయాల్లో తనకు ఈర్ష్య కలుగుతోందని వ్యాఖ్యానించారు. తాను చిన్నతనం నుంచే పార్టీ కోసం శ్రమిస్తున్నానని, తాను పడ్డ శ్రమలో వంద రేట్లు ఎక్కువగా స్టాలిన్ పడుతున్నాడని పేర్కొన్నారు. స్టాలిన్ తనకు ప్రియ పుత్రుడని, అతడు కొడుకుగా పుట్టడం పుణ్యఫలమని వ్యాఖ్యానించారు. అందరూ స్టాలిన్‌ను ఆదరించాలని విన్నవించుకున్నారు. -
నేనంటే మా క్రికెటర్లకు అసూయ
మెల్బోర్న్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మరోసారి తన సహచర క్రికెటర్లపై విమర్శలు ఎక్కుపెట్టాడు. తమ జట్టులోని ఆటగాళ్లకు తానంటే అసూయపడేవారని పీటర్సన్ అన్నాడు. సహచర ఆటగాళ్ల వల్ల తాను బలయ్యానని ఆరోపించాడు. ఏడాది క్రితం వివాదాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పీటర్సన్.. సందర్భం వచ్చినప్పుడల్లా తన సహచరులపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. కెవిన్ తన ఆత్మకథలో పలు విషయాలను ప్రస్తావించాడు. తన కెరీర్లో జరిగిన పలు సంఘటనల గురించి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్ ఆరంభానికి ముందు ఓ ఇంటర్వ్యూలో కెవిన్ మాట్లాడుతూ.. ఇక్కడ అసూయ పడే ఆటగాళ్లు ఎవరూ లేరని అన్నాడు. అదే ఇంగ్లండ్‌లో అయితే అసూయ పడేవాళ్లకు కొదవేలేదని చెప్పాడు.