Kissing scene
-
ముద్దు వీడియోపై నటి ప్రీతి జింటా రియాక్షన్
ముంబై : ఓ అవార్డు ఫంక్షన్లో నటి ప్రీతి జింటాను హీరో రితేష్ దేశ్‌ముఖ్ ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన భర్త రితేష్..తన కళ్ల ముందే నటి ప్రీతి జింటా చేతులకు ముద్దు పెట్టుకోవడంతో తెగ ఫీల్ అవుతుంటుంది. రితీష్- ప్రీతి జింటాలను చూసి జెనీలియా జలస్‌గా చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంటుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై జెనీలియా ఇటీవలె మరో వీడియోను రిలీజ్ చేసింది. ఆ ఫంక్షన్ అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటూ రితేష్‌ను చితకబాదుతూ ఓ ఫన్నీ వీడియోను రూపొందించింది. దీనిపై నటి ప్రీతి జింటా స్పందించారు. 'చాలా ఫన్నీగా ఉంది..రితేష్- జెనీలియా మీరు ఇలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు తీయండి. లవ్ యూ బోత్' అంటూ కామెంట్ చేసింది. ఇక జెనీలియా- రితేష్‌ల వీడియోపై నటులు టైగర్ ష్రాఫ్, మాధురి దీక్షిత్, సంజయ్ కపూర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) సామాన్యులకూనా, సెలబ్రిటీలకైనా తన ముందే భర్త మరో మహిళతో క్లోజ్‌గా ఉంటే తట్టుకోలేరు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్లోనే ఎలాంటి కంట్రవర్సీలు లేకుండా హ్యాపీగా సాగిపోతున్న జంటల్లో రితేష్- జెనీలియా ముందు వరుసలో ఉంటారు. ఓ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీరు 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పటికప్పుడు క్రేజీ వీడియోలతో ఆకట్టుకునే ఈ జంటకు బాలీవుడ్లో మోస్ట్ లవబుల్ కపుల్స్‌గా పేరుంది. చదవండి : వైరల్ : నటిని ముద్దుపెట్టుకున్న బాలీవుడ్ హీరో హీరో కార్తీక్‌కు కరోనా..టెన్షన్లో కియారా అద్వానీ -
నటిని ముద్దుపెట్టుకున్నహీరో ...జెనీలియా ఎక్స్ప్రెషన్స్
-
నటి ప్రీతికి హీరో ముద్దులు..చిర్రెత్తిన భార్య ఏం చేసిందంటే..
ముంబై : భర్త తన ముందే వేరే మహిళతో క్లోజ్‌గా ఉంటే ఏ భార్యకైనా కోపం వస్తుంది. దీనికి సినిమా స్టార్స్ కూడా అతీతం కాదు. ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉన్నా, భర్త తన కళ్లముందే మరో నటితో సన్నిహితంగా ఉంటే ఈర్వ్స, చిరాకు, కోపం..ఇలా అన్నీ వస్తాయి. హీరోయిన్ జెనీలియాకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ అవార్డు ఫంక్షన్లో జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్..నటి ప్రీతి జింటాను కలిశారు. ఈ సందర్భంగా రితేష్..ప్రీతి చేతులకు ఫ్రెండ్లీగా ముద్దు పెట్టాడు. ఇది చూసి పక్కనే ఉన్న జెనీలియా చాలా అసౌకర్యానికి ఫీల్ అవుతుంటుంది. మీ సంభాషణ ఎప్పుడు ముగిస్తారురా బాబు..అన్నట్లు ఇద్దరినీ చాలా జలస్‌గా చూస్తుంటుంది. నిజానికి ఇది 2019లో ఐఫా అవార్డుల సందర్భంగా జరిగిన సన్నివేశం. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఈ వీడియో బయటికొచ్చొంది. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రితీష్- ప్రీతి జింటాలను చూసి జెనీలియా జలస్‌గా చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ వీడియోలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంటుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీనిపై పలు స్పూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన జెనీలియా..ఈ ఫంక్షన్ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అంటూ మరో వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఇంటికి రాగానే జెనీలియా..భర్త రితీష్‌ను కొడుతున్నట్లు ఫన్నీగా ఓ వీడియోను చేసింది. దీన్ని రితేష్- ప్రీతి జింటాలకు సైతం ట్యాగ్ చేసింది. ఈ ఫన్నీ వీడియోపై టైగర్ ష్రాప్, ప్రీతి జింటా సహా పలువురు ప్రముఖులు స్పందిచారు. కాగా జెనీలియా-రితేష్ దేశ్‌ముఖ్ 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కెరీర్లో దూసుకుపోతున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా..సోషల్ మీడియాలో మాత్రం క్రేజీ వీడియాలు చేస్తూ ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. చదవండి :జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు త్వరలో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ నటుడు, పిక్స్ వైరల్ -
కిస్సింగ్ సీన్లపై కస్సుమన్న హీరో
ముంబై: బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ షాహిద్ కపూర్ జర్నలిస్ట్‌పై మండిపడ్డాడు. లిప్ లాక్‌లపై ప్రశ్నించిన విలేకరిని తిట్టిపోశాడు. ‘అర్జున్ రెడ్డి’ ఆధారంగా హిందీలో తెరకెక్కిన ‘కబీర్ సింగ్’ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. సినిమాలో ఎన్ని ముద్దు సన్నివేశాలు ఉన్నాయని హీరోయిన్ కియారా అద్వానీని ఈ సందర్భంగా రిపోర్టర్ ఒకరు ప్రశ్నించగా.. లెక్కపెట్టుకోలేదని ఆమె సమాధానం ఇచ్చారు. కియారా జవాబుతో సంతృప్తి చెందని సదరు జర్నలిస్ట్ పదేపదే ఇదే ప్రశ్న సంధించాడు. దీంతో సహనం కోల్పోయిన షాహిద్ కపూర్ అతడిపై మండిపడ్డాడు. ‘చూస్తుంటే నీకు గాల్‌ఫ్రెండ్ లేనట్టుంది. మా సినిమాలో లిప్‌లాక్ సీన్ చూడాలనుకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించాల్సిందే. అయితే ఈ సీన్ ఒక్కదాని కోసమే డబ్బు చెల్లించాలని నేను చెప్పడం లేదు. ముద్దు సన్నివేశాల కోసం మాత్రమే ఎందుకు మమ్మల్ని ప్రశ్నిస్తున్నార’ని షాహిద్ క్లాస్ పీకాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన కబీర్ సింగ్ సినిమా జూన్ 21న విడుదల కానుంది. ప్రేమలో విఫలమైన వైద్యుడి పాత్రలో షాహిద్ కపూర్ కనిపించనున్నాడు. తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’లో విజయ్ దేవరకొండ, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో విజయ్ స్టార్డమ్ సంపాదించుకున్నాడు. -
ఆ ముద్దూ ముచ్చటా తొమ్మిది సెకన్లే!
ఇప్పటివరకూ తెలుగులో సుదీర్ఘ పెదవి ముద్దు సన్నివేశంలో నటించని కాజల్ అగర్వాల్ తొలిసారి హిందీ చిత్రం ‘దో లఫ్జోంజీ కీ కహాని’లో నటించారు. రణదీప్ హుడా, కాజల్ అగర్వాల్ జంటగా దీపక్ తిజోరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని ముద్దు సీన్ ఇప్పటికే హాట్ టాపిక్ అయ్యింది. మొత్తం 18 సెకన్లు సాగే ఈ సీన్ నిడివి తగ్గించమని సెన్సార్ బోర్డ్ సూచించిందట. నిడివి 75 శాతం తగ్గించమని ఆజ్ఞాపించడంతో దర్శకుడు డైలమాలో పడ్డారట. సినిమాకి కీలకంగా నిలిచే దృశ్యం కావడంతో తగ్గిస్తే బాగుండదని భావించిన దీపక్ తిజోరి సెన్సార్ సభ్యులను 75 శాతం కాదు కానీ, ఓ 50 శాతం తగ్గిస్తానని బతిమాలుకుంటే, సరే అన్నారట. ఆ తర్వాత తొమ్మిది సెకన్లకు ఈ సీన్‌ని కుదించారు. కిస్ సీన్ తగ్గించినందుకు బాధ లేదు కానీ, కొన్ని పదాలను తొలగించమనడం దీపక్కి మింగుపడటంలేదట. ఆ విషయం గురించి ఆయన మాట్లాడుతూ - ‘‘సాలే, కుత్తె లాంటి పదాలను తీసేయమన్నారు. ఇవాళ ఈ పదాలు వాడని పిల్లలూ, పెద్దలూ లేరు. ముఖ్యంగా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక పిల్లలకు అన్నీ తెలుస్తున్నాయ్. ఈ పదాలు కూడా కామన్ అయ్యాయి. ఇలా వాడుక పదాలను తీయమనడం ఆశ్చర్యం అనిపించింది. ఫిలిం మేకర్స్‌ని సెన్సార్ బోర్డ్ టార్చర్ పెడుతోంది’’ అని ఆవేశంగా అన్నారు. నేడు ఈ చిత్రం తెరపైకొస్తోంది. -
ఆ సీన్ అప్పుడు గుండె రాయి చేసుకున్నా!
బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కాజల్ తెగ ఆరాటపడుతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ టాప్ హీరోయిన్గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా 'దో లఫ్జోన్ కీ కహానీ' చిత్రంతో బాలీవుడ్లో మరో ప్రయత్నం చేస్తోంది. దీపక్ త్రిజోరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కాజల్, రణ్‌దీప్ హుడా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఘాటైన లిప్‌లాక్ సీన్ ఉంది. దీని పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. కాజల్, రణ్‌దీప్ పెదవులతో పెదవులు పెనవేసుకున్న ఈ పోస్టర్‌తో ఇప్పుడు బాలీవుడ్లో చర్చంతా ఈ లిప్‌లాక్ దృశ్యంపైనే నడుస్తోంది. ఈ లిప్‌లాక్ సీన్ గురించి కాజల్‌కు ముందస్తుగా చెప్పలేదని, దీని గురించి అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాజల్ స్పందిస్తూ.. ఆ కిస్సింగ్ సీన్ చేసేటప్పుడు గుండె రాయిగా చేసుకున్నాను. దీనిని ఓ పెద్ద విషయంగా ప్రచారం చేయడం సరికాదు అని పేర్కొంది. 'నేను రాయిగా మారిపోయాను. కానీ రణ్‌దీప్ నేను ఇబ్బందిపడకుండా ఈ సీన్ సులభంగా తీసేలా సహకరించాడు. నేను ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అతను చూశాడు. మేం చాలా మాట్లాడుకున్నాం. దీంతో నా భయాలు తొలిగిపోయాయి' అని కాజల్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపింది. 'నాకు కొన్ని భయాలు ఉన్నాయి. నేను దక్షిణాదిలో అలాంటి సీన్లు ఎప్పుడూ చేయలేదు. కానీ ఈ సీన్ సినిమా స్క్రిప్ట్‌లో భాగం కావడంతో దీని ప్రాముఖ్యాన్ని నేను అర్థం చేసుకున్నాను. కానీ దీని గురించి ఇన్ని ఊహాగానాలు ఎందుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. మేం ప్రొఫెషనల్ నటులం. అన్ని ముందస్తుగా చర్చించుకొని నిర్ణయించుకున్న మీదటే తెరపై నటిస్తాం' అని కాజల్ స్పష్టం చేసింది. ఇది చాలా సెన్సిటీవ్ ప్రేమకథ అని, ఇందులో శృంగార, ప్రణయ దృశ్యాలు ఉన్నా.. అవి నెగ్లిజబుల్ స్థాయిలోనే ఉంటాయని తెలిపింది. గతంలో 'సింగం', 'స్పెషల్ ఛబ్బీస్' సినిమాల్లో నటించిన కాజల్ తన మూడో ప్రయత్నంగా 'దో లఫ్జోన్ కీ కహానీ'తో జూన్ 10న బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళుతోంది. 2011లో వచ్చిన కొరియన్ మూవీ 'ఆల్వేస్' ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. -
ముద్దు వద్దని నేనెప్పుడు అన్నా?
పెళ్లయిన తర్వాత ఇక తాను లిప్‌లాక్ సీన్లలో నటించేది లేదని ఎప్పుడు చెప్పానంటూ కరీనా కపూర్ ఆశ్చర్యపోతోంది. తాజాగా 'కి అండ్ క' సినిమాలో అర్జున్ కపూర్‌తో ఆమె పెదాలు కలిపిన పోస్టర్లు హల్చల్ చేస్తున్నాయి. దీంతో కరీనా తన 'నో ముద్దు' వ్రతాన్ని వదిలిపెట్టిందంటూ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీనిపై కరీనాను ప్రశ్నించగా.. తాను అసలు అలాంటి పాలసీ పెట్టుకున్నట్లుగా ఎక్కడి నుంచి వినిపించిందో మాత్రం తనకు తెలియదని స్పష్టం చేసింది. అసలు ఆన్‌స్క్రీన్ ముద్దు గురించి ఎందుకింత చర్చ, రచ్చ జరుగుతున్నాయో తనకు అర్థం కావట్లేదని సినిమా దర్శకుడు ఆర్.బాల్కి అన్నారు. ఈ సినిమాలో అర్జున్ కపూర్ ఇంట్లో ఉండే భర్తగా నటిస్తుండగా, కరీనా కపూర్ మాత్రం ఉద్యోగం చేసే మహిళగా చేస్తోంది. సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు.. ఆ కిస్సింగ్ సీన్‌ను మరోసారి చేయాలంటూ కరీనా, అర్జున్‌లను కోరారు. దాంతో కరీనా కాస్త చిరుకోపంతో బాల్కి వైపు చూసి.. 'మీరు నాకు విడాకులు ఇప్పించేలా ఉన్నారే' అంటూ వ్యాఖ్యానించింది. అలా చేస్తే ఇక తనకు పటౌడీల ఇంట్లోకి ప్రవేశం ఉండదని అర్జున్ అన్నాడు. అర్జున్ మంచి కిస్సర్ అని కితాబిచ్చిన కరీనా.. అతడి బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టి వదిలేసింది. -
ఆ ముద్దు సన్నివేశాలకు 36 టేక్‌లు నిజమే
జీవీ.ప్రకాష్ కుమార్ నటి మనీషా యాదవ్ ముద్దు సన్నివేశాలను 36 టేక్‌లో చిత్రీకరించినట్లు ప్రచారం మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం విధితమే. అయితే అందులో నిజమెంత అనే చర్చకు కూడా ఆస్కారం లేక పోలేదు. ఇక వివరాల్లోకెళితే.. జీవీ.ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం త్రిష ఇల్లన్న నయనతార. క్యామియో ఫిలింస్ పతాకంపై సిజె.జయకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని ఆధిక్ రవిచంద్రన్ నిర్వహిస్తున్నారు. ఆనంది, మనీషా యాదవ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వ బాధ్యతల్ని తన భుజస్కంధాలపైనే వేసుకున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం నగరంలోని సత్యం థియేటర్లలో నిర్వహించారు. కార్యక్రమ వ్యాఖ్యాత ముద్దు సన్నివేశంలో 36 టేక్స్ విషయం గురించి జీవీ.ప్రకాష్‌కుమార్‌ను వివరణ నివ్వవలసిందిగా కోరగా తనకు తెలిసి నాలుగైదు టేక్సే తీసినట్లు అన్నారు. అయినా ఆ విషయం గురించి దర్శకుడుని అడగంటూ తప్పిచుకున్నారు. అయితే త్రిష ఇల్లన్నా నయనతార ఒక అకేషన్ లాంటి చిత్రం అన్నారు. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇందులో మూడు పాటలు తనను బాగా ఆకట్టుకున్నాయని చెప్పారు. దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ మాట్లాడితే ఈ చిత్రంలో జీవీ.ప్రకాష్ కుమార్ మనీషా యాదవ్ ముద్దు సన్నివేశానికి 36 టేక్స్ చేసిన సంగతి నిజమేనన్నారు. ఇంకో టేక్ కూడా చేద్దామనుకున్నామనీ సెట్లో తన తండ్రి ఉండడంతో 36 టేక్స్తోనే సరి పెట్టినట్లు తెలిపారు. నిజానికి ఆ సన్నివేవానికి వివిధ యాంగిల్స్ అవసరమయ్యాయని వివరించారు. చిత్ర ఆడియోను దర్శకుడు ఎఆర్.మురుగదాస్ ఆవిష్కరించగా చిత్ర దర్శకుడి తండ్రి రవిచంద్రన్ తదితర చిత్ర ప్రముఖులు అందుకున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గీన్ కేఇ.జ్ఞానవేల్ రాజా విడుదల చేయనున్నారు.