ఆ ముద్దూ ముచ్చటా తొమ్మిది సెకన్లే! | Censor Board cuts Randeep Hooda-Kajal Aggarwal's kissing scene by half | Sakshi
Sakshi News home page

ఆ ముద్దూ ముచ్చటా తొమ్మిది సెకన్లే!

Published Thu, Jun 9 2016 10:50 PM | Last Updated on Fri, Sep 28 2018 7:57 PM

ఆ ముద్దూ ముచ్చటా తొమ్మిది సెకన్లే! - Sakshi

ఆ ముద్దూ ముచ్చటా తొమ్మిది సెకన్లే!

 ఇప్పటివరకూ తెలుగులో సుదీర్ఘ పెదవి ముద్దు సన్నివేశంలో నటించని కాజల్ అగర్వాల్ తొలిసారి హిందీ చిత్రం ‘దో లఫ్జోంజీ కీ కహాని’లో నటించారు. రణదీప్ హుడా, కాజల్ అగర్వాల్ జంటగా దీపక్ తిజోరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని ముద్దు సీన్ ఇప్పటికే హాట్ టాపిక్ అయ్యింది. మొత్తం 18 సెకన్లు సాగే ఈ సీన్ నిడివి తగ్గించమని సెన్సార్ బోర్డ్ సూచించిందట. నిడివి 75 శాతం తగ్గించమని ఆజ్ఞాపించడంతో దర్శకుడు డైలమాలో పడ్డారట. సినిమాకి కీలకంగా నిలిచే  దృశ్యం కావడంతో తగ్గిస్తే బాగుండదని భావించిన దీపక్ తిజోరి సెన్సార్ సభ్యులను 75 శాతం కాదు కానీ, ఓ 50 శాతం తగ్గిస్తానని బతిమాలుకుంటే, సరే అన్నారట.

ఆ తర్వాత తొమ్మిది సెకన్లకు ఈ సీన్‌ని కుదించారు. కిస్ సీన్ తగ్గించినందుకు బాధ లేదు కానీ, కొన్ని పదాలను తొలగించమనడం దీపక్‌కి మింగుపడటంలేదట. ఆ విషయం గురించి ఆయన మాట్లాడుతూ - ‘‘సాలే, కుత్తె లాంటి పదాలను తీసేయమన్నారు. ఇవాళ ఈ పదాలు వాడని పిల్లలూ, పెద్దలూ లేరు. ముఖ్యంగా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక పిల్లలకు అన్నీ తెలుస్తున్నాయ్. ఈ పదాలు కూడా కామన్ అయ్యాయి. ఇలా వాడుక పదాలను తీయమనడం ఆశ్చర్యం అనిపించింది. ఫిలిం మేకర్స్‌ని సెన్సార్ బోర్డ్ టార్చర్ పెడుతోంది’’ అని ఆవేశంగా అన్నారు. నేడు ఈ చిత్రం తెరపైకొస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement