గాయం.. ఓ జ్ఞాపకం | Kajal Aggarwal Bellamkonda Srinivas and Neil Nitin Mukesh | Sakshi
Sakshi News home page

గాయం.. ఓ జ్ఞాపకం

Published Tue, Aug 14 2018 12:56 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

Kajal Aggarwal Bellamkonda Srinivas and Neil Nitin Mukesh - Sakshi

దెబ్బలు తగిలితే ఎవరైనా బాధపడతారు. కానీ ఇక్కడున్న ఫొటో చూశారుగా. హీరో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ ఎలా నవ్వుతున్నారో. ఇందుకు ఓ కారణం ఉంది. ఈ ముగ్గురూ సినిమాలో భాగంగా ఓ యాక్షన్‌ షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేసిన తర్వాత ఇలా నవ్వుతూ ఫొటోకు ఫోజు ఇచ్చారు. ఉత్తుత్తి గాయాలే అయినప్పటికీ యాక్షన్‌ సీన్‌ అంటే కష్టమే కదా... అందుకే ఇలా రిలాక్స్‌ అయ్యారు.

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా శ్రీనివాస్‌ దర్శకత్వంలో నవీన్‌ ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ముగిసింది. ‘‘ఇప్పుడే ఫైట్‌ కంప్లీట్‌ చేశాం. నా షూటింగ్‌ పూర్తయింది. నేను తెలుగులో నటించిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. చిత్రబృందం సహకారం మరచిపోలేనిది’’ అని పేర్కొన్నారు నీల్‌. అంటే ఈ సినిమా గాయాలు ఆయనకు ఓ మధుర జ్ఞాపకం అన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement