బెల్లంకొండ శ్రీనివాస్
అన్యాయాన్ని ఎదురించడానికి ఖాకీ యూనిఫామ్ వేసుకొని సిద్ధమయ్యారు బెల్లంకొండ శ్రీనివాస్. మరి ఆ ప్రయాణంలో ఏ జరిగిందో తెలియాలంటే ‘కవచం’ చిత్రం విడుదల వరకూ ఆగాల్సిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహరీన్ ముఖ్య పాత్రల్లో నూతన దర్శకుడు శ్రీనివాస మామిళ్ల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కవచం’.
వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంటినేని నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటిస్తున్నారు. ‘‘మా సినిమా ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, డిసెంబర్‌లో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ఛోటా కె.నాయుడు.
∙సాయి శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment