బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహరీన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘కవచం’ . ఈ సినిమాతో శ్రీనివాస మామిళ్ల దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంటినేని నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘భయపెట్టే వాడికి భయపడే వాడికి మధ్య కవచంలా ఒకడు ఉంటాడురా.. వాడే పోలీస్’ , ‘పోలీసోడితో ఆడాలంటే బుల్లెట్ కంటే బ్రెయిన్ ఫాస్ట్‌గా ఉండాలి’ అంటూ శ్రీనివాస్ చెప్పిన డైలాగ్స్ వింటుంటే కవచం ఫుల్ టూ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా వరుసగా మాస్ ఎంటర్‌టెయిన్‌లతో అలరిస్తున్న శ్రీనివాస్ ఈ సినిమాలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment