ఆ సీన్‌ అప్పుడు గుండె రాయి చేసుకున్నా! | Was petrified of kissing scene in Do Lafzon Ki Kahani, says Kajal Aggarwal | Sakshi
Sakshi News home page

ఆ సీన్‌ అప్పుడు గుండె రాయి చేసుకున్నా!

May 30 2016 4:10 PM | Updated on Sep 28 2018 7:57 PM

ఆ సీన్‌ అప్పుడు గుండె రాయి చేసుకున్నా! - Sakshi

ఆ సీన్‌ అప్పుడు గుండె రాయి చేసుకున్నా!

బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కాజల్‌ తెగ ఆరాటపడుతోంది.

బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కాజల్‌ తెగ ఆరాటపడుతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ టాప్‌ హీరోయిన్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా 'దో లఫ్జోన్‌ కీ కహానీ' చిత్రంతో బాలీవుడ్‌లో మరో ప్రయత్నం చేస్తోంది. దీపక్ త్రిజోరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కాజల్‌, రణ్‌దీప్ హుడా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఘాటైన లిప్‌లాక్‌ సీన్‌ ఉంది. దీని పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. కాజల్‌, రణ్‌దీప్‌ పెదవులతో పెదవులు పెనవేసుకున్న ఈ పోస్టర్‌తో ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చంతా ఈ లిప్‌లాక్‌ దృశ్యంపైనే నడుస్తోంది. ఈ లిప్‌లాక్‌ సీన్‌ గురించి కాజల్‌కు ముందస్తుగా చెప్పలేదని, దీని గురించి అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో కాజల్‌ స్పందిస్తూ.. ఆ కిస్సింగ్ సీన్‌ చేసేటప్పుడు గుండె రాయిగా చేసుకున్నాను. దీనిని ఓ పెద్ద విషయంగా ప్రచారం చేయడం సరికాదు అని పేర్కొంది. 'నేను రాయిగా మారిపోయాను. కానీ రణ్‌దీప్‌ నేను ఇబ్బందిపడకుండా ఈ సీన్‌ సులభంగా తీసేలా సహకరించాడు. నేను ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అతను చూశాడు. మేం చాలా మాట్లాడుకున్నాం. దీంతో నా భయాలు తొలిగిపోయాయి' అని కాజల్‌ పీటీఐ వార్తాసంస్థకు తెలిపింది.

'నాకు కొన్ని భయాలు ఉన్నాయి. నేను దక్షిణాదిలో అలాంటి సీన్లు ఎప్పుడూ చేయలేదు. కానీ ఈ సీన్‌ సినిమా స్క్రిప్ట్‌లో భాగం కావడంతో దీని ప్రాముఖ్యాన్ని నేను అర్థం చేసుకున్నాను. కానీ దీని గురించి ఇన్ని ఊహాగానాలు ఎందుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. మేం ప్రొఫెషనల్‌ నటులం. అన్ని ముందస్తుగా చర్చించుకొని నిర్ణయించుకున్న మీదటే తెరపై నటిస్తాం' అని కాజల్ స్పష్టం చేసింది. ఇది చాలా సెన్సిటీవ్‌ ప్రేమకథ అని, ఇందులో శృంగార, ప్రణయ దృశ్యాలు ఉన్నా.. అవి నెగ్లిజబుల్ స్థాయిలోనే ఉంటాయని తెలిపింది. గతంలో 'సింగం', 'స్పెషల్ ఛబ్బీస్‌' సినిమాల్లో నటించిన కాజల్‌ తన మూడో ప్రయత్నంగా 'దో లఫ్జోన్‌ కీ కహానీ'తో జూన్ 10న బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వెళుతోంది. 2011లో వచ్చిన కొరియన్ మూవీ 'ఆల్వేస్‌' ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement