ముద్దు వద్దని నేనెప్పుడు అన్నా? | Donot know where no-kissing story came from, says Kareena | Sakshi
Sakshi News home page

ముద్దు వద్దని నేనెప్పుడు అన్నా?

Published Tue, Feb 16 2016 7:30 AM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM

ముద్దు వద్దని నేనెప్పుడు అన్నా?

ముద్దు వద్దని నేనెప్పుడు అన్నా?

పెళ్లయిన తర్వాత ఇక తాను లిప్‌లాక్ సీన్లలో నటించేది లేదని ఎప్పుడు చెప్పానంటూ కరీనా కపూర్ ఆశ్చర్యపోతోంది. తాజాగా 'కి అండ్ క' సినిమాలో అర్జున్ కపూర్‌తో ఆమె పెదాలు కలిపిన పోస్టర్లు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో కరీనా తన 'నో ముద్దు' వ్రతాన్ని వదిలిపెట్టిందంటూ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీనిపై కరీనాను ప్రశ్నించగా.. తాను అసలు అలాంటి పాలసీ పెట్టుకున్నట్లుగా ఎక్కడి నుంచి వినిపించిందో మాత్రం తనకు తెలియదని స్పష్టం చేసింది. అసలు ఆన్‌స్క్రీన్ ముద్దు గురించి ఎందుకింత చర్చ, రచ్చ జరుగుతున్నాయో తనకు అర్థం కావట్లేదని సినిమా దర్శకుడు ఆర్.బాల్కి అన్నారు.

ఈ సినిమాలో అర్జున్ కపూర్ ఇంట్లో ఉండే భర్తగా నటిస్తుండగా, కరీనా కపూర్ మాత్రం ఉద్యోగం చేసే మహిళగా చేస్తోంది. సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు.. ఆ కిస్సింగ్ సీన్‌ను మరోసారి చేయాలంటూ కరీనా, అర్జున్‌లను కోరారు. దాంతో కరీనా కాస్త చిరుకోపంతో బాల్కి వైపు చూసి.. 'మీరు నాకు విడాకులు ఇప్పించేలా ఉన్నారే' అంటూ వ్యాఖ్యానించింది. అలా చేస్తే ఇక తనకు పటౌడీల ఇంట్లోకి ప్రవేశం ఉండదని అర్జున్ అన్నాడు. అర్జున్ మంచి కిస్సర్ అని కితాబిచ్చిన కరీనా.. అతడి బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టి వదిలేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement