'అప్పుడు టెన్త్ క్లాస్.. ఇప్పుడు ఆమెతోనే రొమాన్స్' | I was a student when Kareena made her debut, says Arjun Kapoor | Sakshi
Sakshi News home page

'అప్పుడు టెన్త్ క్లాస్.. ఇప్పుడు ఆమెతోనే రొమాన్స్'

Published Fri, Mar 11 2016 5:53 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'అప్పుడు టెన్త్ క్లాస్.. ఇప్పుడు ఆమెతోనే రొమాన్స్' - Sakshi

'అప్పుడు టెన్త్ క్లాస్.. ఇప్పుడు ఆమెతోనే రొమాన్స్'

ముంబై: తన లేటెస్ట్ మూవీలో హీరోయిన్ కరీనా కపూర్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ సహజంగా రావడానికి కారణాలను బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ చెప్పాడు. కరీనాతో తనకు మంచి స్నేహం ఉందని, తామిద్దరం మంచి స్నేహితులం అయ్యామని అర్జున్ అంటున్నాడు. బాల్కీ దర్శకత్వంలో వస్తున్న తమ లేటెస్ట్ మూవీ 'కీ అండ్ కా'లో కరీనాతో రొమాన్స్ చేస్తున్నాను, కానీ ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయినప్పుడు తనకు పదిహేనేళ్లు అని అర్జున్ తెలిపాడు. తాను టెన్త్ క్లాస్ చదువుతుండగానే, కరీనా 2000లో 'రెఫ్యూజీ'తో బాలీవుడ్ కి పరిచయం అయిందన్నాడు. ఆమెతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, కరీనా అద్బుతమైన నటి అంటూ పొగిడేశాడు.

ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు విద్యార్థిగా ఉన్న తాను ఇప్పుడు ఆమెతోనే కలిసి నటించడం చాలా బాగుందన్నాడు. 'సినిమాల్లోకి రాకముందు ఆమెను చాలాసార్లు కలిశాను. ఆమె అప్పుడు ఎలా ఉందో, ప్రస్తుతం అలాగే ఉంది' అని ఈ హీరో చెప్పుకొచ్చాడు.
తాజాగా వినూత్న కథతో తెరకెక్కుతున్న చిత్రం 'కీ అండ్ కా'. ఇందులో అర్జున్ కపూర్‌ హౌస్ హస్బెండ్ గా నటిస్తున్నాడు. ఇందులో ఉద్యోగినిగా హీరోయిన్ కరీనా కపూర్ కనిపించనుంది. ఏప్రిల్ 1న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement