ఆడవాళ్ల చెప్పులతో హీరో స్టెప్పులు.. | High Heels from Arjun Kapoor and Kareena Kapoor upcoming rom-com film Ki and Ka | Sakshi
Sakshi News home page

ఆడవాళ్ల చెప్పులేసుకుని హీరో స్టెప్పులు..

Published Sun, Feb 21 2016 4:40 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఆడవాళ్ల చెప్పులతో హీరో స్టెప్పులు.. - Sakshi

ఆడవాళ్ల చెప్పులతో హీరో స్టెప్పులు..

ముంబై : బాలీవుడ్ నటీనటులు తమ సినిమా ప్రమోషన్ల కోసం ఎదో ఒక వింత ప్రయోగాలు చేస్తుండటం కామన్ అయిపోయింది. ప్రమోషన్స్ లో భాగంగా గతంలో వచ్చిన డాన్స్ పే చాన్స్ మూవీ కోసం షాహిత్ కపూర్, జెనీలియా ఓ రాత్రి కారులో గడపటం అంటూ హంగామా చేశారు. 2010లో ఇది ఓ సెన్సెషన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తమ మూవీ ప్రమోషన్ కోసం తారలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వినూత్న కథతో తెరకెక్కుతున్న చిత్రం 'కీ అండ్ కా'. ఇందులో అర్జున్ కపూర్‌ హౌస్ హస్బెండ్ గా నటిస్తున్నాడు. ఇందులో ఉద్యోగినిగా హీరోయిన్ కరీనా కపూర్ కనిపించనుంది.

ఇటీవల జరిగన మూవీ ప్రమోషన్లో భాగంగా అర్జున్ కపూర్ ఆడవాళ్లు ధరించే చెప్పులు వేసుకుని హంగామా చేశాడు. హై హీల్స్ చెప్పులు వేసుకుని కరీనాతో కలిసి స్టెప్పులేశాడు. మూవీలోనూ ఈ సాంగ్ ఉందని ప్రచారం చేస్తూ మరింతగా అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తోంది ఈ చిత్ర యూనిట్. ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ ను పోస్ట్ చేశాడు అర్జున్. హీరో ఆడవాళ్ల చెప్పులతో కనిపించే వీడియో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. రొటీన్ కు భిన్నంగా ఉండే స్టోరీ కావడంతో ఇప్పటికే ఈ వీడియోను చాలా మంది యూట్యూబ్ లో వీక్షించారు. ఏది ఏమైతేనేం సినిమాకు మంచి హైప్ వచ్చేసింది. ఆర్ బాల్కీ కథను అందించడంతో పాట దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement