ఆ ముద్దు సన్నివేశాలకు 36 టేక్‌లు నిజమే | Kissing scene didn't need 36 retakes: Manisha Yadav | Sakshi
Sakshi News home page

ఆ ముద్దు సన్నివేశాలకు 36 టేక్‌లు నిజమే

Published Tue, Jul 7 2015 3:01 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM

ఆ ముద్దు సన్నివేశాలకు 36 టేక్‌లు నిజమే

ఆ ముద్దు సన్నివేశాలకు 36 టేక్‌లు నిజమే

 జీవీ.ప్రకాష్ కుమార్ నటి మనీషా యాదవ్ ముద్దు సన్నివేశాలను 36 టేక్‌లో చిత్రీకరించినట్లు ప్రచారం మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం విధితమే. అయితే అందులో నిజమెంత అనే చర్చకు కూడా ఆస్కారం లేక పోలేదు. ఇక వివరాల్లోకెళితే.. జీవీ.ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం త్రిష ఇల్లన్న నయనతార. క్యామియో ఫిలింస్ పతాకంపై సిజె.జయకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని ఆధిక్ రవిచంద్రన్ నిర్వహిస్తున్నారు.
 
  ఆనంది, మనీషా యాదవ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వ బాధ్యతల్ని తన భుజస్కంధాలపైనే వేసుకున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం నగరంలోని సత్యం థియేటర్లలో నిర్వహించారు. కార్యక్రమ వ్యాఖ్యాత ముద్దు సన్నివేశంలో 36 టేక్స్ విషయం గురించి జీవీ.ప్రకాష్‌కుమార్‌ను వివరణ నివ్వవలసిందిగా కోరగా తనకు తెలిసి నాలుగైదు టేక్సే తీసినట్లు అన్నారు. అయినా ఆ విషయం గురించి దర్శకుడుని అడగంటూ తప్పిచుకున్నారు. అయితే త్రిష ఇల్లన్నా నయనతార ఒక అకేషన్ లాంటి చిత్రం అన్నారు.
 
  తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇందులో మూడు పాటలు తనను బాగా ఆకట్టుకున్నాయని చెప్పారు. దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ మాట్లాడితే ఈ చిత్రంలో జీవీ.ప్రకాష్ కుమార్ మనీషా యాదవ్ ముద్దు సన్నివేశానికి 36 టేక్స్ చేసిన సంగతి నిజమేనన్నారు. ఇంకో టేక్ కూడా చేద్దామనుకున్నామనీ సెట్‌లో తన తండ్రి ఉండడంతో 36 టేక్స్‌తోనే సరి పెట్టినట్లు తెలిపారు. నిజానికి ఆ సన్నివేవానికి వివిధ యాంగిల్స్ అవసరమయ్యాయని వివరించారు. చిత్ర ఆడియోను దర్శకుడు ఎఆర్.మురుగదాస్ ఆవిష్కరించగా చిత్ర దర్శకుడి తండ్రి రవిచంద్రన్ తదితర చిత్ర ప్రముఖులు అందుకున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గీన్ కేఇ.జ్ఞానవేల్ రాజా విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement