Prakash Kumar
-
డార్లింగ్-2గా మారిన జిన్
జిన్ చిత్రం డార్లింగ్-2గా మారింది.యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌ను కథానాయకుడిగా పరిచయం చేయడంతో పాటు విజయాన్ని అందించిన చిత్రం డార్లింగ్. ఈ చిత్రాన్ని విడుదల చేసిన స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్‌రాజా జీవీ.ప్రకాశ్‌కుమార్ నటించిన తాజా చిత్రం త్రిష ఇల్లన్న నయనతార చిత్రాన్ని విడుదల చేసి మరోసారి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు డార్లింగ్-2 చిత్ర విడుదల హక్కుల్ని సొంతం చేసుకోవడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ సీక్వెల్ చిత్రం అంటే అంతకు ముందు చిత్ర కథకు కొనసాగింపు అయి ఉండనవసరం లేదన్నారు. డార్లింగ్-2 చిత్ర కథ, కథనాలు తనను బాగా ఆకట్టుకున్నాయని అన్నారు. ముఖ్యంగా స్నేహం, హార్రర్ ఇతి వృత్తంతో కూడిన ఈ చిత్రం విజయంపై నమ్మకం ఏర్పడడంతో విడుదల హక్కుల్ని పొందినట్లు వెల్లడించారు. ఈ డార్లింగ్-2 చిత్రాన్ని రిట్ మీడియా వర్క్స్ సంస్థ జిన్ పేరుతో నిర్మించింది. నవ దర్శకుడు సతీష్ చంద్రశేఖరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెడ్రాస్ చిత్రం ఫేమ్ కలైఅరసన్, మాయ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో కాళీవెంకట్, అర్జున్. మునీష్కాంత్,మెడ్రాస్జానీ,రమీజ్రాజ్ నటించారు.ఈ చిత్రాన్నే డార్లింగ్-2 పేరుతో జ్ఞానవేల్‌రాజా అక్టోబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఆ ముద్దు సన్నివేశాలకు 36 టేక్‌లు నిజమే
జీవీ.ప్రకాష్ కుమార్ నటి మనీషా యాదవ్ ముద్దు సన్నివేశాలను 36 టేక్‌లో చిత్రీకరించినట్లు ప్రచారం మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం విధితమే. అయితే అందులో నిజమెంత అనే చర్చకు కూడా ఆస్కారం లేక పోలేదు. ఇక వివరాల్లోకెళితే.. జీవీ.ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం త్రిష ఇల్లన్న నయనతార. క్యామియో ఫిలింస్ పతాకంపై సిజె.జయకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని ఆధిక్ రవిచంద్రన్ నిర్వహిస్తున్నారు. ఆనంది, మనీషా యాదవ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వ బాధ్యతల్ని తన భుజస్కంధాలపైనే వేసుకున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం నగరంలోని సత్యం థియేటర్లలో నిర్వహించారు. కార్యక్రమ వ్యాఖ్యాత ముద్దు సన్నివేశంలో 36 టేక్స్ విషయం గురించి జీవీ.ప్రకాష్‌కుమార్‌ను వివరణ నివ్వవలసిందిగా కోరగా తనకు తెలిసి నాలుగైదు టేక్సే తీసినట్లు అన్నారు. అయినా ఆ విషయం గురించి దర్శకుడుని అడగంటూ తప్పిచుకున్నారు. అయితే త్రిష ఇల్లన్నా నయనతార ఒక అకేషన్ లాంటి చిత్రం అన్నారు. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇందులో మూడు పాటలు తనను బాగా ఆకట్టుకున్నాయని చెప్పారు. దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ మాట్లాడితే ఈ చిత్రంలో జీవీ.ప్రకాష్ కుమార్ మనీషా యాదవ్ ముద్దు సన్నివేశానికి 36 టేక్స్ చేసిన సంగతి నిజమేనన్నారు. ఇంకో టేక్ కూడా చేద్దామనుకున్నామనీ సెట్లో తన తండ్రి ఉండడంతో 36 టేక్స్తోనే సరి పెట్టినట్లు తెలిపారు. నిజానికి ఆ సన్నివేవానికి వివిధ యాంగిల్స్ అవసరమయ్యాయని వివరించారు. చిత్ర ఆడియోను దర్శకుడు ఎఆర్.మురుగదాస్ ఆవిష్కరించగా చిత్ర దర్శకుడి తండ్రి రవిచంద్రన్ తదితర చిత్ర ప్రముఖులు అందుకున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గీన్ కేఇ.జ్ఞానవేల్ రాజా విడుదల చేయనున్నారు. -
షాక్ అయిన శ్రీదివ్య
నటి శ్రీ దివ్య చాలా దిగ్భ్రా ంతికి గురయ్యారు. తమిళంలో హీరోయిన్గా ఎదుగుతున్న తెలుగమ్మాయి శ్రీ దివ్య. వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం జీవా చిత్రంలో విష్ణు విశాల్ సరసన యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్‌కు జంటగా పెన్సిల్ చిత్రంలోనూ నటిస్తున్నారు. వీటితోపాటు శివకార్తికేయన్‌తో ఒక చిత్రం, విక్రమ్ ప్రభుకు జంటగా మరో చిత్రం అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. విష్ణు విశాల్ రొమాన్స్ చేసిన జీవా చిత్రం ఈ నెల 26న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇలాంటి పరిస్థితిలో శ్రీ దివ్యకు ఒక షాకింగ్ న్యూస్ ఎదురైంది. అదేమిటంటే ఆ మధ్య నటి శ్వేతాబసు వ్యభిచార కేసులో అరెస్టయి సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఆ కలకలం సద్దుమణగకముందే ఇటీవల ఆంధ్ర రాష్ట్రం గుంటూరుకు చెందిన నటి దివ్యశ్రీని పోలీసులు బ్రోతల్ కేసులో అరెస్టు చేశారు. అయితే దివ్యశ్రీకి బదులు శ్రీ దివ్య ఫొటోలను కొన్ని వెబ్‌సైట్స్‌లో పెట్టేశారు. ఇది తెలిసిన శ్రీ దివ్య షాక్‌కు గురయ్యారు. పేర్ల తికమకతోనే ఇలా జరిగిందని గ్రహించిన శ్రీ దివ్య తాను దివ్యశ్రీని కాదని తన పేరు శ్రీ దివ్య అని ఫోన్లలో విచారిస్తున్న వారికి క్లారిటీ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా వెబ్‌సైట్స్‌లో తన ఫొటోలను తొలగించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నారు నటి శ్రీ దివ్య.