షాక్ అయిన శ్రీదివ్య | I'm not Divya Sri caught in the sex scandal: Sri Divya | Sakshi
Sakshi News home page

షాక్ అయిన శ్రీదివ్య

Published Sun, Sep 14 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

షాక్ అయిన శ్రీదివ్య

షాక్ అయిన శ్రీదివ్య

నటి శ్రీ దివ్య చాలా దిగ్భ్రా ంతికి గురయ్యారు. తమిళంలో హీరోయిన్‌గా ఎదుగుతున్న తెలుగమ్మాయి శ్రీ దివ్య. వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం జీవా చిత్రంలో విష్ణు విశాల్ సరసన యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్‌కు జంటగా పెన్సిల్ చిత్రంలోనూ నటిస్తున్నారు. వీటితోపాటు శివకార్తికేయన్‌తో ఒక చిత్రం, విక్రమ్ ప్రభుకు జంటగా మరో చిత్రం అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు.
 
 విష్ణు విశాల్ రొమాన్స్ చేసిన జీవా చిత్రం ఈ నెల 26న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇలాంటి పరిస్థితిలో శ్రీ దివ్యకు ఒక షాకింగ్ న్యూస్ ఎదురైంది. అదేమిటంటే ఆ మధ్య నటి శ్వేతాబసు వ్యభిచార కేసులో అరెస్టయి సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఆ కలకలం సద్దుమణగకముందే ఇటీవల ఆంధ్ర రాష్ట్రం గుంటూరుకు చెందిన నటి దివ్యశ్రీని పోలీసులు బ్రోతల్ కేసులో అరెస్టు చేశారు. అయితే దివ్యశ్రీకి బదులు శ్రీ దివ్య ఫొటోలను కొన్ని వెబ్‌సైట్స్‌లో పెట్టేశారు.
 
 ఇది తెలిసిన శ్రీ దివ్య షాక్‌కు గురయ్యారు. పేర్ల తికమకతోనే ఇలా జరిగిందని గ్రహించిన శ్రీ దివ్య తాను దివ్యశ్రీని కాదని తన పేరు శ్రీ దివ్య అని ఫోన్లలో విచారిస్తున్న వారికి క్లారిటీ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా వెబ్‌సైట్స్‌లో తన ఫొటోలను తొలగించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నారు నటి శ్రీ దివ్య.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement