డార్లింగ్-2గా మారిన జిన్ | Jinn is now Darling-II | Sakshi
Sakshi News home page

డార్లింగ్-2గా మారిన జిన్

Published Thu, Sep 24 2015 3:11 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

డార్లింగ్-2గా మారిన జిన్

డార్లింగ్-2గా మారిన జిన్

జిన్ చిత్రం డార్లింగ్-2గా మారింది.యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌ను కథానాయకుడిగా పరిచయం చేయడంతో పాటు విజయాన్ని అందించిన చిత్రం డార్లింగ్. ఈ చిత్రాన్ని విడుదల చేసిన స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్‌రాజా జీవీ.ప్రకాశ్‌కుమార్ నటించిన తాజా చిత్రం త్రిష ఇల్లన్న నయనతార చిత్రాన్ని విడుదల చేసి మరోసారి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు డార్లింగ్-2 చిత్ర విడుదల హక్కుల్ని సొంతం చేసుకోవడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ సీక్వెల్ చిత్రం అంటే అంతకు ముందు చిత్ర కథకు కొనసాగింపు అయి ఉండనవసరం లేదన్నారు. డార్లింగ్-2 చిత్ర కథ, కథనాలు తనను బాగా ఆకట్టుకున్నాయని అన్నారు.
 
  ముఖ్యంగా స్నేహం, హార్రర్ ఇతి వృత్తంతో కూడిన ఈ చిత్రం విజయంపై నమ్మకం ఏర్పడడంతో  విడుదల హక్కుల్ని పొందినట్లు వెల్లడించారు. ఈ డార్లింగ్-2 చిత్రాన్ని రిట్ మీడియా వర్క్స్ సంస్థ జిన్ పేరుతో నిర్మించింది. నవ దర్శకుడు సతీష్ చంద్రశేఖరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెడ్రాస్ చిత్రం ఫేమ్ కలైఅరసన్, మాయ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో కాళీవెంకట్, అర్జున్. మునీష్‌కాంత్,మెడ్రాస్‌జానీ,రమీజ్‌రాజ్ నటించారు.ఈ చిత్రాన్నే డార్లింగ్-2 పేరుతో జ్ఞానవేల్‌రాజా అక్టోబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement