సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బర్త్‌డే (డిసెంబరు 27, సోమవారం)సందర్భంగా హీరోయిన్ జెనీలియా డిసౌజా శుభాకాంక్షలు తెలిపారు. అయితే సల్మాన్ ఖాన్‌ను విష్ చేసేందుకు జెనీలియా సోమవారం సాయంత్రం పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. గతంలో జెనీలియా, సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేసిన ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.షేర్ చేసిన కొన్నిగంటల్లో, ఈ క్లిప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
పెద్ద మనసున్న సల్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సంతోషం, ప్రేమ, చక్కటి ఆరోగ్యంతో ఉండేలా ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఆజ్ భాయ్ కా బర్త్‌డే హై." అంటూ జెనీలియా తనఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులతోపాటు, హీరో, హీరోయిన్ల ద్వారా సల్మాన్‌కు శుభాకాంక్షల వెల్లువ కురిసింది. ముఖ్యంగా సల్మాన్ మాజీ ప్రేయసి, కొత్త పెళ్లి కూతురు, హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా సల్మాన్‌కు బర్త్‌డే విషెస్ అందించింది.
కాగా సల్మాన్ ఖాన్ శనివారం రాత్రి పన్వేల్ ఫామ్‌హౌస్‌లో విషం లేని పాము కాటుకు గురయ్యారు. నవీ ముంబైలోని కమోథేలోని ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆదివారం ఉదయం డిశ్చార్జ్ అయిన సల్మాన్ కుటుంబంతో కలిసి సోమవారం తన ఫామ్‌హౌస్‌లో 56వ పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment