2006లో విడుదలైన బొమ్మరిల్లు సినిమా అందులో నటించిన వారికి, తీసిన మేకర్స్‌కి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల దృష్టిలో నిలిచిపోయింది. దర్శకుడు భాస్కర్‌ని బొమ్మరిల్లు భాస్కర్‌గా మార్చింది. నిర్మాత దిల్ రాజుకు లాభాల పంట పండించింది. అందరూ ఈ సినిమాను అంతగా ఆధరించారు కాబట్టే తెలుగులోనే కాకుండా ఇతర మూడు భాషల్లో విడుదలై అక్కడ కూడా విజయాలను సాధించింది. తమిళంలో సంతోష్ సుబ్రహ్మణ్యంగా విడుదలైన సినిమాలలో జయం రవి సరసన జెనీలియానే కథానాయికగా నటించి తన నటనతో తమిళ ప్రేక్షకులను కూడా కట్టిపడేసింది.
ఇంత మంచి సినిమా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్న నిర్మాత బోణీ కపూర్ 2007లోనే ఈ చిత్ర రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. అప్పటికి ఇంకా సినిమాల్లోకి అడుగుపెట్టని హర్మాన్ భవేజాని హీరోగా పరిచయం చేస్తూ అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఇట్స్ మై లైఫ్ అంటూ బొమ్మరిల్లును హిందీలో రీమేక్ చేశాడు. కానీ షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత సినిమా రిలీజ్ అవ్వలేదు. కారణం ఏదైనా ఆ సినిమా ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు. (నానికి విలన్‌గా మరో యంగ్ హీరో)
అయితే 13 సంవత్సరాల తర్వాత ఇట్స్ మై లైఫ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవ్వడం మొదలైన తర్వాత ఎప్పటి నుంచో విడుదలకు నోచుకోని సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వైపు అడుగులేయడం మొదలుపెట్టాయి. ఇట్స్ మై లైఫ్ సినిమాకు కూడా ఇదే మంచి అవకాశం అనుకొని నవంబర్ 29న జీ5 యాప్‌లో విడుదల చేద్దామని నిర్ణయించుకున్నారు. ప్రకాశ్ రాజ్ పాత్రలో సీనియర్ నటుడు నానా పాటేకర్ మనల్ని అలరించనున్నారు. హాసిని లాగా జెనీలియా చేసే క్యూట్ యాక్టింగ్‌ను మళ్లీ మనం చూడబోతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment